పోతిరెడ్డిపాడు నుంచి 4500 క్యూసెక్కులు విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 4,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం తెలిపారు. శ్రీశైలం జలాశయంలో 871.70 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 870.70 అడుగులుగా నమోదైనట్లు చెప్పారు. పోతిరెడ్డిపాడు గేట్ల ద్వారా 2,500క్యూసెక్కులు, నాగార్జున విద్యుత్తు ఉత్పత్తికేంద్రం నుంచి 1,800 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీలోకి విడుదల చేస్తున్నారు. ఈనీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ వద్ద ఎస్సార్బీసీకి 2 వేల క్యూసెక్కులు, తెలుగుగంగకు 1,700, కేసీ ఎస్కేప్ కాల్వకు 800 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు.