ఎప్పటికి అవుతుందో..
ఎప్పటికి అవుతుందో..
Published Wed, Jul 20 2016 11:37 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
అల్లూరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్‌పల్స్ సర్వే మండలంలో నత్తనడకన జరుగుతోంది. ఈనెల 8వ తేదీన ప్రారంభమైన సర్వేకు ఆదిలోనే సర్వర్ సమస్య ఎదురైంది. మండలంలో మొత్తం 14,300 కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరించేందుకు 38 బందాలను ప్రభుత్వం నియమించింది. ఒక్కో బందంలో ఎన్యూమరేటర్, అసిస్టెంట్, చంద్రన్న బీమా ఏజెంటు, సాక్షరాభారత్ కో–ఆర్డినేటర్లతో పాటు ఇద్దరు సూపర్‌వైజర్లు ఉన్నారు. వీరంతా కలిసి ప్రారంభించిన సర్వే ఏ మాత్రం ముందుకుకదల్లేదు. కొన్న ప్రాంతాల్లో సిగ్నల్ పనిచేయక, మరికొన్నిచోట్ల సిగ్నల్ ఉన్నా సర్వర్ తరచూ మొరాయించడం, ట్యాబ్‌లు పనిచేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోప్రాంతంలో రోజుకు కేవలం ఒకటి, రెండు కుటుంబ వివరాలు కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఈ నెలఖారులోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినా సర్వరు మోరాయించడంతో ఇప్పటివరకు కేవలం మండలంలో 299 కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించారు. దీంతో నిర్ధేశించిన సమయానికి సర్వే పూర్తయ్యేలా కనిపించడంలేదు.
సర్వర్ కారణం : పూర్ణచంద్రరావు, తహసీల్దార్
సర్వర్ మొరాయించడంతో సర్వే నెమ్మదిగా జరుగుతోంది. అధికారులు సర్వే పనిపై ఉండటంతో తహసీల్దార్ కార్యాలయంలో పాలన కుంటుబడుతోంది
Advertisement