హైడ్రోఫోనిక్స్ గడ్డితో అధిక ఆదాయం
Published Wed, Aug 10 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
అల్లూరు : పాడిరైతులు సాంప్రదయ పద్ధతిలో పశుగ్రాసం సాగుతో పాటు హైడ్రోఫోనిక్స్ విధానంలో గడ్డిసాగు చేపట్టడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని అల్లూరు పశువైద్యాధికారి డాక్టర్ అస్లాం అన్నారు. స్థానిక పశువైద్యశాలలో హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో పశుగ్రాసం సాగుపై పాడిరైతులకు బుధవారం అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ ట్రేలలో సిద్ధం చేసిన గడ్డిని రైతుల ముందు ప్రదర్శించి ఫలితాలను వివరించారు. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో సెంటు భూమి లేని రైతులు కూడా అత్యంత నాణ్యమైన పశుగ్రాసాన్ని కేవలం ఎనిమిది రోజుల్లోనే గ్రాసం తయారు చేసుకోవచ్చన్నారు. ఈవిధానంలో ఫ్లాస్టిక్ ట్రేలలోనే గడ్డి పెంపకం జరుగుతుందన్నారు. కేవలం లీటరు నీళ్లు, 20 గ్రాముల యూరియా, కేజీ విత్తనాలతో ఎనిమిది రోజుల్లోనే 12 నుంచి 15 కేజీల పచ్చిమేత తయారు చేసుకోవచ్చన్నారు. ఈయూనిట్ ప్రభుత్వం 75 శాతం రాయితీ కూడా ఇస్తుందన్నారు. యూనిట్ ధర రూ.34 వేలు కాగా లబ్ధిదారులు కేవలం రూ.8,500 చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ఆసక్తి కలిగిన రైతులు ఇతర వివరాల కోసం స్థానిక పశువైద్యశాలలో సంప్రదించాలని సూచించారు.
Advertisement
Advertisement