allur
-
అల్లూర్ ఇన్ఫ్రాకు అసెట్స్ అండ్ మోర్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (తక్కువ మొత్తంలో భాగస్వామ్య హక్కు) అనే వినూత్న కాన్సెప్్టను తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన ప్రాప్ టెక్ కంపెనీ అసెట్స్ అండ్ మోర్ ఖాతాలో మరో గ్రూప్ చేరింది. అల్లూర్ ఇన్ఫ్రా బెంగళూరు వద్ద ఏర్పాటు చేసే వాణిజ్య సముదాయాలకు నిధుల సమీకరణ, అమ్మకాలు, నిర్వహణ బాధ్యతలు కంపెనీ చేతికొచ్చాయి. రియలీ్టలో పెట్టుబడిని వ్యవస్థీకృతంగా మారుస్తూ ఇన్వెస్టర్లకు అద్దె రూపంలో ఖచి్చతమైన ఆదాయాన్ని అందించే విధంగా అసెట్స్ అండ్ మోర్ సేవలందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ గచి్చ»ౌలిలోని స్కై సిటీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకై 1.5 లక్షల చదరపు అడుగుల ప్రాపర్టీ నిర్వాహణ కోసం వాసవీ, శాంతా శ్రీరాం గ్రూప్తో ఒప్పందం చేసుకుంది. జహీరాబాద్ నిమ్జ్ సమీపంలో నిర్మించే స్పేస్ సిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కంపె నీ నిర్వహిస్తోంది. అసెట్స్ అండ్ మోర్ మాతృ సంస్థ పైసా ఎక్స్ పైసా మూడేళ్లుగా రూ.250 కోట్ల లోన్ పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తోంది. -
హైడ్రోఫోనిక్స్ గడ్డితో అధిక ఆదాయం
అల్లూరు : పాడిరైతులు సాంప్రదయ పద్ధతిలో పశుగ్రాసం సాగుతో పాటు హైడ్రోఫోనిక్స్ విధానంలో గడ్డిసాగు చేపట్టడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని అల్లూరు పశువైద్యాధికారి డాక్టర్ అస్లాం అన్నారు. స్థానిక పశువైద్యశాలలో హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో పశుగ్రాసం సాగుపై పాడిరైతులకు బుధవారం అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ ట్రేలలో సిద్ధం చేసిన గడ్డిని రైతుల ముందు ప్రదర్శించి ఫలితాలను వివరించారు. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో సెంటు భూమి లేని రైతులు కూడా అత్యంత నాణ్యమైన పశుగ్రాసాన్ని కేవలం ఎనిమిది రోజుల్లోనే గ్రాసం తయారు చేసుకోవచ్చన్నారు. ఈవిధానంలో ఫ్లాస్టిక్ ట్రేలలోనే గడ్డి పెంపకం జరుగుతుందన్నారు. కేవలం లీటరు నీళ్లు, 20 గ్రాముల యూరియా, కేజీ విత్తనాలతో ఎనిమిది రోజుల్లోనే 12 నుంచి 15 కేజీల పచ్చిమేత తయారు చేసుకోవచ్చన్నారు. ఈయూనిట్ ప్రభుత్వం 75 శాతం రాయితీ కూడా ఇస్తుందన్నారు. యూనిట్ ధర రూ.34 వేలు కాగా లబ్ధిదారులు కేవలం రూ.8,500 చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ఆసక్తి కలిగిన రైతులు ఇతర వివరాల కోసం స్థానిక పశువైద్యశాలలో సంప్రదించాలని సూచించారు. -
ఎప్పటికి అవుతుందో..
అల్లూరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్పల్స్ సర్వే మండలంలో నత్తనడకన జరుగుతోంది. ఈనెల 8వ తేదీన ప్రారంభమైన సర్వేకు ఆదిలోనే సర్వర్ సమస్య ఎదురైంది. మండలంలో మొత్తం 14,300 కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరించేందుకు 38 బందాలను ప్రభుత్వం నియమించింది. ఒక్కో బందంలో ఎన్యూమరేటర్, అసిస్టెంట్, చంద్రన్న బీమా ఏజెంటు, సాక్షరాభారత్ కో–ఆర్డినేటర్లతో పాటు ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు. వీరంతా కలిసి ప్రారంభించిన సర్వే ఏ మాత్రం ముందుకుకదల్లేదు. కొన్న ప్రాంతాల్లో సిగ్నల్ పనిచేయక, మరికొన్నిచోట్ల సిగ్నల్ ఉన్నా సర్వర్ తరచూ మొరాయించడం, ట్యాబ్లు పనిచేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోప్రాంతంలో రోజుకు కేవలం ఒకటి, రెండు కుటుంబ వివరాలు కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఈ నెలఖారులోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినా సర్వరు మోరాయించడంతో ఇప్పటివరకు కేవలం మండలంలో 299 కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించారు. దీంతో నిర్ధేశించిన సమయానికి సర్వే పూర్తయ్యేలా కనిపించడంలేదు. సర్వర్ కారణం : పూర్ణచంద్రరావు, తహసీల్దార్ సర్వర్ మొరాయించడంతో సర్వే నెమ్మదిగా జరుగుతోంది. అధికారులు సర్వే పనిపై ఉండటంతో తహసీల్దార్ కార్యాలయంలో పాలన కుంటుబడుతోంది