మనం ఎన్నో రకాల టీల గురించి విన్నాం. వాటిలో కొన్ని ఆరోగ్యకరమైన గ్రీన్ టీ వంటి పలు పానీయాలు గురించి కూడా విన్నారు. అలాంటి కోవకు చెందిన నిమ్మగడ్డి టీ గురించి విన్నారా. దీని వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబతున్నారు నిపుణులు. జీర్ణక్రియ దగ్గర నుంచి బరువు తగ్గడం, రోగ నిరోధక శక్తి వరకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించగలదు ఈ టీ. అలాంటి ఈ లెమన్‌గ్రాస్ టీని ఎలా తయారు చేస్తారు? దీని వల్ల కలిగే లాభలేంటో సవివరంగా తెలుసుకుందామా..!
లెమన్ గ్రాస్ టీ తయారీ విధానం..
కావాల్సినవి:
నీళ్లు: నాలుగు కప్పులు, నిమ్మగడ్డి: మూడు కాడలు (పచ్చివి), తేనె: మూడు చెంచాలు (బెల్లం కూడా వేసుకోవచ్చు)
తయారీ: ముందుగా గిన్నెలో నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించుకోవాలి. అందులో నిమ్మగడ్డి వేసి మరో పది నిమిషాలు మరిగించి, ఆవిరి బయటికి రాకుండా మూతపెట్టేయాలి. కప్పులో తేనె వేసుకొని, తేనీటిని అందులోకి వడకట్టుకోవాలి. చక్కటి పరిమళంతో పసందైన నిమ్మగడ్డి టీ రెడీ!. మధుమేగ్రస్తులు బెల్లం ఉపయోగించొచ్చు లేదా వేయకుండా తీసుకోవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు..
దీనిలో ఉండే సిట్రల్ జెరేనియల్ గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వంటివి రాకుండా కాపాడుతుంది.
యాంటీ కేన్సర్ సామర్థ్యాలను కలిగి ఉంది. లెమన్ గ్రాస్‌లో ఉండే ఔషధ గుణాలు కేన్సర్‌తో పోరాడటంలో సహాయపడతాయి. సెల్ డెత్‌కు కారణమయ్యే వాటిని నివారించేలా రోగ నిరోధక శక్తిని పెంచి కేన్సర్‌తో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది.
గ్యాస్ట్రిక్ అల్సర్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది.
రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేగాదు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల నిమ్మరసం మూత్ర ఉత్పత్తిని పెంచి రక్తపోటును తగ్గిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
జీవక్రియను నియంత్రిస్తుంది. శరీరం నుంచి అదనపు వ్యర్థాలను తొలగించి జీవక్రియను వేగవంతం చేస్తుంది.
రుతుక్రమంలో ఎదురయ్యే అధిక రక్తస్రావం వంటి అసౌకర్యాలను తగ్గిస్తుంది.
ఇది ఎంత సురక్షితమైనదైనప్పటికీ అతిగా తాగితే దుష్ప్రభావాలను ఎదుర్కొనక తప్పదు. అవేంటంటే..
తల తిరగడం
ఆకలి పెరగటం
నోరు పొడిబారడం
తరుచుగా మూత్రవిసర్జన
అలసట
దద్దుర్లు, దురద, శ్వాస ఆడకపోవడం, వేగవంతమైన హృదయ స్పందన వంటి అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గర్భవతిగా ఉన్నట్లయితే, వాళ్లలో తక్కువ హృదయ స్పందన రేటు లేదా తక్కువ పొటాషియం స్థాయిని కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో లెమన్‌గ్రాస్ టీని తాగకూడదు.
(చదవండి: హెయిర్ పెర్ఫ్యూమ్‌లు ఎక్కువగా ఉయోగిస్తున్నారా? నిపుణులు వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment