సాక్షి, కర్నూలు : ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణ నది ఉప్పొంగుతుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ ఫ్లో అధికంగా ఉండటంతో.. మంగళవారం కర్నూలు జిల్లా జూటూరు గ్రామ సమీపంలో ఎస్‌ఆర్‌ఎంసీ కాల్వకు గండి పడింది. దీంతో శ్రీశైలం బ్యాక్ వాటర్.. భారీగా తెలుగు గంగలోకి చేరుతుంది. వరద నీరు కారణంగా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ముంపుకు గరయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు జిల్లాలోని కొత్తపల్లి మండలం మూసలిమడుగు, గుమ్మడాపురం, సింగరాజు గ్రామాల్లోకి శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చి చేరుతోంది. దీంతో ఆయా గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. పంట పొలాల నుంచి గ్రామాల్లోకి వరద నీరు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment