ఆకట్టుకునే ‘పెళ్లిచూపులు’ | Pelli chupulu preview | Sakshi
Sakshi News home page

ఆకట్టుకునే ‘పెళ్లిచూపులు’

Published Mon, Jul 25 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM

Pelli chupulu preview

విజయవాడ (లబ్బీపేట) : ఈనెల 29న విడుదల కానున్న పెళ్లిచూపులు సినిమా యూనిట్‌ సోమవారం ట్రెండ్‌సెట్‌ మాల్‌లోని క్యాపిటల్‌ సినిమాస్‌లో సందడి చేసింది. క్యాపిటల్‌ సినిమాస్‌లో ఆ సినిమా ప్రివ్యూ షోను సోమవారం రాత్రి  యూనిట్‌ సభ్యులు వీక్షించారు. కథానాయిక రీతూవర్మతో పాటు దర్శకుడు తరుణ్‌ భాస్కర్, నిర్మాతలు రాజ్‌ కందుకూరి, యాష్‌ రంగినేనితో పాటు పలువురు నటులు పాల్గొన్నారు. హీరో విజయ్‌ దేవరకొండ వేరొక సినిమా షూటింగ్‌లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయినట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు.  ఈ సందర్భంగా హీరోయిన్‌ రీతూవర్మ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమన్నారు. ఇప్పుడు కథానాయుకగా నటించడం సంతోషంగా ఉందని, మహేష్, అల్లు అర్జున్‌తో కలిసి సినిమాలో నటించాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ‘పెళ్లిచూపులు’ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉంటుందని, కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా పేర్కొన్నారు.  యువతను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మంచి వినోదాన్ని పంచుతుందని చెప్పారు. మంచి కథతో పాటు, హాస్యం, వినోదం అన్నీ మిళతమైన సినిమాగా పేర్కొన్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement