
కరెన్సీకి ‘మేకిన్ ఇండియా’ భద్రతా ఫీచర్లు
న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి మరింతగా ఊతమిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ సోమవారం కరెన్సీ భద్రత ఫీచర్లకు సంబంధించి బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. గతంలో జారీ చేసిన రెండు టెండర్లను రద్దు చేస్తూ.. మేకిన్ ఇండియా ప్రమాణాలను తప్పనిసరి చేసే నిబంధనను జోడించి కొత్తగా మరో టెండర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సరఫరాదారు రెండేళ్ల వ్యవధిలో దేశీయంగా తయారీ యూనిట్ నెలకొల్పాలి. అలాగే క్రమంగా స్థానిక కంటెంట్‌ను కూడా పెంచాల్సి ఉంటుంది.
పాకిస్తాన్ దేశస్తు లు లేదా ఆ దేశ మూలాలు ఉన్న వారి సర్వీసులను ఈ ప్రాజెక్టులో ఉపయోగించబోమని బిడ్డరు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. సెక్యూరిటీ థ్రెడ్స్, ఇంకు, సెక్యూరిటీ ఫైబర్, అడ్వాన్స్‌డ్ వాటర్‌మార్క్ మొదలైనవి సరఫరా చేసేందుకు ఆర్‌బీఐ ఈ టెండర్‌ను ఉద్దేశించింది.