villeges
-
అక్క తగ్గేదేలే...
-
ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం
హైదరాబాద్, సాక్షి: ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని పలు గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణణం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. 51 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి రావాలని పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలు విలీనం అయ్యాయి. పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో కుత్బుల్లాపూర్, తారామతిపేట పంచాయతీలుదమ్మాయిగూడ మున్సిపాలిటీల్లోకి కీసర, యాద్గిర్ పల్లి, అంకిరెడ్డిపల్లి ఘట్కేసర్ మున్సిపాలిటీలోకి ఎదుతాబాద్, ఘనపూర్, మణిప్యాల్, అంకుశపూర్, ఔశాపూర్మేడ్చల్ మున్సిపాలిటీలోకి పూడూరు, రాయలపూర్ గ్రామాలుపోచారం మున్సిపాలిటీలోకి కొర్రెముల, కాచనవానిసింగారం, చౌదరిగూడ, బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి దయరా, వెంకటాపూర్, ప్రతాప సింగారం తుంకుంట మున్సిపాలిటీలోకి బోంరాస్‌పేట, శామీర్‌పేట, బాబాగూడ -
గ్రామాల పరిశుభ్రతకు వై ఎస్ జగన్ సర్కార్ భారీ ప్లాన్
-
లాక్డౌన్: హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు పయనం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బుధవారం నుంచి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ పది రోజుల పాటు(మే 21) వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో జనం సొంతూళ్లకు పయనం అయ్యారు. ఇక ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు లాక్డౌన్ ఆంక్షలకు సడలింపు ఇవ్వటంతో జనం పెద్ద ఎత్తున బయలుదేరి 10 గంటలలోపే తమ సొంతూళ్లకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. పలు ప్రాంతాలకు వెళ్లవల్సిన ప్రయాణికులు బస్సుల కోసం రోడ్లపైనే ఎదురుచూస్తున్నారు. అందరూ ఒకేసారి రోడ్లపైకి రావడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఔదార్యం చాటిన సిర్సనగండ్ల సర్పంచ్ -
కరోనా సునామి.. పల్లెల్లో తగ్గుముఖం.. పట్టణాల్లో ఉత్పాతం..
సాక్షి, వేములవాడరూరల్: పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా కేసుల సంఖ్య పెరిగాయి. కానీ ప్రస్తుతం పల్లెల్లో కరోనా కేసుల సంఖ్య కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లు ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. వేములవాడ మండలంలోని చాలా గ్రామాల్లో కరోనా కేసులు ఈ మధ్యకాలంలో పెరిగాయి. దీంతో గ్రామాల వారీగా ప్రత్యేకంగా కట్టడి చేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కొంతవరకు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మండలంలోని ఫాజుల్‌నగర్, నూకలమర్రి గ్రామాలతో పాటు తదితర గ్రామాల్లో కరోనా వాక్సిన్ను వైద్యాధికారులు ప్రత్యేక క్యాంపు ద్వారా ప్రజలకు వేశారు. దీంతో పాటు మండలంలో అత్యధికంగా మల్లారం, జయవరం గ్రామాల్లో కేసులు పెరగడంతో ఆ రెండు గ్రామాల్లో సెల్ఫ్‌లాక్‌డౌన్ విధించుకున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాలలో వారు తీసుకున్న కరోనా నివారణ చర్యల్లో ప్రస్తుతం తగ్గుముఖం పట్టినట్లు తెలిసింది. కరోనా విలయ తాండవం వేములవాడ: వేములవాడలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం ఆడుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరంగా మారిందనడానికి వేములవాడలో నిత్యం వినిపించే మరణాలే నిదర్శనం. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి ఆక్సీజన్ లెవెల్స్ తగ్గిపోయి కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడుతుండటం వేములవాడ ప్రాంతంలో జనం బేంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల్లో ఇరవైకిపైగా కరోనా కాటుకు బలైన ఘటనలు ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. తేరుకునేలోగానే.. కాస్త జ్వరం, జలుబు, దగ్గు అనిపించి ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ కరోనా టెస్టులు చేయించుకుని హోమ్ క్వారంటైన్ ఉన్న నాగరాజు, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందిన కొబ్బరికాయల రాజు, అర్చకులు దామెదర్‌లు కేవలం పాజిటివ్ వచ్చిన వారం రోజులకే మృత్యువాతపడ్డారు. ఏం జరుగుతుందోనని తెలుసుకునేలోగానే వీరంతా తుది శ్వాస విడిచారు. గుడికి పెరుగుతున్న రద్దీ.. విచ్చలవిడిగా తిరుగుతున్న జనం వేములవాడ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో రాజన్న గుడికి భక్తులు, స్థానికులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతుండటం స్థానికంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. రాత్రి 9 గంటల నుంచి చేపట్టే కర్ఫ్యూ సైతం అంతంత మాత్రంగానే కొనసాగుతుండటంతో మరింత భయం పెరిగింది. నాలుగు రోజుల్లోనే మాయమయ్యాడు నిత్యం కళ్లముందే బుల్లెట్ తిరుగుతుండే నాగరాజు వారం రోజుల క్రితం పాజిటివ్ వ చ్చింది. దీంతో హోమ్ క్వారంటైన్లో ఉన్నాడు. నాలుగు రోజుల వ్యవధిలోనే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని చెప్పడంతో హుటాహుటిన వేములవాడకు అక్కడ్నుంచి కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 25న మరణించాడని నాగరాజు బంధువులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లో తుదిశ్వాస అందరినీ ఆప్యాయంగా మందలిస్తూ రాజన్న గుడి ముందు కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముకునే రాజు కరోనా కాటుకు బలయ్యాడు. కరోనా పాజిటివ్ రావడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో మూడు రోజులు చికిత్స పొందాడు. ఆక్సీజన్ లెవెల్స్ తగ్గడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 25న మరణించాడని సహచర వ్యాపారులు చెబుతున్నారు. ఏం జరిగిందోనని తెలుసుకునేలోగానే.. నాంపల్లి గుట్టకు వెళ్లిన భక్తులను నవ్వుతూ పలుకరించడమే కాకుండా ఆశీర్వాదాలు ఇచ్చి పంపించే అర్చకుడు దామోదర్ వారం రోజుల క్రితం పాజిటివ్ వచ్చింది. వారి సమీప బంధువు వైద్యశాఖలో పని చేస్తున్నారు. మందులు తీసుకొచ్చే వాడుకోమని చెప్పారు. నాలుగు రోజుల క్రితం శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని అనడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగానే ఆక్సీజన్ లెవెల్స్ 80 వరకే ఉన్నాయని చెప్పారు. దీంతో ఈనెల 26న ఉదయం మరణించాడని ఆలయ అధికారి ఒకరు వివరించారు. -
వావ్..ఆ పల్లెటూరు బ్యూటిఫుల్
పచ్చని పంటలు, పాడి పశువులు, కల్మషమెరుగని మనుషులతో ఉండే పల్లెటూళ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పట్నవాసాల్లో బిజీబిజీగా జీవితాలు గడిపేవారు పచ్చని పరిసరాలను చూసి మనసుపారేసుకోకుండా ఉండరు. అసలు ఇండోనేసియాలోని ఓ పల్లెటూరును, డెన్మార్క్‌లోని మరో పట్నాన్ని చూస్తే వావ్.. వాట్ ఏ బ్యూటిఫుల్ అనకుండా ఎవరూ ఉండలేరేమో.! అచ్చం బండి చక్రంలా.. డెన్మార్క్ రాజధాని కొపెన్‌హెగాన్ ఆనుకుని ఉన్న బ్రాండ్బీ హేవ్‌బీ నగరంలోని ప్లాట్ల లేఅవుట్ చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. చక్రం ఆకారంలోని లేఅవుట్లో, ఆకుపచ్చని పరిసరాల మధ్య ఉన్న ఇళ్లను చూసి భలే ముచ్చటపడిపోతారు. పురాతన డానిష్ గ్రామాల నమూనాతో ఈ ప్రాంతాన్ని 1964లో ఎరిక్ మైగిండ్ అనే ఆర్కిటెక్ట్ అభివృద్ధి చేశాడు. అచ్చం ఎడ్లబండి చక్రంలా ఉండే లేఅవుట్లో ఇళ్లను నిర్మించారు. ఇలాంటి పలు చక్రాలతో ఓ పట్టణాన్నే సృష్టించారు. చక్రం లేఅవుట్ చుట్టూ పచ్చని మొక్కలు ఉంటాయి. మధ్యలో ఇరుసులాంటి ప్రాంతం అంతా ఖాళీగా ఉంటుంది. అక్కడ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయని ఆర్కిటెక్టులు చెబుతున్నారు. ఇళ్ల మధ్య కాంపౌండ్ వాల్‌ను కూడా మొక్కలతోనే నిర్మించారు. ఈ లేఅవుట్‌ను ఇటీవల హెండ్రీ డో అనే ఫొటోగ్రాఫర్ డ్రోన్ సాయంతో ఫొటోలు తీసి ఇన్‌స్టా గ్రాంలో ఉంచాడు. దీంతో ఈ ఇళ్లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయల ఊరు ఇండోనేసియా, బాలి దీవుల్లో ఉన్న పెంగ్లిపురన్ గ్రామంలో పురాతన సంప్రదాయాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చుట్టూ కొండలు, మధ్యలో ఇళ్ల సముదాయం, వ్యవసాయ ఆధారిత గ్రామం. ఆధునికతకు దూరంగా.. ప్రకృతి ఒడిలో ఆ ఊరు విలసిల్లుతోంది. అసలు ఆ ఊరిలోకి మోటార్ సైకిల్‌కు కూడా అనుమతి ఉండదు అంటే నమ్మలేం కదా?. అందమైన రహదారులు, వాటిని ఆనుకుని వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు, రోడ్డుకు ఆనుకుని అందమైన పూల మొక్కలు, పురాతన సంప్రదాయ రీతిలో పెంకులతో నిర్మితమైన ఇళ్లు.. ఆ వీధుల్లో నుంచి నడుచుకుంటూ వెళితే, అసలు మనం ఈ లోకంలోనే ఉన్నామా అనే భావన కలుగుతుంది. ప్రపంచంలో క్లీన్ విలేజ్‌గా ఈ ఊరికి పేరుంది. పెంగ్లిపురన్ అంటే పూర్వీకులను గుర్తు చేసే ఊరు అని అర్థమట. చాలా మంది ఇక్కడికి వచ్చి తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బాలి ప్రాంతంలోని హిందూ సంప్రదాయం ప్రకారం గ్రామ నిర్మాణం ఉంటుంది. పర్యాంగన్ (పుణ్యకార్యక్రమాలు జరిగే ప్రాంతం), పవోంగన్ (నివేశన స్థలం), పాలేమహన్ (శ్మశానం, సాగుభూమి తదితర కార్యకలాపాలు) ప్రాంతాలుగా గ్రామ నిర్మాణం జరిగింది. గ్రామంలో లభించే వెదురు, కలప, రాళ్లతోనే ఇళ్లను నిర్మించారు. ఏడు వందల మంది జనాభా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ గ్రామాన్ని చూడటానికి పర్యాటకులు ఎక్కడెక్కడి నుంచో ఏటా వేల సంఖ్యలో వస్తారు. -
పల్లెలపై కరోనా పంజా
సాక్షి, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ పట్టణాల్లో వ్యాప్తి తగ్గి.. పల్లెల్లో విస్తృతంగా పెరుగుతోంది. వారం రోజుల నుంచి మహబూబ్‌నగర్, జడ్చర్ల పట్టణాల్లో సాధారణ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక గ్రామాలు, తండాల్లోనే రెట్టింపు కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల క్రితం దేవరకద్ర మండలం గోపన్‌పల్లిలో ఏకంగా 40మందికి పాజిటివ్ వస్తే.. సోమవారం కోయిలకొండ మండలంలోని వెనకలితండాలో 36మంది, మంగళవారం 27మందికి వైరస్ సోకడం స్థానికంగా కలకలం రేపింది. భూత్పూర్ మండలంలోని నెహ్రూనగర్‌లోనూ 20మందికి పాజిటివ్ వచ్చింది. పల్లెల్లో ఈ వైరస్ పెరగడానికి కారణం రోజువారీగా గ్రామం నుంచి పట్టణాలకు రాకపోకలు సాగించడమేనని తెలుస్తోంది. కరోనాతో ఇద్దరి మృతి జిల్లాలో మంగళవారం 174మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో తాజాగా ర్యాపిడ్ పరీక్షలు 1,389మందికి చేశారు. ఇంతవరకు 2,459 కేసులు యాక్టివ్‌గా ఉంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎనిమిది మంది, ప్రైవేట్‌లో ఒకరు, హోం ఐసోలేషన్‌లో 2,450మంది చికిత్స పొందుతున్నారు. అలాగే 1,707మంది హోం ఐసోలేషన్ పూర్తి చేసుకున్నారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,247కు చేరగా, మరణించిన వారి సంఖ్య 69కి చేరింది. ఆర్టీసీపీఆర్ పద్ధతి కింద జిల్లాకు సంబంధించి మరో వంద మంది ఫలితాలు రావాల్సి ఉంది. వెనకలి తండాలో.. కోయిలకొండ మండలం వెనకలితండాలో ఉన్న జనాభా 500లోపే.. అయితే వరుసగా పాజిటివ్ కేసుల పరంపర కొనసాగుతోంది. కేవలం రెండు రోజుల్లోనే 63మందికి కరోనా సోకింది. ఒకే గ్రామంలో ఈ స్థాయిలో అధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ తండాకు చెందిన ముగ్గురు యువకులు ఇటీవల ముంబై నుంచి తిరిగి వచ్చారు. వారు స్థానికంగా వినాయక ఉత్సవ, నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. వారి నుంచి మొదట ఇద్దరికి ఆ తర్వాత ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతోంది. దీంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అక్కడ ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అడ్డాకుల మండలం కందూరులో ఒకే ఇంట్లో నలుగురు, మరో వ్యక్తికి వైరస్ సోకింది. -
30రోజుల ప్రణాళికతో ఊరు మారింది
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళిక పనులు జిల్లాలోని అన్ని గ్రామాల్లో వేగంగా సాగుతోంది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామం చింతమడకతోపాటు, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం పోతారంతోపాటు హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ దత్తత గ్రామం గండిపల్లి గ్రామాలు స్వచ్ఛతలో ఒక అడుగు ముందున్నాయని చెప్పొచ్చు. తమ తమ నాయకులను ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని నాయకులు, యువత, మహిళా సంఘాలు గ్రామాన్ని శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇతర గ్రామాలకు తమ గ్రామం ఆదర్శంగా నిలవాలని పోటీపడుతున్నారు. అయితే తమ పుట్టిన ఊరిలో పారిశుధ్య పనులు వేగంగా జరగడం, గ్రామాల రూపురేఖలు మారడం సంతోషంగా ఉందని, పరిశుభ్రత కార్యక్రమం నిరంతరంగా జరగాలని కోరుకుంటున్నారు. శుభ్రమైన చిట్టాపూర్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి స్వగ్రామం చిట్టాపూర్. గ్రామంలోని పలువీధుల్లో రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని తొలగిస్తూ.. చెత్తవేయడంవల్ల జరిగే ఇబ్బందులు, అనర్థాలగురించి వివరిస్తున్నారు. అలాగే గ్రామంలో పాత ఇళ్లను జేసీబీలతో ఇండ్ల యజమానుల అంగీకారంతో కూలగొడుతున్నారు. ఈ గ్రామంలో మొత్తం 112 ఇళ్లు శిథిలావస్థలో ఉండగా అందులో 63 ఇళ్లను యజమానుల అనుమతితో కూల్చివేశామని ఆ గ్రామ సర్పంచ్ పోతనక రాజయ్య తెలిపారు. మిగతా 60 ఇళ్లు వారు పూర్తిగా నిరుపేదలు కావడం వల్ల ఆ ఇళ్లను త్వరలో కూల్చివేస్తామని యజమానులకు గ్రామ పంచాయతీ ద్వారా నోటీసులను కూడా ఇచ్చినట్లు తెలిపారు. గ్రామంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో బహిరంగంగా మలవిసర్జన చేయకుండా ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని నిర్మించినట్లు చెప్పారు. ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలగురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చిట్టాపూర్ లో భాగంగా గ్రామంలో ఉన్న ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో శ్రమదానం కార్యాక్రమాన్ని నిర్వహించి పాఠశాలల ఆవరణలో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించారు. గ్రామంలో నిర్మంచిన డబుల్ బెడ్రూం ఇళ్లల్లో కూడా శ్రమదానం నిర్వహించి వీధులన్నింటిని శుభ్రంచేశారు. దోమల నివారణకు మందులను పిచికారీ చేయించి, మురికి కాలువల్లో శుభ్రంగా ఉండటానికి పలు రకాల మందులను చల్లుతున్నారు. చింతమడకలో పనుల జోరు సీఎం స్వగ్రామమైన చింతమడక గ్రామంలో 23 రోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు సాగుతున్నాయి. తమ గ్రామ ముద్దుబిడ్డ ఆదేశాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంటే మా గ్రామాన్ని మేం సుందరంగా తీర్చుకోవడం సంతోషంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో 720 కుటుంబాలు ఉండగా 2,524 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో ఎక్కడా చెత్తా చెదారం, పిచ్చిమొక్కలు లేకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం. గ్రామంలో ఉన్న పాత, శి«థిలావస్థలో ఉన్న గోడలు, ఇళ్లను కూల్చివేయడం, ఇళ్ల మధ్యలో ఉన్న పాడుబడ్డ బావులను పూడ్చివేశారు. విద్యుత్ వైర్లు కిందికి వేలాడడం, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల వద్ద నెలకొరిగేలా ఉన్న ప్రమాదపు సమస్యలను పరిష్కరించడం, వ్యవసాయ బావుల వద్ద అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ లైన్లు వేయించారు. గ్రామస్తుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. ఇళ్లల్లోని చెత్తాచెదారాన్ని తీసిసే పనిలో అందరు భాగస్వామ్యులయ్యారు. విశాలంగా ఉన్న ప్రాంతాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను ట్రాక్టర్ల సాయంతో చదును చేశారు. స్థాయి కమిటీలు, అధికారులు, గ్రామస్తులను భాగస్వామ్యం చేస్తూ రోజువారిగా గ్రామంలోని వీధులను తిరుగుతూ పరిశీలించడంతోపాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరి సహకారం కావాలని కోరుతూ అవగాహన కల్పిస్తున్నారు. దీంతో గ్రామం అంతా స్వచ్ఛంగా తయారైంది. మురికికాల్వలు పూడ్చివేయడంతో దోమల బాధ తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు. అద్దంలా.. తోటపల్లి తోటపల్లి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వగ్రామం. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దత్తత గ్రామామైన మండలంలోని తోటపల్లిలో వేగవంతంగా సాగుతున్నాయి. ఈనెల 6 నుంచి గ్రామంలో పారిశుధ్యం, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్నారు. ఈ పనులకు ప్రత్యేకంగా నిధులు రాకపోయినా తమ సొంత డబ్బులతో పనులను పూర్తి చేస్తున్నట్లు సర్పంచ్ నర్సింగారావు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి, పాఠశాల, దేవాలయాల్లో చెట్ల పొదలు తొలిగించి చదును చేశారు. ప్రణాళిక పనుల్లో సర్పంచ్ నుంచి వార్డు సభ్యులు, ప్రణాలిక కమిటీ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. పలు కుటుంబాలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో స్థిరపడటం వలన పాత ఇల్లు, వాటిలోని పిచ్చి మొక్కలను తొలిగించడంలో కొంత జాప్యం జరుగుతుంది. 26 శిథిలమైన ఇళ్లను గుర్తించగా 12 ఇళ్లను తొలిగించామని మిగితా ఇళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశామని సర్పంచ్ నర్సింగారావు తెలిపారు. త్వరలోనే వాటిని తొలిగిస్తామన్నారు. లూజ్ విద్యుత్ లైన్లతో పాటు 150 విద్యుత్ సమస్యలు పరిష్కరించారు. రోడ్డు బీటీ డబుల్ రోడ్డు మంజూరి కావడంతో ఆప నులను సైతం పూర్తి చేసి గ్రామానికి రవాణ సౌకర్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న రెండు బోర్లను మూసివేశారు. దీంతో తోటపల్లి గ్రామం అద్దంలా తయారు అవుతుందని, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న ‘పోతారం మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామం పోతారం. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లుతుంది. ఎంపీ స్వగ్రామం కావడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నెలకొని ఉన్న సమస్యలను ప్రణాళికలో చకచక చేస్తున్నారు. కూలిపోయె దశకు చేరుకున్న ఎనిమిది ఇళ్లను పూర్తిగా కూల్చి వేశారు. ప్రమాదకరంగా ఉన్న రెండు పాత బావులను పూడ్చి వేశారు. హరితహారంలో నాటిన మొక్కలకు తెలుపు, నలుపు రంగులు వేశారు. గ్రామంలో కొన్ని విద్యుత్ వైర్లు వదులుగా ఉండడంతో వాటికి 20 స్తంభాలు పాతడానికి గుంతలు తీశారు. గ్రామంలో నుంచి గొర్రెలు, మేకలు వెళ్లకుండా వాటి కోసం ప్రత్యేకించి గ్రామ చివర్లో గొర్రెల షెడ్లను ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ప్రస్తుతానికి గ్రామం క్లీన్ అండ్ గ్రీన్లా కనిపిస్తుంది. భళా.. గండిపల్లి హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ దత్తత గ్రామమైన అక్కన్నపేట మండలం గండిపెల్లి. గ్రామంలోని రహదారులను శుభ్రపరుస్తూ చెత్తను తరలించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారులు కొంత వరకు సీసీ రోడ్లు ఉన్నప్పటికి గల్లీల్లో నేటికీ మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఇంకను మురికి కాలువల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. గ్రామంలో ఉన్న 13 పాడుబడ్డ ఇళ్లను కూల్చివేయగా, ఎస్సీ కాలనీలో మరికొన్ని పాత ఇళ్లను తొలగించాల్సి ఉంది. ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, యాదవ కమ్యూనిటీ భవనం, గ్రామ పంచాయతీ నూతన భవనం, కొత్తగా మహిళా భవనం. పాత మహిళ భవన నిర్మాణ మరమ్మతులకు కలిపి దాదాపు రూ.35లక్షలు మంజూరయ్యాయి. అలాగే ఓపెన్ జిమ్, కూరగాయల మార్కెట్, అంగడి స్థలాలను చదును చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పథకం కింద శ్మశానవాటిక పనులను కొనసాగిస్తున్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రపరుస్తూ, తాగునీరు కలుషితం కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాలకు గుంతలు ఏర్పడితే మొరంపోసి చదును చేస్తున్నారు. అలాగే విద్యుత్ స్తంభాల కొరత మూలంగా లూజ్ లైన్లు, స్ట్రీట్ లైట్లు పూర్తి స్థాయిలో వేయలేకపోతున్నారు. చాలా సంతోషంగా ఉంది.. మా స్వగ్రాం పోతారంలో 30రోజుల కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. గ్రామం మొత్తం శుభ్రంగా తయారు అవుతుందని చెబుతుంటే సంబురంగా ఉంది. గ్రామం శుభ్రంగా ఉంటేనే అందరూ బాగుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. గ్రామం స్వచ్ఛతగా తయారు చేసేందుకు పాల్గొంటున్న అందరికి అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలవాలి. –కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ 30 రోజుల ప్రణాళిక భేష్.. 30 రోజుల ప్రణాళిక భేష్....గ్రామాలను అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు గాను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికతో ఏళ్లుగా జరగని అభివృద్ధి కేవలం రోజుల్లోనే జరగడం సంతోషకరం. నా స్వగ్రామం చిట్టాపూర్‌లో నా చిన్నతనం నుంచి జరగని పనులు ఇప్పుడు జరిగాయి. – రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే గ్రామ పరిశుభ్రత కీలకం నా దత్తత గ్రామం గండిపల్లిలో 30 రోజుల ప్రణాళిక పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామస్తులు కలిసికట్టుగా పరిశుభ్రత పనులు చేసుకోవడం అభినందనీయం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన ఈపనులతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. ప్రజాప్రతినిదులతోపాటు, యువత కూడా ముందుకు వచ్చి పనులు చేస్తున్నారు. ఇలా వారంలో ఒకరోజు తప్పకుండా చేయాలని చెప్పాను. –సతీశ్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే -
ప్రమాదమని తెలిసినా..
