
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ కాలువ లైనింగ్.. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే అభివృద్ధి పనుల టెండర్‌ను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదించింది. మంగళవారం విజయవాడలో ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో ఎస్‌ఎల్‌టీసీ సమావేశమై టెండర్ ప్రక్రియను పరిశీలించింది.
రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్టు విలువ రూ.1,017.22 కోట్లు ఉండగా.. 1.622% తక్కువ ధర(రూ.1,000.716)కు కోట్ చేసి పీఎన్‌సీ ఇన్‌ఫ్రా సంస్థ ఎల్–1గా నిలిచింది. దీని వల్ల ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి. ఈ ప్రక్రియ సజావుగా జరిగినట్లు గుర్తించిన ఎస్‌ఎల్‌టీసీ టెండర్‌ను ఆమోదించింది. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాకు పనులు అప్పగించడానికి అనుమతిచ్చింది. దీంతో ఆ సంస్థకు పనులు అప్పగిస్తూ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment