potireddypadu
-
శ్రీశైలం డ్యాం.. అందాలు చూడటానికి సిద్దమా!
శ్రీశైలం ప్రాజెక్ట్(నంద్యాల జిల్లా): శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుండటంతో శనివారం గేట్లు ఎత్తనున్నారు. గురువారం సాయంత్రానికి డ్యాం నీటి మట్టం 880.20 అడుగులకు చేరుకుంది. మరో 4.80 అడుగులు పెరిగితే గరిష్టస్థాయి 885 అడుగులకు చేరుకుంటుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి 1,65,255 క్యూసెక్కుల వరద ప్రవాహం డ్యాంకు వస్తోంది. జలాశయం నుంచి దిగువ ప్రాంతాలకు సగటున 40 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శనివారం నాటికి జలాశయ నీటిమట్టం 882 అడుగులకు పైబడి చేరుకోనుంది. దీంతో ఆదే రోజు ఉదయం 11 గంటల సమయంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శ్రీశైలం ప్రాజెక్ట్ చేరుకుని డ్యాం రేడియల్క్రస్ట్ గేట్లను తెరచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 10 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 597 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పాదనను నిలిపివేయగా, ఎడమగట్టు కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతోంది. (క్లిక్: మగదూడ పుడితే రూ.500 వెనక్కి ఇస్తారు!) -
శ్రీశైలంలో ఏపీ కోటా 34 టీఎంసీలే
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఏటా వరదల సమయం (జూలై–అక్టోబర్)లో 34 టీఎంసీల జలాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. చెన్నై నగరానికి తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్సార్బీసీ) ఆయకట్టు కోసం మరో 19 టీఎంసీలు డ్రా చేసుకోవడానికి మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, ప్రధాన కాల్వ, బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్, ఎస్సార్బీసీ నిర్మాణానికి గతంలో సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని స్పష్టం చేసింది. 34 టీఎంసీలకు మించి జలాలను తీసుకోకుండా ఏపీని నిలువరించాలని కృష్ణా బోర్డును కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ ఈ నెల 12న లేఖ రాశారు. చెన్నై నగరానికి తాగునీటి విడుదలపై గత నెల 23న కృష్ణాబోర్డు భేటీలో చర్చకు వచ్చిన అంశాలకు స్పందనగా ఈ లేఖ రాశారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. త్రైపాక్షిక ఒప్పంద ఉల్లంఘన ►1976, 1977లో జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం చెన్నై నగర తాగునీటి అవసరాలకు జూలై–అక్టోబర్ మధ్య కాలంలో శ్రీశైలం నుంచి పెన్నాకు కాల్వ ద్వారా 15 టీఎంసీల నీటిని తరలించాలి. ప్రవాహం 1,500 క్యూసెక్కులకు మించరాదు. తాగునీరు తప్ప ఇతర అవసరాలకు వాడరాదు. అయితే నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒప్పందం స్ఫూర్తికి విరుద్ధంగా శ్రీశైలం నుంచి 175 కి.మీ. దూరంలోని చెన్నముక్కపల్లి వద్ద ఆఫ్–టేక్ పాయింట్ (కాలవ చివరి పాయింట్)ను ఏర్పాటు చేసింది. 175 కి.మీ. కాల్వను 11,150 క్యూసెక్కుల సామర్థ్యంతో చెన్నముక్కపల్లి వరకు నిర్మించి అక్కడ నుంచి పెన్నా నది వరకు 3 కి.మీ.ల కాల్వను 1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించింది. ఇది అంతర్రాష్ట్ర ఒప్పంద ఉల్లంఘనే. ►అంతర్రాష్ట్ర ఒప్పందాల స్ఫూర్తి, ప్రణాళిక సంఘం అనుమతులు, కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పు ప్రకారం చెన్నైకి తాగునీటిని తీసుకెళ్లే కాల్వను సాగునీటి అవసరాలకు వినియోగించరాదు. దీనికి విరుద్ధంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, కాల్వల సామర్థ్యం పెంచింది. ఏటా పోతిరెడ్డిపాడు నుంచి భారీ మొత్తంలో నీటిని మళ్లిస్తోంది. 2021–22లో ఇప్పటికే 112 టీఎంసీలను శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లింది. చెన్నముక్కపల్లి నుంచి పెన్నాకు తరలిస్తున్న నీటి లెక్కలు, సాగుకు వినియోగిస్తున్న నీటి లెక్కలు లేవు. ►సుప్రీంకోర్టు, కృష్ణా ట్రిబ్యునల్–2, కేఆర్ఎంబీ ముందు వాస్తవాలుంచడానికి అన్ని పాయింట్ల వద్ద నీటి ప్రవాహ లెక్కలను తెలుసుకోవడం తెలంగాణకు అత్యవసరం. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద ప్రారంభమయ్యే అన్ని కాల్వలు, చెన్నముక్కపల్లి ఆఫ్–టేక్ పాయింట్, కండలూరు, పూండి కాల్వల వద్ద సెన్సార్ బేస్డ్ రియల్ టైమ్ డేటా అక్విజిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ►తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా రాజోలిబండ మళ్లింపు పథకం ఆధునికీకరణకు సంబంధించిన అంశా లను కృష్ణా బోర్డు సమావేశాల ఎజెండాలో చేర్చాలి. ‘ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీలు..’ శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ద్వారా 45 టీఎంసీల నికర జలాల వినియోగానికి అనుమతిం చాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గురువారం లేఖ రాశారు. గోదావరి నుంచి 80 టీఎంసీలను పోలవరం ద్వారా కృష్ణాలోకి మళ్లించేందుకు గోదావరిట్రిబ్యునల్ ముందు ఏపీ ప్రభుత్వం 1978లో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టుతో కృష్ణాలో అదనపు నికర జలాల లభ్యత ఉండనుందని సుస్పష్టమే. ఈనేపథ్యంలో 45 టీఎంసీల కృష్ణా జలాలకుగాను ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మించు కుంటామని 1985 ఆగస్టు 4న నాటి ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీ అనుమతి కోరింది. అయితే పోలవరం ప్రాజెక్టుకు అనుమతిచ్చిన తర్వాతే ఎస్ఎల్బీసీకి అనుమతులు కోరాలని అప్పట్లో సీడబ్ల్యూసీ చెప్పింది. దీనికి విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టుకు అనుమతులొ చ్చిన తర్వాత కృష్ణా నికర జలాల ఆధారంగా శ్రీశైలం కుడిగట్టు కాల్వ (ఎస్సార్బీసీ) ప్రాజెక్టును నాటి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే ఎస్ఎల్ బీసీ ద్వారా 45 టీఎంసీల కృష్ణా జలాల వినియోగానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరింది. -
కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను అక్రమంగా తరలించడాన్ని తక్షణమే ఆపేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు గురువారం మరో లేఖ రాసింది. నీటి తరలింపు కేడబ్లు్యడీటీ–1 (కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్) తీర్పునకు వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్ మురళీధర్, కేఆర్ఎంబీ చైర్మన్‌కు రాసిన లేఖలో వివరించారు. 1976–77 అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే జూలై నుంచి అక్టోబర్ వరకు మద్రాసు (చెన్నై)కు తాగునీటి కోసం మళ్లించాలని పేర్కొన్నారు. 15 వేల క్యూసెక్కుల సామర్థ్యం మించకుండా చెన్నైకి నీటిని తరలించాలని ఒప్పందంలో పేర్కొన్న విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. ఈఎన్సీ రాసిన లేఖలోని ముఖ్యాంశాలు.. ►సెంట్రల్ వాటర్ కమిషన్ 1981లో బనకచెర్ల వద్ద కేవలం ఒక్క క్రాస్ రెగ్యులేటర్‌కు మాత్రమే అనుమతించింది. ►ఎస్కేప్ రెగ్యులేటర్‌ను తరువాతి కాలంలో అనుమతి లేకుండా నిర్మించారు. ►అనుమతి లేకుండా శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 20,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచారు. ►పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని విడుదల చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో నీటి తరలింపు ఆపేయాలి. ►గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్ 2లో అనుమతించిన ప్రాజెక్టులుగా పేర్కొన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ కాలువ, ఎస్కేప్ రెగ్యులేటర్, తెలుగు గంగా ప్రాజెక్టు రెగ్యులేటర్లను అనుమతిలేని ప్రాజెక్టులుగా పేర్కొనాలి. ►శ్రీశైలం ప్రాజెక్టును జలవిద్యుత్ ప్రాజెక్టుగానే కృష్ణా ట్రిబ్యునల్ పరిగణించింది. ►19 టీఎంసీలను శ్రీశైలం కుడి కాలువకు, 15 టీఎంసీలు చెన్నై తాగునీటికి మొత్తం 34 టీఎంసీలు మాత్రమే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం నుం చి మళ్లించడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతించింది. అంతకు మించి నీటి తరలింపును అనుమతించరాదని ఆ లేఖలో పేర్కొన్నారు. -
పోతిరెడ్డిపాడు పాపం కేసీఆర్‌దే..
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడును కాంగ్రెస్ పార్టీనే మొదలుపెట్టిందని, కాంగ్రెస్‌కు చెందిన మంత్రులే ప్రోత్సహించారని.. టీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నిజానికి పోతిరెడ్డిపాడును ఆపాలని కాంగ్రెస్ నాయకులే ఉద్యమాలు చేశారని ఆయన స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద భట్టి విలేకరులతో మాట్లాడుతూ.. అసలు పోతిరెడ్డిపాడు పాపం కేసీఆర్‌దేనని వ్యాఖ్యానించారు. 1985–86 ప్రాంతంలో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు పనులు మొదలు పెట్టిందని చెప్పారు. ఆ సమయంలో టీడీపీ శాసనసభ్యుడిగా ఉన్న కేసీఆరే దానికి బాధ్యుడని విమర్శించారు. దాదాపు 406 కిలోమీటర్లు ఓపెన్ కెనాల్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 15 టీఎంసీలను చెన్నై నగరానికి తాగునీటి కోసం తీసుకువెళ్లే పని మొదలుపెట్టిందే నాడు కేసీఆర్ మంత్రిగా ఉన్న ప్రభుత్వమని చెప్పారు. ఓపెన్ కెనాల్ వల్లనే ఏపీ నాయకులు నీళ్లు తోడుకోవడం, అడ్డగోలుగా నీటిని తీసుకెళ్లే వీలుకలిగిందని భట్టి పేర్కొన్నారు. పాపం కేసీఆర్ చేస్తే.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపైనే నిందలు వేస్తారా అని నిలదీశారు. కృష్ణా నదిపై సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్‌ను ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం తాము చేశామని, ఇది చాలా ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ అరిచిగీపెట్టినా ఈ ప్రభుత్వం నిద్ర లేవలేదని ఎద్దేవా చేశారు. ఏడాది తర్వాత లేచి అరుస్తున్నారని, అప్పుడు కూడా కేసీఆర్‌కు సోయి లేక కాదని, ఆయనకు తెలంగాణ ప్రయోజనాల కంటే స్వంత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. -
‘పోతిరెడ్డిపాడు–గోరకల్లు’ టెండర్ ఆమోదం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ కాలువ లైనింగ్.. ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే అభివృద్ధి పనుల టెండర్‌ను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ(ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదించింది. మంగళవారం విజయవాడలో ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో ఎస్‌ఎల్‌టీసీ సమావేశమై టెండర్ ప్రక్రియను పరిశీలించింది. రివర్స్ టెండరింగ్‌లో కాంట్రాక్టు విలువ రూ.1,017.22 కోట్లు ఉండగా.. 1.622% తక్కువ ధర(రూ.1,000.716)కు కోట్ చేసి పీఎన్సీ ఇన్ఫ్రా సంస్థ ఎల్–1గా నిలిచింది. దీని వల్ల ఖజానాకు రూ.16.504 కోట్లు ఆదా అయ్యాయి. ఈ ప్రక్రియ సజావుగా జరిగినట్లు గుర్తించిన ఎస్‌ఎల్‌టీసీ టెండర్‌ను ఆమోదించింది. పీఎన్సీ ఇన్ఫ్రాకు పనులు అప్పగించడానికి అనుమతిచ్చింది. దీంతో ఆ సంస్థకు పనులు అప్పగిస్తూ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి వర్క్ ఆర్డర్ జారీ చేయనున్నారు. -
పోతిరెడ్డిపాడు కాలువ వ్యవస్థ అభివృద్ధి పనులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్ట్ జలవిస్తరణ ప్రాంతం నుంచి కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), గాలేరు–నగరి కాలువను గోరకల్లు రిజర్వాయర్ బెర్మ్ వరకూ (0 కి.మీ. నుంచి 56.77 కి.మీ. వరకూ) అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పీఆర్పీ(పోతిరెడ్డిపాడు) హెడ్ రెగ్యులేటర్.. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేయనుంది. ఈ పనులకు రూ.1,061.69 కోట్ల అంచనా వ్యయంతో ఓపెన్ విధానంలో 36 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో సోమవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ► ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈ నెల 14న సాయంత్రం ఐదు గంటల వరకూ షెడ్యూళ్లు దాఖలు చేసుకోవచ్చు. ► ఈ నెల 15న ప్రీ–క్వాలిఫికేషన్ బిడ్ సమావేశాన్ని కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ నిర్వహిస్తారు. షెడ్యూళ్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన రూ.7.8 కోట్ల డీడీలను సీఈకి అందజేయాలి. ► ఈ నెల 18న ఉదయం 11 గంటలకు ఆర్థిక (ప్రైస్) బిడ్ తెరుస్తారు. ఈ బిడ్‌లో తక్కువ ధర (ఎల్–1)కు కాంట్రాక్టు సంస్థ కోట్ చేసిన మొత్తాన్ని ‘కాంట్రాక్టు విలువ’గా పరిగణించి.. అదే రోజున మధ్యాహ్నం 2.00 నుంచి 4.30 గంటల వరకూ ‘ఈ–ఆక్షన్’(రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఈ– ఆక్షన్‌లో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్ట్ సంస్థకు పనులను అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని ఎస్‌ఎల్‌టీసీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ)కి ప్రతిపాదనలు పంపుతారు. ► ఈ నెల 21న ఎస్‌ఎల్‌టీసీ టెండర్ ప్రక్రియను పరిశీలించి, ఆమోదించి, కాంట్రాక్ట్ సంస్థకు వర్క్ ఆర్డర్ జారీ చేయడానికి అనుమతి ఇస్తుంది. ► కృష్ణా నది నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద వచ్చే 30 నుంచి 40 రోజుల్లోనే.. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాజెక్ట్‌లను నింపడం ద్వారా కరువును తరిమికొట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన సంగతి విదితమే. -
పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగేంతవరకూ పోరాటం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా పోతిరెడ్డిపాడు విస్తరణ జరిగితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోతుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనీయబోమని, పోతిరెడ్డిపాడు విస్తరణ ఆగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ నాగం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉత్తమ్ అతిథిగా హాజరయ్యారు. కమిటీ కన్వీనర్ టి.రామ్మోహన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మాజీ మంత్రి ప్రసాద కుమార్, మాజీ ఎంపీ మల్లు రవిలతో పాటు పలువురు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఉత్తమ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం సాగునీరు ప్రధాన ఎజెండాగా సాగిందన్నారు. గతంలో పోతిరెడ్డి పాడు విస్తరణ జరిగినప్పుడు కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నారని, ఆరుగురు టీఆర్ఎస్ మంత్రులు కూడా ఉన్నారని, అప్పుడు కిమ్మనని కేసీఆర్ ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌తో కలిసి కృష్ణా నీటిని ఆంధ్రకు తీసుకుపోయేలా సహకరిస్తున్నారని ఆరోపించారు. జీవోలిచ్చి పనులు ప్రారంభిస్తున్నా కేసీఆర్ అడ్డుచెప్పడంలేదన్నారు. కాంగ్రెస్ పోరాటం మొదలు పెట్టిన తర్వాత ఒక ప్రకటన చేశారని ఉత్తమ్ తెలిపారు. కేసీఆర్‌కు అవగాహన లేదు: నాగం అనంతరం విలేకరులతో నాగం మాట్లాడుతూ పోతిరెడ్డి పాడు విస్తరణతో దక్షిణ తెలంగాణకు భారీ నష్టం జరుగుతుందన్నారు. నదీ జలాలపై కేసీఆర్‌కు ఏ మాత్రం అవగాహన లేదని, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. కేసీఆర్, జగన్‌లు సమావేశం అయ్యాకే జగన్ సంగమేశ్వర్ ప్రాజెక్టు జీవో ఇచ్చారని, దీంతో 170 టీఎంసీల నీటిని ఏపీ సర్కారు తరలించుకుని పోతోందన్నారు. కృష్ణా నుంచి పెన్నా బేసిన్‌కు తీసుకెళ్లాలని ప్రణాళిక రచించారని ఆరోపించారు. తమ కమిటీ కృష్ణా పరీవాహకంల్లోని అన్ని గ్రామాలు తిరుగుతుందని, కేసీఆర్ చేసుకున్న లోపాయికారి ఒప్పందాలను బయటపెడుతామని నాగం అన్నారు. మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఏపీ తెచ్చిన 203 జీవోను రద్దు చేయాలని, పాలమూరు రంగారెడ్డి పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. కమిటీ పేరు మార్పు కాగా, పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ పేరును కృష్ణా నదీ జలాల పరిరక్షణ కాంగ్రెస్ కమిటీగా మార్చారు. తొలుత సమావేశంలో భాగంగా పోతిరెడ్డి పాడు విస్తరణపై నాగం జనార్దన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కరోనా టెస్టులు ఉచితంగా చేయాలి గవర్నర్‌కు టీపీసీసీ లేఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా కరోనా పరీక్షలు చేయించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ మేరకు టీపీసీసీ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ పక్షాన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డిలు సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ చుట్టుపక్కల 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించడం హర్షణీయమని, టెస్టులకయ్యే ఖర్చును ప్రభుత్వమే ఆయా ఆస్పత్రులకు రీయింబర్స్ చేయాలని టీపీసీసీ నేతలు విన్నవించారు. -
నాడు మోసం.. నేడు మౌనం!
ప్రాజెక్టులు కడితే మిగులు జలాలపై హక్కు వస్తుందన్న వైఎస్సార్.. చంద్రబాబు దీన్ని విస్మరించడంతో 258 టీఎంసీలను కర్ణాటక, మహారాష్ట్రలకు పంచిన ట్రిబ్యునల్ సాక్షి, అమరావతి: దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద జలాలను తరలించి నీటి కష్టాలను కడతేర్చడం, పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్(పీహెచ్‌పీ) కాలువల సామర్థ్యాన్ని 80 క్యూసెక్కులకు పెంచనుండటం, కేటాయించిన జలాలను 800 అడుగుల మట్టం నుంచి తరలించేందుకు సిద్ధం కావటాన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు మౌనం వహించడాన్ని సాగునీటి రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడకుండా పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో మోసం చేసిన చంద్రబాబు నేడు నోరుమెదపకపోవడాన్ని విమర్శిస్తున్నారు. (నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలి) బాబు నిర్వాకంతోనే ఆల్మట్టి ఎత్తు పెంపు కర్ణాటక సర్కార్ 1996లో ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుతుంటే నాడు చంద్రబాబు చోద్యం చూశారు. ప్రాజెక్టులు నిర్మిస్తే మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కు వస్తుందని అప్పటి ప్రతిపక్ష నేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సూచనలను పెడచెవిన పెట్టి నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు తీరని ద్రోహం చేశారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నిర్వాకం వల్లే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతి ఇచ్చిందని, మిగులు జలాల్లో కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీలు పంపిణీ చేసిందని గుర్తు చేస్తున్నారు. ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం తప్పదని స్పష్టం చేస్తున్నారు. మిగులు హక్కు ఎగువ రాష్ట్రాలకు ధారాదత్తం 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నానంటూ ప్రచారం చేసుకుని కృష్ణా జలాలపై హక్కులను ఎగువ రాష్ట్రాలకు ధారపోశారని సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ఒత్తిడి వల్ల బచావత్ ట్రిబ్యునల్ అవార్డును పునఃసమీక్షించేందుకు 2000లో ఆదేశాలు జారీ చేసిన కేంద్రం 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. కృష్ణా నీటిని వినియోగించుకుని తెలుగు నేలను సస్యశ్యామలం చేసేందుకు జలయజ్ఞంలో భాగంగా దివంగత వైఎస్సార్ 2004లో ఏపీలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, పులిచింతల, తెలుగుగంగ.. తెలంగాణలో నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్సెల్బీసీ తదితర ప్రాజెక్టులు చేపట్టారు. తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు నీళ్లందించే పీహెచ్‌పీ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచితే అప్పట్లో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించారు. పీహెచ్‌పీ సామర్థ్యం పెంపును నిరసిస్తూ తెలంగాణలోనూ, ప్రకాశం బ్యారేజీపై టీడీపీ నేతలతో ధర్నాలు చేయించారు. 2014 నుంచి 2019 వరకు బాబు అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని తరలించేలా ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టలేదు. రాష్ట్ర ప్రయోజనాలపై టీడీపీ మౌనం కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టి రాయలసీమ, నెల్లూ రు జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరుమెదపకపోవడాన్ని సాగునీటి రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. టీడీపీ నేతలు మౌనం వహిస్తుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరువు నేలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు బాసటగా నిలవాల్సిన ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయలసీమ, నెల్లూరు ప్రజలను మరోసారి మోసం చేస్తూ తన నైజాన్ని బయటపెట్టుకున్నారని పేర్కొంటున్నారు. -
చంద్రబాబు బీజేపీతో లాలూచీ పడ్డారు
-
బాబూ మీ వల్లే పోలవరానికి తీవ్ర అన్యాయం...
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘మంచి పనులు చేస్తామంటే అధికారులు ఎవరూ అడ్డుపడరు. సమీక్షల పేరుతో తన అనకూల వర్గానికి బిల్లులు క్లియర్ చేయమని చంద్రబాబు ఆదేశిస్తున్నారు. బిల్లులు క్లియర్ చేస్తే వచ్చే ప్రభుత్వానికి అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు అప్పట్లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ వద్దని ఉద్యమం నడిపారు. ఇక మంత్రి దేవినేన ఉమ ఏకంగా కృష్ణా బ్యారేజ్ వద్ద సత్యగ్రహం చేశాడు. 2014కు ముందు చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం సందర్శించాడా?. ఈ ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమే. మీ వల్లే పోలవరానికి తీవ్ర అన్యాయం జరిగింది. అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. సీఎం నిర్ణయం వల్లే రాష్ట్రానికి సుమారు రూ.30వేల కోట్ల అదనపు భారం పడింది.’ అని తన లేఖలో కేవీపీ పేర్కొన్నారు. -
ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం
సాగునీటి ప్రాజెక్టుల వద్ద నిద్రించైనా పెండింగ్ పనులను పూర్తి చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు 2015 మే 12న బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థను పరిశీలించిన సమయంలో రైతాంగానికి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్లీ పెండింగ్ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటర్ ప్రారంభాన్ని ఏటేటా వాయిదా వేçస్తూ.. పెండింగ్‌లో ఉన్న 15 శాతం పనులను పూర్తి చేయించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. జూపాడుబంగ్లా(కర్నూలు): రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, తమిళనాడులోని చెన్నై ప్రాంతాలకు తాగు, సాగునీటికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండెకాయ లాంటిది. శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపునకు ఉద్దేశించిన నూతన హెడ్‌రెగ్యులేటర్ పెండింగ్ పనులను పూర్తి చేసి..ప్రారంభోత్సవం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పెండింగ్‌లో ఉన్నది 15 శాతం పనులే అయినప్పటికీ వాటిని కూడా పూర్తి చేయలేకపోతోంది. 2015 మార్చి 5న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరును పరిశీలించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంద రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయించటంతో పాటు 2015 జూన్ నుంచి నూతన హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయిస్తానని ప్రకటించారు. సీఎం, మంత్రి ఇరువురూ ప్రాజెక్టులను సందర్శించి మూడేళ్లకు పైగా అవుతున్నా పనులు మాత్రం పూర్తి చేయించిన దాఖలాల్లేవు. పెండింగ్ పనులపై శ్రద్ధేదీ? రూ.201.347 కోట్ల అంచనా వ్యయంతో 2006 డిసెంబరులో నూతన హెడ్‌రెగ్యులేటర్ పనులు ప్రారంభమయ్యాయి. 2010 నాటికి దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. పనుల పెండింగ్ కారణంగా పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో ఏటా టీఎంసీల కొద్దీ నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి. 16.5 కి.మీ మేర ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్ఆర్ఎంసీ)ను బానకచర్ల వద్ద విస్తరించాల్సి ఉంది. అలాగే కాలువలో పూడిక తొలగించాలి. 0 నుంచి 9 కి.మీ వరకు కాలువ ఎడమగట్టును పటిష్టంచేసి.. స్టాండర్డు బ్యాంకు నిర్మించాల్సి ఉంది. కాలువ కుడిగట్టు వెంట బీటీ రహదారిని, నాలుగు ప్రాంతాల్లో వంతెనలను, అధికారుల నివాసగృహాలు, కంట్రోల్‌రూంను నిర్మించాలి. ఈ పనులన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి. పూర్తికాని ఎస్ఆర్బీసీ విస్తరణ పనులు పోతిరెడ్డిపాడుకు దిగువన ఉన్న తెలుగుగంగ, కేసీఎస్కేప్ కాలువలు 11వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుకూలంగా ఉన్నా.. శ్రీశైలం కుడి ఉప కాలువ (ఎస్ఆర్బీసీ)ను మాత్రం 22వేల క్యూసెక్కులకు అనుగుణంగా విస్తరించలేదు. విస్తరణ పనులు నేటికీ కొన..సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలువకు 4 –5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గట్లు తెగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఎస్ఆర్బీసీని విస్తరించేదాకా 22వేల క్యూసెక్కుల నీటిని సరఫరాచేసే అవకాశం లేదు. నిర్వహణ లోపంతో గేట్ల మొరాయింపు నీటిసరఫరా నిలిచిన వెంటనే అధికారులు హెడ్‌రెగ్యులేటరు గేట్లకు మరమ్మతులు చేపట్టి.. నీటివిడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. అయితే.. ఇవేవీ పట్టించుకోకపోవటంతో పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల గేట్లు తుప్పుపట్టి ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేం అన్నట్లుగా మారాయి. కొత్త హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న పదిగేట్లలో ఆరు గేట్లకు రబ్బర్‌షీల్స్ ఊడిపోయాయి. వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించకముందే డ్యాంలోకి నీళ్లు రావటంతో పనులు నిలిచిపోయాయి. మొండికేసిన కాంట్రాక్టర్లు 0 నుంచి 9 కిలోమీటర్ల మేర స్టాండర్డు బ్యాంకును నిర్మించేదిలేదని కాంట్రాక్టర్లు అధికారులకు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరితే బ్యాక్‌వాటర్ కారణంగా ఎస్ఆర్ఎంసీ ఎడమగట్టుకు అభద్రత నెలకొనే ప్రమాదం ఉంది. 2009 వరదల సమయంలో బలహీనంగా ఉన్న ఎడమగట్టు తెగి.. దిగువన ఉన్న నంద్యాల పట్టణంతో పాటు మరికొన్ని ప్రాంతాలు మునకకు గురయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేయించటంతో పాటు నూతన హెడ్‌రెగ్యులేటరు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. కొంత సమయం పడుతుంది పోతిరెడ్డిపాడు నీటినియంత్రణ వ్యవస్థ ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. గాలేరు నగరి గేట్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అలాగే ఎర్రగూడూరు వద్ద ఎస్ఆర్ఎంసీ పనులు పూర్తికావాలి. వీటితోపాటు కంట్రోల్‌రూం, బీటీరోడ్డు నిర్మాణం, స్టాఫ్‌రూం, స్టాండర్డ్బ్యాంక్ నిర్మాణ పనులు త్వరలో చేపడతాం. – మనోహర్‌రాజు, ఈఈ, పోతిరెడ్డిపాడు -
‘చంద్రబాబు ఖాతాలో రూ. 15లక్షల కోట్లు’
సాక్షి, కర్నూలు : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి పేరుతో 15 లక్షల కోట్లు చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు లైనింగ్ పనులు వెంటనే చేపట్టి పూర్తి చేసి, దిగువకు 22 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను మంగళవారం వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘునాథరెడ్డి, ఐజయ్య పరిశీలించారు. 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డి పాడును రాయలసీమ రైతుల కోసం 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని తెలిపారు. పోతిరెడ్డి పాడు నుంచి భానకచెర్ల వరకు కాల్వ లైనింగ్ పనులు పూర్తి చేస్తే 22 వేల క్యూసెక్కుల నీరు భానచెర్లకు అక్కడి నుంచి తెలుగుగంగ, ఎస్సార్బీసీ, వెలుగోడు రిజర్వాయర్‌కు నీరు వదిలే అవకాశం ఉన్నా ఏమీ పట్టకుండా మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలిపారు. రాయలసీమకు నీరు తామే ఇచ్చామంటూ టీడీపీ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో గరిష్ట స్థాయిలో నీరు ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీరు విడుదల చేయడం లేదని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా వాసులు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక వైఎస్ఆర్ కుటుంబానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ వైఎస్ఆర్ కుటుంబంలో 75లక్షల మంది భాగస్వామ్యులు అయ్యారన్నారు. -
పోతిరెడ్డిపాడు నుంచి 4500 క్యూసెక్కులు విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 4,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం తెలిపారు. శ్రీశైలం జలాశయంలో 871.70 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 870.70 అడుగులుగా నమోదైనట్లు చెప్పారు. పోతిరెడ్డిపాడు గేట్ల ద్వారా 2,500క్యూసెక్కులు, నాగార్జున విద్యుత్తు ఉత్పత్తికేంద్రం నుంచి 1,800 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీలోకి విడుదల చేస్తున్నారు. ఈనీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ వద్ద ఎస్సార్బీసీకి 2 వేల క్యూసెక్కులు, తెలుగుగంగకు 1,700, కేసీ ఎస్కేప్ కాల్వకు 800 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. -
మంత్రి దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్
-
మంత్రి దేవినేని ఉమకు వైఎస్ జగన్ ఫోన్
కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఫోన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికొట వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గండికోట ముంపు ప్రాంతాల సమస్య తీర్చాలని, పులివెందుల బ్రాంచి కెనాల్‌కు తాగు, సాగు నీటిని వెంటనే విడుదల చేయాలన్నారు.