సాక్షి, అశ్వారావుపేట : ఆటోలో మండు వేసవిలో ప్రయాణమంటేనే ప్రాణాంతకం. బస్సు సౌకర్యాలు లేని గ్రామాలకు ఆటోలే రవాణా మార్గాలు. కాకుంటే ప్యాసింజర్ ఆటో వెనుక డోరు తెరిచి దానిపై నిలుచుని ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయడం పల్లెటూర్లలో క్రేజీగా ఉంటుంది. కానీ కళ్లలో పడే దుమ్ము, ధూళికి ఇంటికి చేరేలోపే చతికిల బడతారిలా.. అశ్వారావుపేట మండలం జమ్మి గూడెం ఊట్లపల్లి మధ్యలో ఒక కిలోమీటరు ప్రయాణంలో ‘సాక్షి’కెమేరా ద్వారా చిత్రీకరించిన చిత్రాలివి. -
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల సమస్య తీరేదెప్పుడో?
సాక్షి, డెంకాడ(శ్రీకాకుళం): గ్రామస్థాయిలో వైద్య సేవలకు కేంద్రాలుగా ఉండే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత గూడు కరువైంది. అద్దె కొంపల్లో చాలీ చాలని స్థలంలో కేంద్రాలను నడుపుతున్నారు. కొన్నింటికి సొంత భవనాలు ఉన్నా అవి శిథిలావస్థకు చేరాయి. దీంతో గ్రామీణప్రాంతీయులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. ముఖ్యంగా గర్భిణులు బాలింతలకు వైద్య సేవలు అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతీ వారం వైద్య పరీక్షలు చేసే సమయంలో, చంటి పిల్లలకు వ్యాకిన్ వేసే సమయంలో అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల భవనాలు నిర్మించి చాలా కాలం కావటంతో అవి శిథిల దశకు చేరుకున్నాయి. గ్రామాలు పీహెచ్‌సీలకు దూరంగా ఉంటాయి. దీంతో గ్రామస్థాయిలో రోగులకు వైద్య సేవలు అందించేందుకు ఉండాల్సిన వసతి కూడా కరువైంది. వైద్య సిబ్బందికి కూడా అవస్థలు తప్పటం లేదు. డెంకాడ మండలం అక్కివరం, జొన్నాడ గ్రామాల్లో సబ్సెటర్ సెంటర్లకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిలో జొన్నాడలో ఉన్న సబ్‌సెంటర్ భవనం శిథిల దశకు చేరింది. పూసపాటిరేగ మండలంలో ఉన్న రెండు భవనాలు కూడా పాడయ్యాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులకు నివేదించాం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు సొంత భవనాలు లేనివాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. ఆయా సబ్‌సెంటర్ల వారీగా వివరాలు ఇచ్చాం. దీనికి సంబంధించి స్థలం చూపితే మంజూరు చేస్తామంటున్నారు. – డాక్టర్ సత్యవాణి, డెంకాడ పీహెచ్సీ పంచాయతీ భవనంలోనే విధులు జొన్నాడలో సబ్‌సెంటర్ భవనం శిథిల దశకు చేరింది. పంచాయతీ భవనంలోనే వాక్సిన్లు వేస్తున్నారు. పంచాయతీ కార్యాలయంలో సా ధారణ పాలనాపరమైన పనులు ఉంటాయి. దీంతో ప్రజలు వస్తుంటారు. దీంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. – కె.రమణి, జొన్నాడ -
తొలగిన భయం
సాక్షి, ఆర్మూర్(నిజామాబాద్): జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల ముఖచిత్రం మారిపోయింది. 2004 ఎన్నికలకు పూర్వం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామాల్లో యువత ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొనాలంటే తీవ్ర ఒత్తిడికి గుర య్యే వారు. ఎన్నికలను బహిష్క రించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం.. మరోవైపు, కచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనాలంటూ పోలీసు లు, అధికారులు ఒత్తిడి తేవడంతో ఆయా గ్రామాల ప్రజలు నలిగి పో యే వారు. ఫలితంగా గ్రామీణ యువతతో పాటు భూస్వాములు, రాజకీయ నాయకులు గ్రామాలను ఖాళీ చేసి వెల్లిపోయే వారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎన్నిక ల విధులు నిర్వహించడానికి సై తం ప్రభుత్వ ఉద్యోగులు భయాం దోళనకు గురయ్యేవారు. కానీ, 2018 ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి అం తంత మాత్రంగానే ఉండేది. ఈ క్రమంలో మావోయిస్టులతో పాటు వారి సానుభూతిపరులు సైతం గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉండే వారు. కమ్మర్పల్లి మండల కేంద్రం నుంచి ఇనాయత్నగర్కు వెళ్లే దారిలో మావోయిస్టులు రోడ్డుపై అమర్చిన బాంబులు పేలి ముగ్గురు కానిస్టేబుళ్లు గాయాల పాలయ్యారు. 1996 నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ రోజే సిరికొండ మండలం రావుట్ల సమీపంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఎస్సై విక్టర్.. మావోయిస్టులు పేల్చిన బాంబు కారణంగా మృత్యువాత పడ్డారు. మావోయిస్టుల దాడులకు భయపడి కమ్మర్పల్లి మండలం మానాల లాంటి మారుమూల గ్రామాల్లో ఎన్నికల విధులు నిర్వహించడానికి సైతం ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసే వారు. ఈ క్రమంలో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక మావోయిస్టులతో జరిపిన చర్చల తర్వాత జిల్లాలో మావోల ప్రభావం తుడిచి పెట్టుకుపోయింది. దీంతో మారుమూల గ్రామమైన మానాలలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ బహిరంగ సభ సైతం ఏర్పాటు చేసి అధికారులతో పాటు ఈ ప్రాంత ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గడం, రోడ్డు, రవాణా వ్యవస్థతో పాటు సెల్ఫోన్ల రాక కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు చైతన్యవంతులై మావోయిస్టుల భయం నుంచి క్రమంగా బయటికి వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొని రాజకీయ పార్టీల తరపున ప్రచారాలు సైతం నిర్వహించారు. తాజాగా 2018 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయా రాజకీయ పార్టీల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు మారుమూల గ్రామాల్లోకి సైతం వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాటి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రజలు అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని స్వాగతించడంతో పాటు వారు సైతం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటుండడం విశేషం. -
పాత కాపులు.. కొత్త ముఖాలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఏడాదిలోపే సార్వత్రిక ఎన్నికలు రానుండడంతో అన్ని పార్టీల నాయకులు పల్లెబాట పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న నాయకులు ఇప్పటినుంచే పల్లెల్లో ప్లాట్ఫారం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుబంధు వంటి పథకాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గ్రామాలకు క్యూ కడుతుండగా, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో విపక్షాలు అదే దారి పట్టాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో రాజకీయ సందడి నెలకొంది. టీఆర్ఎస్లో సిట్టింగ్‌లకు పోటీగా కొత్త నాయకులు కూడా వివిధ మార్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఎవరి ధీమాలో వారుంటూ ప్రజల మద్ధతు కోసం పోటీ పడుతున్నారు. బీజేపీ కూడా పట్టున్న ప్రాంతాల్లో పల్లె నిద్రలు సాగిస్తోంది. టీజేఎస్, సీపీఐ వంటి పార్టీల నేతలు కూడా ఎన్నికల సంవత్సరంలో అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. పల్లెలకు చేరిన మంచిర్యాల రాజకీయం మంచిర్యాల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి టిక్కెట్టు తనకే వస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు భావిస్తుండగా, ఆయనకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ స్థాయిలో వ్యతిరేక వర్గం పనిచేస్తోంది. రాష్ట్ర టీవీ, చలన చిత్ర మండలి చైర్మన్ పుస్కూరు రామ్మోహన్రావు కూడా తనకే టిక్కెట్టు అనే ధీమాతో ఉన్నారు. ఆయనతో పాటు పలువురు నాయకులు తాము సైతం పోటీలో ఉన్నట్టు చెప్పుకుం టున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల బస్సుయాత్ర విజయవంతంగా నిర్వహించి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేశారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకల తరహాలో ముస్లింలకు ‘పీఎస్ఆర్ రంజాన్ కా తోఫా’ పేరుతో వస్త్రాలు, బియ్యం, సేమియా తదితర కానుకలతో కూడి న కిట్లను అందజేసే కార్యక్రమాన్ని సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నారు. వచ్చే బుధవారం మహిళలతో ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేయించి పార్టీ రాష్ట్ర నాయకులను ఆహ్వా నించారు. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి సైతం ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్టు రేసులో ఉన్నా, పల్లెల బాట పట్టలేదు. బీజేపీ నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ఈసారి పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నా రు. శనివారం రాత్రి హాజీపూర్ మండలం టీకానపల్లిలో మల్లారెడ్డి ‘పల్లెనిద్ర’ కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ జన సమితి ఇన్చార్జి గురుజాల రవీందర్రావు సంస్థాగతంగా పార్టీ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. చెన్నూర్‌లో కొత్త ముఖాలు.. చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న నల్లాల ఓదెలుకు మాజీ మంత్రి గడ్డం వినోద్ నుం చి పోటీ ఉన్నా, వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి న తనను కాదనరనే ధీమాతో ఉన్నారు. అన్ని పార్టీలు తిరిగి చివరికి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జ నార్దన్ ఈసారి హస్తం గుర్తు మీద పోటీ చేస్తానని చెపు తూ మండలాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతకాని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం అశోక్ టిక్కెట్‌పై ధీమాగా ఉన్నారు. కరీంనగర్ ఎక్సైజ్ కమీషనర్‌గా పనిచేస్తున్న దుర్గం వెంకటేశ్ సైతం కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే వీరెవెరూ ఇప్పటివరకు ప్రజల వద్దకు వెళ్లలేదు. బీజేపీ నుంచి పార్టీ జిల్లా ప్రధా న కార్యదర్శి అందుగుల శ్రీనివాస్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంవేణు టిక్కెట్టు రేసులో ఉన్నారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తున్నారు. తెలంగాణ జన సమితి నుంచి పొడెటి సంజీవ్ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్ పెద్దపల్లి లోక్‌సభ టిక్కెట్ ఆశిస్తున్నారు. బెల్లంపల్లి సీటు కోసం పోటీ.. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పక్షాన సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరోసారి టిక్కెట్ ఆ శిస్తుండగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ సైతం ఇక్కడ టిక్కెట్ రేసులో ఉన్నారు. ఇద్దరు నే తలు పోటాపోటీగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పక్షాన టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్ పో టీకి సిద్ధపడుతున్నారు. ప్రజా గాయకుడు గద్దర్ కొడుకు సూర్యకుమార్ బెల్లంపల్లి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెల్లంపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో కూడా సూర్యకుమార్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు మద్దతుతో మున్సిపల్ వార్డు కౌన్సెలర్ రొడ్డ శారద పోటీ కి సిద్ధపడుతున్నారు. ఈమె కూడా గ్రామాల్లో పర్యటనలను ప్రారంభించారు. సీపీఐ పక్షాన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ఠ్ర కార్యవ ర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ పల్లెనిద్ర ద్వారా ప్రజలతో కలిసిపోతున్నారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన దుర్గం గోపాల్ టీజేఎస్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కుమురం భీం జిల్లాలో పోటాపోటీగా ప్రజల్లోకి.. ఆసిఫాబాద్‌లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆమె నిర్మించిన గృహం విషయంలో విపక్షాల నుంచి విమర్శలు పెరుగుతుండడం ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ నుం చి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రజల్లో తన గ్రాఫ్‌ను పెంచుకున్నారు. ఆదివాసీ ఉద్యమంలో కీలకనేతగా ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. ఆదివాసీల హక్కుల పేరుతో గ్రామాల్లో పర్యటిస్తుండడం కలిసివచ్చే అంశం. బీజీపీ నుంచి ఓ ప్రభుత్వ గురుకుల పాఠశాల వార్డెన్ పోటీ చేసే ఆలోచనతో స్వచ్ఛంద పదవీ విరమణ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సిర్పూర్లో టీఆర్ఎస్ తరుపున కోనేరు కోనప్ప తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మ య్య ప్రజలకు సన్నిహితం కాలేకపోతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే దివంగత పాల్వాయి పురుషోత్తంరావు తనయుడు పాల్వాయి హరీశ్ గత కొద్ది రోజులుగా పల్లెబాట పేరుతో పాదయాత్రలు చేస్తూ ప్రజల అభిమానం చూరగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేపీలో ఇటీవల చేరిన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కాంగ్రెస్‌లో రావి శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్ యాదవ్, సిడాం గణపతి తమ పట్టును పెంచుకునే ప్ర యత్నాల్లో ఉన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసే యోచనతో ఉన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నదే హవా. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ఏఐ సీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, భార్గవ్‌దేశ్ పాండే టిక్కెట్టును ఆశిస్తున్నారు. ముగ్గురు రేసులో ఉంటూ, మూడు వర్గాలుగా పని చేస్తుండడం గమనార్హం. బీజేపీ నుంచి పాయల్ శంకర్ టిక్కెట్టును ఆశిస్తూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. హోమి యోపతి వైద్యుడు డాక్టర్ రవికిరణ్ యాదవ్ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. తెలంగాణ జన సమి తి నుంచి దుర్గం రాజేశ్వర్, వై.సంజీవ్‌రెడ్డి, సామల ప్రశాంత్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. బోథ్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా.. ప్రస్తుతం ఆదిలా బాద్ ఎంపీగా ఉన్న గోడం నగేశ్ బోథ్ నుంచి పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నా ఇటీవలి కాలంలో కలిసికట్టుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆసక్తి కలిగిస్తోంది. బోథ్‌లో కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకులు సోయం బాపూరావు, కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అనిల్‌జాదవ్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఎవరికి వారే తమ మద్దతుదారులతో సమావేశాలు జరుపుతూ టిక్కె ట్టు రేసులో ఉన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆదివాసీ ఉద్య మం నేపథ్యంలో నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఉత్కంఠ ఉంది. కాంగ్రెస్ నుంచి కిందటిసారి పోటీ చేసిన హరినాయక్‌తో పాటు భరత్‌చౌహాన్ టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేశ్‌జాదవ్ ఈ ఎన్నికల్లోనూ పోటీలో నిలవాలని ఆసక్తిగా ఉన్నారు. అయితే జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఆదివాసీ ఉద్యమం కొంత మంది రాజకీయ నాయకుల భవిష్యత్తుకు ఆగా«థం సృష్టించే అవకాÔశం ఉంది. నిర్మల్ జిల్లాలో సీనియర్లు.. జూనియర్లు.. నిర్మల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ఎదురులేని పరిస్థితి కనిపిస్తోం ది. కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పూర్వవైభవం కోసం ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ బస్సుయాత్రను మహేశ్వర్‌రెడ్డి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. యాత్ర కన్వీనర్‌గా వ్యవహరించడంతో పాటు నిర్మల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించి విజయవంతం చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన భారీ ఇఫ్తార్ విందుకు సైతం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ, మండలి నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలను రప్పించి క్యాడర్లో జోష్ నింపారు. బీజేపీ తరపున వైద్యురాలు అయిండ్ల స్వర్ణారెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన వైద్యుడు కాలగిరి మల్లికార్జున్‌రెడ్డి సొంతంగా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మధ్యకు వెళుతున్నారు. సీనియర్లు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్ సైతం పార్టీ టికెట్ రేసులో ఉన్నారు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ పలువురు నేతలు మాత్రమే అడపదడపా కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, ఉనికి నామమాత్రంగా తయారైంది. ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఈసారి కారు గుర్తు మీద పోటీ చేసేందుకు సన్నద్ధమయ్యారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడుతున్న నాయకులు ప్రజల మద్దతు కోసం విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావుపటేల్, ఆయన సోదరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బోస్లే మోహన్‌రావుపటేల్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో నేత పవార్ రామారావుపటేల్ అనసూయపవార్ ట్రస్ట్ పేరిట గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి ముథోల్ నుంచి పోటీచేస్తానని ప్రకటించారు. పల్లెనిద్రలో భాగంగా ఇప్పటికే దళితవాడల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ నుంచి ఈ ఎన్నికల్లో బోయిడి విఠల్ బరిలో దిగనున్నారు. -
మంచమే అంబులెన్స్
జయపురం : ప్రతి వారికి అందుబాటులో వైద్యసౌకర్యం. ప్రతి గ్రామానికి పంచాయతీ కార్యాలయం. సమితులకు కనెక్టివిటీ రోడ్లు. గర్భిణులకు పురిటి నొప్పులు వస్తే ఫోన్ చేసిన వెంటనే 102 అంబులెన్స్ కుయ్‌కుయ్ మంటూ వచ్చి ఆస్పత్రిలో చేర్చుతుంది. ఈ మాటలు ఎంతో కాలంగా ప్రజలు వింటూనే ఉన్నారు. ప్రభుత్వం ఇలా ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ అవిభక్త కొరాపుట్ జిల్లాలో గర్భిణులు పడుతున్న పాట్లు మాత్రం వర్ణనాతీతం. చాలా సందర్భాల్లో రోగులు, గర్భిణులను డోలీలలోనూ, మంచాలపైనా, సైకిళ్ల పైన తీసుకువెళ్తూ నదులు, కొండలు దాటిస్తూ ఆస్పత్రికి వెళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అటుంటి సంఘటనే బొరిగుమ్మ సమితి రణస్పూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం తాండవించింది. పంచాయతీలోని రాణిగడ గ్రామ నివాసి మిశ్రా ముదులి భార్య మోతి ముదులి(19) గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన తరువాత ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ఆశా వర్కర్ రుకుణ సూచించింది. రాణిగుడ కొండపై ఉన్న ఈ గ్రామానికి రహదారి లేదు. దీంతో ఆమె బంధువులు మోతి ముదులిని మంచంపై కూర్చుండ బెట్టి మోసుకుంటూ బొరిగుమ్మ ఆస్పత్రికి బయలుదేరారు. మూడు కొండలు దాటుతూ మూడు కిలోమీటర్లు మోసుకుని బి.సింగపూర్ చేరారు. అక్కడినుంచి ఆటోలో బొరిగుమ్మ కమ్యూనిటీ వైద్య కేంద్రానికి చేర్చారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు సరిపడా రక్తం ఇక్కడ లేదని, వెంటనే జయపురం సబ్‌డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో వెంటనే ఆమెను జయపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు అవసరమైన రక్తం సమకూర్చి వైద్యం చేసిన తరువాత ఆమె సృహలోకి వచ్చింది. దీంతో బంధువులు ఊపిరిపీల్చుకున్నారు. సర్కారు కనికరించాలి ఇలాగే ™రాణిగుడ గ్రామంతో పాటు నాలుగైదు గ్రామాలు కొండలపై ఉన్నాయని, ఆ గ్రామాలకు రహదారులు వేయాలని ఎంతో కాలంగా అధికారులను కోరుతూ వస్తున్నామని అయినా ఎవరూ పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోయారు. కొండలపై ఉన్నç గ్రామాలలో రోగులు, మహిళలు, గర్భిణులకు వైద్య సౌకర్యం కోసం డోలీకట్టో, మంచాలపైనో మోసుకుంటూ కొండలు దాటుతూ వెళ్లాల్సిందేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని వెంటనే తమ గ్రామాలకు రహదారులు వేయాలని కోరుతున్నారు. -
పంచాయతీ సందడి!
పల్లెల్లో పంచాయతీ సందడి మొదలైంది. స్థానిక పోరుకు సర్కారు పచ్చజెండా ఊపడంతో ఆశావహులు పావులు కదుపుతున్నారు.ప్రస్తుత పాలకవర్గం ఆగస్టులో ముగియనున్న నేపథ్యంలో అప్ప ట్లోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చెక్ పవర్ విషయంలో తీసుకొచ్చిన నిబంధనల నేపథ్యంలో నాయకులు చర్చోపచర్చలు జరుపుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : స్థానిక సమరానికి తెరలేచింది. అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదముద్ర పడడంతో గ్రా మ పంచాయతీల ఎన్నికలపై స్పష్టత వచ్చింది. గడువులోపు ఎన్నికలు నిర్వహిస్తామని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఎన్నికలకు దాదాపుగా లైన్ క్లియరైనట్లయింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ఆగస్టు రెండో తేదీ నాటికి ముగి యనుండడంతో అప్పటిలోపు ఎన్నికలు జరపాలని ప్రభు త్వం భావిస్తోంది. మే నెలాఖరులోగా ఎన్నికలను పూర్తి చేసి.. కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈక్రమంలో జూన్ నాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరే అవకాశముంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లో స్థానిక సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమా..? పరోక్షమా.. అనే చర్చకు ఫుల్స్టాప్ పడిన పరిస్థితుల్లో సర్పంచ్ పీఠంపై కన్నేసిన ఆశావహులు తమదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోవైపు చెక్‌పవర్ విషయంలో ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పల్లెల్లో చర్చోపచర్చలకు దారితీస్తున్నాయి. ఇప్పటివరకు సర్పంచ్‌తోపాటు గ్రామ కార్యదర్శికే చెక్ పవర్ ఉండేది. ఇకపై కార్యదర్శి స్థానే ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్ పవర్ ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. ఈ నిర్ణయం స్థానిక సంస్థల్లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఉప సర్పంచ్‌దే హవా! రిజర్వేషన్ల కారణంగా గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ల ప్రాబల్యమే ఎక్కువగా కనిపించనుంది. నిరక్షరాస్యులు, అణగారిన వర్గాలు సర్పంచ్ కుర్చీ ఎక్కితే.. బలమైన సామాజికవర్గం ఉప సర్పంచ్ పదవిని చేజిక్కించుకుంటోంది. వార్డు సభ్యుల సంఖ్యాబలంతో ఉప సర్పంచ్ సీటును దక్కించుకుంటున్న సభ్యులు పంచాయతీ పాలనావ్యవహారాల్లో కీలకభూమిక పోషిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ల పాత్ర కూడా దాదాపుగా వీరే పోషిస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఉపసర్పంచ్‌కు చెక్‌పవర్ కూడా కట్టబెట్టడంతో గ్రామ రాజకీయాలు సరికొత్త పుంతను తొక్కనున్నాయి. ఇప్పటికే గ్రామ రాజకీయాల్లో పలుకుబడి ప్రదర్శిస్తున్న ఉపసర్పంచ్ పదవి.. వచ్చేఎన్నికల నుంచి మరింత పవర్‌ఫుల్‌గా మారనుంది. ఈ తరుణంలో ఉప సర్పంచ్ సీటును కైవసం చేసుకునేందుకు పోటీ తీవ్రం కానుంది. సర్పంచ్ అధికారాలకు తగ్గట్టు దాదాపు అవే హక్కులు ఉపసర్పంచ్ కూడా ఉండే అవకాశం ఉన్నందున ఈ పదవి దక్కించుకునే విషయంలో పల్లె రాజకీయం రసవత్తరంగా మారనుంది. మరోవైపు ఇప్పటి నుంచి పదేళ్లపాటు రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయం కూడా పంచాయతీ పోరులో కీలకం కానుంది. ప్రస్తుతం ఐదేళ్లకోసారి రిజర్వేషన్ మారేది. దీంతో ఒకసారి గెలిచిన ప్రజాప్రతినిధులు మరోసారి తన సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఉండదనే భావనలో అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపేవారు. అదే సమయంలో ఎలాగూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముండదనే ధీమాతో గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడడమేగాకుండా.. నిధులు దుర్వినియోగం కూడా గణనీయంగా ఉండేది. ఈ పరిస్థితిని విశ్లేషించిన సర్కారు.. పదేళ్లపాటు ఒకే విధమైన రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒకసారి సర్పంచ్ గెలిచినా అభ్యర్థి మరోసారి తన అధిక్యతను ప్రదర్శించుకునేందుకు గ్రామాభివృద్ధిపై దృష్టిసారించే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిజర్వేషన్ల ప్రకటనపై ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే రిజర్వేషన్ వర్తింపజేసిన సామాజికవర్గం ఆశావహులు మాత్రం.. సర్పంచ్ పదవిపైగాకుండా ఉపసర్పంచ్ పదవిపై కన్నేశారు. ఇలా పంచాయతీరాజ్ చట్ట సవరణకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందే తడువు పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికలకు ప్రీ పోల్స్‌గా భావించే ఈ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా గ్రామాల్లో బలమైన పునాది వేసుకోవాలని ఆయా రాజకీయపార్టీలు యోచిస్తున్నాయి. ఏదీఎమైనా.. పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడమే తరువాయి.. బరిలో దిగేందుకు ఆశావహులు కదనకుతుహలంతో ఉన్నారు. -
పల్లెల్లో ఎన్నికల వేడి
సాక్షి, గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కొత్త గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేస్తూ సర్పంచ్ల ఎన్నికల విధానంపైన కూడా స్పష్టత ఇవ్వడంతో అన్ని పార్టీల నాయకులు గ్రామాలబాట పట్టారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్‌లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడమే కాకుండా సర్పంచ్, ఉపసర్పంచ్‌కు కలిపి ఉమ్మడిగా చెక్‌పవర్ కల్పించనున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తచట్టం ద్వారా నిధుల ఖర్చులో మరింత పారదర్శకత పెరగనుంది. జిల్లాలో నూతనంగా ప్రతిపాదనలు పంపిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఇప్పటివరకు 195 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం మరో 60గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీల సంఖ్య 255కు చేరింది. నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామస్వరాజ్యం సాధ్యమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నాలుగు మున్సిపాలిటీలు ప్రభుత్వం తాజాగా గద్వాల మున్సిపాలిటీలో జమ్మిచేడు, వెంకంపేట గ్రామాలను విలీనం చేశారు. ఆలంపూర్, ఇమాంపూర్ గ్రామాలను వీలీనం చేసి నూతన మున్సిపాలిటీగా అలంపూర్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వడ్డేపల్లి, పైపాడు గ్రామాలను కలిపి వడ్డేపల్లి చిన్న మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు వల్ల గ్రామాల్లో సర్పంచ్‌స్థానాలు పెరగడంతో పాటు, పాలన మరింత చేరువ కానుంది. అదేవిధంగా నూతనంగా చిన్న మున్సిపాలిటీలుగా ఏర్పటైన అలంపూర్, వడ్డేపల్లి భవిష్యత్‌లో మరింత అభివృద్ధి కానున్నాయి. సర్పంచ్, ఉపసర్పంచ్లకే చెక్ పవర్ నిధుల వినియోగానికి సంబంధించి ఇప్పటి వరకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఉంది. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిపినా వారిద్దరూ సంతకం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఈ విధానంతో చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ సర్పంచ్‌లు నిర్వహించలేకపోయేవారు. కొన్ని సందర్భాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమన్వయలోపం వల్ల నిధుల విడుదలలో సంక్షోభం ఏర్పడేది. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్‌లకే చెక్‌పవర్‌ను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒకే రిజర్వేషన్ రెండు పర్యాయాలు అమలుచేస్తున్నారు. సర్పంచ్ తప్పుచేస్తే చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలే తరువాయి.. ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. సర్పంచ్ల ఎన్నిక విధానంపైన కూడా స్పష్టత ఇవ్వడంతో ఇక ఎన్నికలు నిర్వహించడమే తరువాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అన్నిపార్టీలు గ్రామాల్లో ఇప్పటికే గెలుపు గుర్రాలను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల జాబితాను పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, బ్యా లెట్ బాక్స్‌లు, పోలింగ్ కేంద్రాలు ఈ విధంగా గ్రామపంచాయతీలు, జనాభాకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.. జిల్లాలో ఇప్పటికే గద్వాల మున్సిపాలిటీ, అయిజ నగర పంచాయతీలో ఓటర్ల జాబితాను సవరిస్తున్న అధికారులు, గ్రామ పంచాయతీలలోనూ ఓటర్ల జాబితాను సిద్దం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2,03,734మంది, 2,02,988 మహిళలు, మొత్తం 4,06,750 మంది ఓటర్లు ఉన్నారు. -
ఉపాధిలో మహిళ
నాగర్‌కర్నూల్ టౌన్ : కరువు కాటకాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న పేదలకు సొంత ఊరిలోనే పని కల్పించి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా నివారించేందుకు 2005లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వరంగా మారింది. గతంలో గ్రామాల్లో పనులు లేకపోవడంతో చాలా మంది బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లే వారు. నెలల తరబడి కుటుంబాలకు దూరం గా ఉండి పిల్లాపాపలను వదిలేసి పొట్ట కూటి కోసం అన్నీ వదిలేసి పట్టణ ప్రాంతాల కు వెళ్లిపోయేవారు. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పలు కుటుంబాలు సొంత ఊర్లోనే పనులు చేసుకుంటూ అందుకు తగ్గ కూలి పొందుతున్నారు. ఏడాది పొడవునా కూలీ పనులకు వెళ్తూ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో జిల్లాలో మహిళలే అధికంగా ఉన్నారు. దీంతో ఉపాధిలో మహిళా శక్తి తన ప్రాభావాన్ని చాటుకుంటోంది. జిల్లాలో లక్షా 69వేల 27 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా వారిలో 3లక్షల 71వేల 130మంది కూలీలు ఉన్నారు. వీరిలో లక్షా 91వేల 256 మంది మహిళలే ఉన్నారు. అంటే దాదాపు 51శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ ఏడాది చేసిన పనుల్లో చూసుకుంటే ఇప్పటి వరకు లక్షా 11వేల మంది పనుల్లో పాల్గొనగా అందులో 59వేల మంది (53 శాతం) మహిళలు ఉన్నారు. ఏడాదంతా పుష్కలంగా పనులు... ఉదయం వేళ పారా, పలుగు పట్టుకుని పురుషులతో పాటు మహిళలు కూలీ పనులకు వెళ్తున్నారు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకుని కుటుంబ పనులు చూసుకుంటున్నారు. మరికొందరు ఉదయం ఈజీఎస్ పనులకు వెళ్లి త్వరగా ముగించుకుని తర్వాత తమ సొంత వ్యవసాయ పనులకు సైతం వెళ్తున్నారు. ఇందుకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాలోనే