
రంగారెడ్డి : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి కి వెళ్తుండగా నార్సింగి సర్కిల్ వద్ద రెండు కార్లు అతివేగంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ కావడంతో భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే గచ్చిబౌలి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారు నడుపిన ఇద్దరు వ్యక్తులే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. వీరంతా సూర్యాపేటకు చెందినవారుగా పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment