srmc
-
ఎస్ఆర్ఎంసీ కాల్వకు గండి
సాక్షి, కర్నూలు : ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ నది ఉప్పొంగుతుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఫ్లో అధికంగా ఉండటంతో.. మంగళవారం కర్నూలు జిల్లా జూటూరు గ్రామ సమీపంలో ఎస్ఆర్ఎంసీ కాల్వకు గండి పడింది. దీంతో శ్రీశైలం బ్యాక్ వాటర్.. భారీగా తెలుగు గంగలోకి చేరుతుంది. వరద నీరు కారణంగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ముంపుకు గరయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జిల్లాలోని కొత్తపల్లి మండలం మూసలిమడుగు, గుమ్మడాపురం, సింగరాజు గ్రామాల్లోకి శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చి చేరుతోంది. దీంతో ఆయా గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. పంట పొలాల నుంచి గ్రామాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
పోతిరెడ్డిపాడు నుంచి 4500 క్యూసెక్కులు విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 4,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం తెలిపారు. శ్రీశైలం జలాశయంలో 871.70 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు వద్ద 870.70 అడుగులుగా నమోదైనట్లు చెప్పారు. పోతిరెడ్డిపాడు గేట్ల ద్వారా 2,500క్యూసెక్కులు, నాగార్జున విద్యుత్తు ఉత్పత్తికేంద్రం నుంచి 1,800 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీలోకి విడుదల చేస్తున్నారు. ఈనీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ వద్ద ఎస్సార్బీసీకి 2 వేల క్యూసెక్కులు, తెలుగుగంగకు 1,700, కేసీ ఎస్కేప్ కాల్వకు 800 క్యూసెక్కుల ప్రకారం విడుదల చేస్తున్నట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. -
పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి 6,500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. విడుదల చేసిన నీటిలో తెలుగుగంగ కాల్వకు 3,800 క్యూసెక్కులు, ఎస్సార్బీసీ కాల్వకు 1,700, కేసీ ఎస్కేప్ కాల్వకు 1,000 క్యూసెక్కుల చొప్పున పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు వద్ద 878.48 అడుగుల నీటిమట్టం ఉందన్నారు.