పడుతుండడంతో సొమ్ముకు సైతం భద్రత ఏర్పడింది. కాలానుగుణంగా ప్రతి సీజన్లోనూ కూలీలకు పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి కూలీ వద్దకు వెళ్లి పనుల వివరాలు చెబుతూ పనులకు తీసుకెళ్తున్నారు. గతంలో వేసవి కాలంలోనే పనులు అధికంగా ఉండేవి. కానీ ప్రతి పనికి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకుంటుండడంతో ఏడాది మొత్తం చేతినిండా పని ఉంటోంది. ముఖ్యంగా వానాకాలంలో హరితహారం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఇలా ప్రతి ప్రభుత్వ పథకంలోనూ ఉపాధి కూలీలను వినియోగిస్తూ వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. దీంతో నిరుపేదలకు సంవత్సరమంతా పనులు గ్రామాల్లోనే పుష్కలంగా లభిస్తున్నాయి. మహిళా కూలీలను ప్రోత్సహిస్తున్నాం గ్రామాలలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే మహిళలను ప్రోత్సహిస్తున్నాం. ఈ ఏడాది జరిగిన పనుల్లో ఇప్పటి వరకు అధిక శాతం మహిళలే పాల్గొంటున్నారు. పనులు చేసేందుకు కూడా పురుషుల కంటే మహిళలు అధిక ఆసక్తి చూపించడం మహిళా శక్తికి నిదర్శనం. – సుధాకర్, డీఆర్డీఓ -
నీటి ఎద్దడితో గ్రామాలు విలవిల
► అడుగంటిన భూగర్భ జలాలు ► నిరుపయోగంగా తాగునీటి పథకాలు అసలే ఎండాకాలం. చుక్క నీరు దొరకని పరిస్థితి. భూగర్భ జలాలు అడుగంటాయి. చేతిపంపులు పనిచేయవు. ఇలాగైతే గ్రామాల్లో బతకడం ఎలా అని ప్రజలు వాపోతున్నారు. తాగునీటి కోసం వ్యవసాయ బోర్లు, పక్క గ్రామాలకు పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొందని, అధికారులు స్పందించి నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బి.కోడూరు : ప్రస్తుతం మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు పూర్తిగా అడుగంటడంతో మండలంలోని సుమారు సగానికి పైగా గ్రామాలు తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నాయి. గతంలో ప్రభుత్వం గ్రామాల్లో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరుబావుల నుంచి తాగునీరు రాకపోవడంతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అదనంగా మరొక బోరు వేయాలనుకున్నా నీరు పడతాయో లేదో అన్న అనుమానంతో ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని సాహసం చేయలేకపోతున్నారు. దీంతో మండలంలోని గ్రామాల ప్రజలు తాగునీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా మండలంలోని మేకవారిపల్లె పాతూరులో గత నెల రోజులుగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో మొత్తం 200 కుటుంబాలు ఉండగా వీరికి తాగునీటి కోసం గతంలో ప్రభుత్వం ఒక భూ ఉపరితల జలాశయం, ఒక డైరెక్టు పంపింగ్ స్కీంను ఏర్పాటు చేశారు. కానీ వాటి నుంచి సరిగా నీరు రాకపోవడంతో తాగునీటి కోసం వ్యవసాయ బోరుబావుల వద్దకు, పక్క గ్రామాల్లోని మంచినీటి పథకాల వద్దకు పరుగులు తీయాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల నుంచి సరిపడ నీరు రాకపోవడంతో భూఉపరితల జలాశయం అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. తాగునీటి కోసం రేయింబవళ్లు పనులు వదిలిపెట్టి కాపలా కాయాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం తాగునీటి ఎద్దడికి తోడు ఎండలు మండుతుండటంతో పశువులకు తాగేందుకు నీటికి పడరాని పాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిపినా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్‌ను వివరణ కోరగా ఈ ఏడాది గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. నీటి సమస్య లేకుండా అన్ని గ్రామాల్లో చర్యలు చేపడతామన్నారు. మేకవారిపల్లెలో భూఉపరితల జలాశయానికి అదనంగా పైపులైను , అలాగే డైరెక్టు పంపింగ్‌కు అనదంగా హెడ్డీపైపును ఏర్పాటు చేసి నీటి సమస్యను తీరుస్తామని ఆయన పేర్కొన్నారు. నీటి కోసం తీవ్ర ఇక్కట్లు: తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి దుర్భర పరిస్థితిని ఇంత వరకు చూడలేదు. రాత్రిం బవళ్లు మోటార్ల వద్ద కాపలా ఉన్నా సరిపడ నీరు దొరకడం గగనమైంది. – పుల్లయ్య, మేకవారిపల్లె, బి.కోడూరు మండలం బోర్లు ఎండిపోయాయి: గ్రామంలో తాగునీటి సమస్యతో అల్లాడుతున్నాం. బోర్లు ఎండిపోయాయి. చేతిపంపుల్లో చుక్కనీరు రాదు. వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లినా నీరు తెచ్చుకోవడం కష్టంగా మారింది. అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలి. – చిన్నవీరయ్య, మేకవారిపల్లె, బి.కోడూరు మండలం -
కేశోరాం ప్రభావిత గ్రామాల్లో జియాలజిస్టు సర్వే
బావులను పరిశీలించిన అధికారి గ్రామస్తుల అభిప్రాయాల సేకరణ బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం ప్రభావిత గ్రామాల్లో జిల్లా జియాలజిస్టు ( భూగర్భ జల సంరక్షణ అధికారి) మంగళవారం పర్యటించారు. కేశోరాం కంపెనీ మూలంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కంపెనీ మైన్స్ మూలంగా సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని, అదేవిధంగా కర్మాగారం నుండి వెలువడే కాలుష్యం మూలంగా రోగాల బారిన పడటమే కాకుండా పంట దిగుబడులు తగ్గుతున్నాయని ప్రభావిత గ్రామాల ప్రజలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ నీతూప్రసాద్‌కు పిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై సర్వే నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈమేరకు జియాలజిస్టు మోహన్ బసంత్‌నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, కన్నాల, రామారావుపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులు ఎండిన చేదబావులను అధికారికి చూపించారు. కంపెనీ మూలంగానే బావుల్లో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయని వివరించారు. వ్యవసాయ, చేద బావులను పరిశీలించి స్థానికులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మోహన్ తెలిపారు. ఆయన వెంట రామారావుపల్లి సర్పంచ్ శేర్ల లక్ష్మీపతి, నాయకులు పూసాల మోహనాచారి, సూర సమ్మయ్య, దయానందం, పొన్నం రామలింగం, ఓడ్నాల శ్రీనివాస్, బుర్రగడ్డ రవికుమార్ ఉన్నారు. -
ఎప్పటికి అవుతుందో..
అల్లూరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్‌పల్స్ సర్వే మండలంలో నత్తనడకన జరుగుతోంది. ఈనెల 8వ తేదీన ప్రారంభమైన సర్వేకు ఆదిలోనే సర్వర్ సమస్య ఎదురైంది. మండలంలో మొత్తం 14,300 కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరించేందుకు 38 బందాలను ప్రభుత్వం నియమించింది. ఒక్కో బందంలో ఎన్యూమరేటర్, అసిస్టెంట్, చంద్రన్న బీమా ఏజెంటు, సాక్షరాభారత్ కో–ఆర్డినేటర్లతో పాటు ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు. వీరంతా కలిసి ప్రారంభించిన సర్వే ఏ మాత్రం ముందుకుకదల్లేదు. కొన్న ప్రాంతాల్లో సిగ్నల్ పనిచేయక, మరికొన్నిచోట్ల సిగ్నల్ ఉన్నా సర్వర్ తరచూ మొరాయించడం, ట్యాబ్‌లు పనిచేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోప్రాంతంలో రోజుకు కేవలం ఒకటి, రెండు కుటుంబ వివరాలు కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఈ నెలఖారులోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినా సర్వరు మోరాయించడంతో ఇప్పటివరకు కేవలం మండలంలో 299 కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించారు. దీంతో నిర్ధేశించిన సమయానికి సర్వే పూర్తయ్యేలా కనిపించడంలేదు. సర్వర్ కారణం : పూర్ణచంద్రరావు, తహసీల్దార్ సర్వర్ మొరాయించడంతో సర్వే నెమ్మదిగా జరుగుతోంది. అధికారులు సర్వే పనిపై ఉండటంతో తహసీల్దార్ కార్యాలయంలో పాలన కుంటుబడుతోంది