సెలబ్రిటీనే ఇలా చేస్తే ఎలా?.. మీకు రూల్స్‌ వర్తించవా? | Tollywood Anchor Savitri Reels On Hyderabad ORR Goes Viral On Instagram | Sakshi
Sakshi News home page

Anchor Savitri Reels Controversy: మీరే ఇలా చేస్తే ఎలా?.. రీల్స్‌ పిచ్చిలో టాలీవుడ్ యాంకర్..!

Jun 20 2024 10:09 PM | Updated on Jun 21 2024 1:10 PM

Tollywood Anchor Savitri Reels On Hyderabad ORR Goes Viral On Instagram

సోషల్ మీడియా వచ్చాక రీల్స్‌ చేయడం ఓ పిచ్చి అలవాటుగా మారిపోయింది. ఎక్కడపడితే రీల్స్‌ చేస్తూ న్యూసెన్స్‌  క్రియేట్ చేస్తున్నారు. మెట్రో, బస్సులు, రైళ్లు, రోడ్లను కూడా వదలడం లేదు. కొందరైతే రీల్స్‌ పిచ్చిలో పడి ఏకంగా ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రీల్స్ చేస్తున్నారు.

అలాంటి లిస్ట్‌లో మన సెలబ్రిటీ, యాంకర్ సావిత్రి కూడా చేరిపోయింది. హైదరాబాద్‌లో ఓఆర్ఆర్‌పై రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు తప్ప మనుషులకు నడవడానికి అవకాశం లేదు. ఓఆర్ఆర్‌పై దాదాపు 120 స్పీడుతో వాహనాలు వెళ్తుంటాయి. అప్పడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి.

మరి నిబంధనలు అమల్లో ఉన్న ప్రాంతాల్లో రీల్స్‌ చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అని నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఆమెను చూసి.. మరికొందరు రీల్స్ చేస్తే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇలాంటి వారిని ఓఆర్ఆర్‌పై రీల్స్‌ చేయకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లేదంటే రాబోయే రోజుల్లో ఓఆర్ఆర్‌ను రీల్స్‌కు అడ్డాగా మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆమెపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement