హైదరాబాద్, సాక్షి: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) పరిధిలోని పలు గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణణం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి రావాలని పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలు విలీనం అయ్యాయి.
పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో కుత్బుల్లాపూర్, తారామతిపేట పంచాయతీలు
దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లోకి కీసర, యాద్‌గిర్ పల్లి, అంకిరెడ్డిపల్లి
ఘట్‌కేసర్ మున్సిపాలిటీలోకి ఎదుతాబాద్, ఘనపూర్, మణిప్యాల్, అంకుశపూర్, ఔశాపూర్
మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూరు, రాయలపూర్ గ్రామాలు
పోచారం మున్సిపాలిటీలోకి కొర్రెముల, కాచనవానిసింగారం, చౌదరిగూడ, బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి దయరా, వెంకటాపూర్, ప్రతాప సింగారం
తుంకుంట మున్సిపాలిటీలోకి బోంరాస్‌పేట, శామీర్‌పేట, బాబాగూడ
Comments
Please login to add a commentAdd a comment