ఔటర్‌పై ప్రమాదం : ఐపీఎస్‌ అధికారికి గాయాలు | IPS VV Srinivasa Rao Injured In Road Accident At ORR Hyderabad | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం : ఐపీఎస్‌ అధికారికి గాయాలు

Published Wed, Jul 15 2020 9:53 PM | Last Updated on Wed, Jul 15 2020 10:30 PM

IPS VV Srinivasa Rao Injured In Road Accident At ORR Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌పై వెళ్తున్న తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు‌ కారు బోల్తా పడింది. తెలంగాణ పోలీసు అకాడమీ నుంచి కొండాపూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావుతోపాటుగా డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వారిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement