దగ్దమైన కారు,ఒకరు సజీవ దహనం | Car catches fire on Hyderabad ORR | Sakshi
Sakshi News home page

దగ్దమైన కారు,ఒకరు సజీవ దహనం

Published Wed, Feb 20 2019 1:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సుల్తాన్‌పూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. జౌటర్‌పై వెళ్తున్న కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడటంతో కారులో చిక్కుకున్న ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ కారు మేడ్చల్‌ నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తుంది. రిజిస్టేషన్‌ నంబర్‌ను(TS 07 GM 4666) బట్టి ఈ వాహనం మియాపూర్‌కు చెందిన శ్రీదేవి పేరు మీద ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.   

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement