రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం ఓఆర్ఆర్ వద్ద శనివారం బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.