సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 20న శంకుస్థాపన చేయనున్నారు. దీని నిర్మాణానికి రూ.669 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కేంద్రం ఓవైపు ఓఆర్‌ఆర్ నిర్మాణం చేపడుతుండగా, రాష్ట్రప్రభుత్వం కూడా పనులు చేపట్టనుంది.
వరంగల్ ఓఆర్‌ఆర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పాటు శంకుస్థాపనకు అంగీకరించిన కేసీఆర్‌కు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ఓఆర్‌ఆర్ ప్రతిపాదనలు, అంచనాలు రూపొందించడంలో కడియం ప్రత్యేక చొరవ తీసుకున్నారని సీఎం కొనియాడారు. అదే స్ఫూర్తితో నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించాలని కడియంను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment