![How to Tell If Your Water Broke During Pregnancy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/preg.jpg.webp?itok=9VvWe6g8)
నాకు ఇప్పుడు ఎనిమిదవ నెల. ముందుగానే ఉమ్మనీరు పోతే కష్టమని విన్నాను. ఉమ్మనీరు పోతే ఎలా తెలుసుకోవాలి? ఏమైనా ప్రమాదం ఉంటుందా?
– మమత, జమ్మలమడుగు.
శిశువు చుట్టూ గర్భంలో ఉమ్మనీరు ఉంటుంది. ఉమ్మనీరు కొంతమందిలో మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా, వెజైనా లేదా సర్విక్స్ బలహీనమైనా, ఎనిమిదవ నెలలో ఉమ్మనీరు సంచి పలుచనైయి, చిట్లుతుంది. అప్పుడు నొప్పులు లేకుండానే ఉమ్మనీరు పోవటం వలన లోపల శిశువుకు, తల్లికి ఇన్‌ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. 24 వారాల నుంచి 37 వారాల లోపల ఉమ్మనీరు పోతే ప్రీమెచ్యూర్ బర్త్ అంటాం.
ఇది తెలుసుకోవటం కొందరికి తెలియక పోవచ్చు. అకస్మాత్తుగా నీరు వెజైనా నుంచి పోవటం, కంట్రోల్ చేసుకోలేకపోవటం, ధారగా ఉండటం, యూరిన్ వాసన లేకపోవటం లాంటివి ఉంటే, ఇంట్లోనే తెలుసుకోవచ్చు. లేదా వెంటనే డాక్టర్‌ని కలిస్తే, వారు స్పెక్యులమ్ పరీక్ష ద్వారా చెక్ చెస్తారు. అమోనిసోర్ అనే టెస్ట్ ద్వారా కూడా డాక్టర్ చెక్ చేస్తారు. ఇది వెజైనల్ స్వాబ్ టెస్ట్ లాగా ఉంటుంది.
ఇది 99 శాతం సెన్సిటివ్ టెస్ట్. మీరు ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ పరీక్షతో పాటు, మీ పల్స్, బీపీ, టెంపరేచర్ చెక్ చేసి ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉందా అని చూస్తారు. ఒకవేళ లీకింగ్ ఉందని తెలిస్తే, అడ్మిట్ చేసి 24–48 గంటలు అబ్జర్వ్ చేస్తారు. ఈ సమయంలో బేబీ వెల్ బీయింగ్ స్కాన్ చేస్తారు. యాంటీబయోటిక్స్ ఇస్తారు. నెలలు నిండలేదు కాబట్టి శిశువుకు లంగ్ మెచ్యూరిటీ కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు. నియో నాటాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ చేసి ప్రీమెచ్యుర్ బేబీ రిస్క్స్, కాంప్లికేషన్స్, కేర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు.
ఒకవేళ మీకు నొప్పులు వచ్చి, ప్రసవం అవుతుంటే సురక్షితంగా, ఎలా కాన్పు చెయ్యాలి అని చూస్తారు. ఒకవేళ నొప్పులు రాకపోతే, పైన చెప్పినట్లు యాంటీబయోటిక్స్ ఇచ్చి, అబ్జర్వ్ చేసి డిశ్చార్జ్ అయిన తరువాత ఇంట్లో ఎలా మానిటర్ చేసుకోవాలో వివరిస్తారు. వారానికి రెండుసార్లు ఉమ్మనీరు, బేబీ బ్లడ్ ఫ్లో స్టడీస్ చేస్తారు. ప్రెగ్నెన్సీ 37 వారాల వరకు పొడిగించడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలో చెప్తారు. రెగ్యులర్ చెకప్స్, ఫాలో అప్స్‌లో ఏ సమస్య లేకుండా డాక్టర్ సలహాలను పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment