‘దేవర’ నిర్మాతలకు ఏపీ హైకోర్టు షాక్‌! | AP High Court Order On Devara Movie Tickets Prices Hike | Sakshi
Sakshi News home page

Devara Movie: ‘దేవర’ నిర్మాతలకు ఏపీ హైకోర్టు షాక్‌!

Published Wed, Sep 25 2024 12:48 PM | Last Updated on Wed, Sep 25 2024 1:05 PM

AP High Court Order On Devara Movie Tickets Prices Hike

దేవర సినిమా టికెట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. టికెట్‌ ధర పెంపును 14 రోజుల కాకుండా 10 రోజులకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల రేటును పెంచుకునే వెలుసుబాటు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి దేవర నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. 

(చదవండి: పరారీలో హర్షసాయి.. పైగా ఇన్ స్టాలో పోస్టులు)

దీంతో 14 రోజుల పాటు టికెట్ల రేటు పెంచుకునే వెసులుబాటుతో పాటు రిలీజ్‌ రోజు ఆరు ఆటలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యూలు జారీ చేసింది. అంతేకాకుండా 9 రోజుల వరకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెలుసుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా దేవర టికెట్‌ ధర పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. ధర పెంపును 14 రోజల వరకు పొడగించడాన్ని తప్పు పట్టింది. పెంచిన ధరలు 10 రోజుల వరకే పరిమితం చేయాలని ఏపీ​ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement