
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్)పై టోల్‌గేట్ల టెండర్లను ఖరారు చేసేందుకు హైకోర్టు ధర్మాసనం హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు అనుమతినిచ్చింది. టెండర్లను ఖరారు చేయవద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
నెలకు రూ.21.25 కోట్లను కనీస మొత్తంగా చెల్లించేలా టెండర్లను ఖరారు చేస్తూ హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రకు చెందిన ఇంద్రదీప్ నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సింగిల్ జడ్జి టెండర్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చునని, అయితే టెండర్లను మాత్రం ఎవరి పేరు మీదా ఖరారు చేయవద్దని హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించింది. దీనిపై ధర్మాసనం ముందు హెచ్‌ఎండీఏ అధికారులు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
Comments
Please login to add a commentAdd a comment