సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు మరోసారి బహిరంగ లేఖ రాశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ...‘మంచి పనులు చేస్తామంటే అధికారులు ఎవరూ అడ్డుపడరు. సమీక్షల పేరుతో తన అనకూల వర్గానికి బిల్లులు క్లియర్ చేయమని చంద్రబాబు ఆదేశిస్తున్నారు. బిల్లులు క్లియర్ చేస్తే వచ్చే ప్రభుత్వానికి అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు అప్పట్లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ వద్దని ఉద్యమం నడిపారు.
ఇక మంత్రి దేవినేన ఉమ ఏకంగా కృష్ణా బ్యారేజ్ వద్ద సత్యగ్రహం చేశాడు. 2014కు ముందు చంద్రబాబు ఎప్పుడైనా పోలవరం సందర్శించాడా?. ఈ ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వమే. మీ వల్లే పోలవరానికి తీవ్ర అన్యాయం జరిగింది. అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు. సీఎం నిర్ణయం వల్లే రాష్ట్రానికి సుమారు రూ.30వేల కోట్ల అదనపు భారం పడింది.’ అని తన లేఖలో కేవీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment