
నుజ్జునుజ్జయిన కారు , నరేందర్,నాగమణి (ఫైల్)
శామీర్‌పేట్: ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయపడిన సంఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కూకట్‌పల్లికి చెందిన బి.నరేందర్(46), అతని భార్య నాగరాణి(42), కుమారుడు వినయ్, దీపికతో కలిసి ఇన్నోవా కారులో చౌటుప్పల్‌లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా శామీర్‌పేట ఓర్‌ఆర్‌ఆర్‌పై బ్రిడ్జీపై కారు డివైడర్‌ను వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది బాధితులను చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా నరేందర్, నాగమణి మృతిచెందారు. వారి కుమారుడు వినయ్, కుమార్తె దీపిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శామీర్‌పేట పోలీసులు పంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నవీన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment