48 గంటల్లో రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి | Hyderabad: Hmda Issues Legal Notices To Revanth Reddy On Orr Issue | Sakshi
Sakshi News home page

48 గంటల్లో రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి

Published Sat, May 27 2023 2:37 AM | Last Updated on Sat, May 27 2023 11:13 AM

Hyderabad: Hmda Issues Legal Notices To Revanth Reddy On Orr Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నెహ్రూ ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతి (టీఓటీ)లో లీజుకివ్వడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆయనకు శుక్రవారం హెచ్‌ఎండీఏ లీగల్‌ నోటీసులు పంపింది.

ఈ వ్యవహారంలో హెచ్‌ఎండీఏతో పాటు అధికారులపై రేవంత్‌రెడ్డి తప్పు డు, నిరాధార, ధ్రువీకరించలేని ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే తన ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేదంటే తాము తీసుకోబోయే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ లీగల్‌ నోటీసులో పేర్కొంది. కాగా, హెచ్‌ఎండీఏ నోటీసులపై తాను న్యాయపరంగానే పోరాడుతానని రేవంత్‌ చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement