⇒ నిమ్స్ మెడికల్ షాపుల కేటాయింపులో గోల్‌మాల్
⇒ గతంలో తొలగించిన సంస్థకే మళ్లీ కేటాయింపు?
⇒ తెరవెనుక పావులు కదుపుతున్న ఓ ఉన్నతాధికారి
⇒ ఏడాదిలో రూ.1.14 కోట్లలాభాలొచ్చినా ప్రైవేట్ వైపే మొగ్గు
ఆస్పత్రికి కాసులు కురిపించే నిమ్స్ మెడికల్ షాపులకు అంతా కలిసి ‘టెండర్’ వేశారు. కొంతమంది అధికారులు, గుత్తేదారులతో కుమ్మక్కై గతంలో తొలగించిన వారికే మళ్లీ షాపులు అప్పగించేందుకు కుట్ర చేస్తున్నారు. కేవలం ఏడాది కాలంలో ఆస్పత్రికి రూ.1.14 కోట్లు లాభాలు ఆర్జించి పెట్టిన దుకాణాలను కనీసం టెండర్ పిలువకుండా ఓ బినామీ సంస్థకు కట్టేబెట్టేందుకు నిమ్స్ అధికారులు యత్నిస్తున్నారు. -సాక్షి, సిటీబ్యూరో