usefull
-
అవును! ఇదీ.. ఎగిరే కీటకాలను ఇట్టే పట్టేస్తుంది!
దోమలు, ఈగలు సహా రకరకాల ఎగిరే కీటకాలు ఇళ్లల్లోకి చేరి ఇబ్బంది పెడుతుంటాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి, వీటిని పారదోలడానికి రకరకాల మందులు వాడుతుంటారు. రసాయనాలు నిండిన మస్కిటో రిపెల్లెంట్స్ వంటి పరికరాలను ఉపయోగిస్తుంటారు. మస్కిటో రిపెల్లెంట్స్ వల్ల దోమల బెడద తగ్గినా, వాటిలోని రసాయనాలు సరిపడక కొందరికి అలర్జీలతో ఇబ్బందులు వస్తుంటాయి. ఎలాంటి రసాయనాలు లేకుండానే, ఎగిరే కీటకాలను ఇట్టే పట్టేసే పరికరాన్ని అమెరికన్ కంపెనీ ‘స్టెమ్’ తాజాగా ఈ ఫ్లైయింగ్ ఇన్సెక్ట్ లైట్ ట్రాప్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మస్కిటో రిపెల్లెంట్స్ మాదిరిగానే దీనిని ప్లగ్‌లో పెట్టి, స్విచాన్ చేసుకుంటే చాలు. ఇందులోని అల్ట్రా వయొలెట్ లైట్ వెలిగి, ఎగిరే కీటకాలను తనవైపు ఆకర్షిస్తుంది. కీటకాలు ఇందులోకి చేరగానే, అల్ట్రా వయొలెట్ లైట్ ప్రభావానికి అవి వెంటనే అక్కడికక్కడే నశిస్తాయి. దీని ధర 17.59 డాలర్లు (రూ.1473) మాత్రమే!హైడ్రోజన్ వాటర్ బాటిల్..ఇది రీచార్జబుల్, పోర్టబుల్ హైడ్రోజన్ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ సాధారణమైన తాగునీటిని క్షణాల్లోనే హైడ్రోజన్ అయాన్ రిచ్ వాటర్‌గా మారుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఆల్ ఇన్ న్యూట్రిషన్స్’ ఈ బాటిల్‌ను ‘హైడ్రా బాటిల్’ పేరుతో తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. హైడ్రోజన్ అయాన్లతో కూడి నీరు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని, పూర్తిగా ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.సాధారణమైన నీటి కంటే ఆల్కలైన్ వాటర్ ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేల్చారు. పూర్తిగా చార్జ్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్లో నీరు నింపి, స్విచాన్ చేసుకుంటే చాలు. క్షణాల్లోనే ఇందులోని నీరు హైడ్రోజన్ అయాన్ రిచ్ వాటర్‌గా మారుతుంది. స్విచాన్ చేసుకున్నాక ఇందులో జరిగే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియలో నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులు వేర్వేరుగా మారి, క్షణాల్లోనే తిరిగి నీరుగా మారుతాయి. ఈ నీరు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని ‘ఆల్ ఇన్ న్యూట్రిషన్స్’ సీఈవో లిండ్సే డంకన్ చెబుతున్నారు. ఈ బాటిల్ ధర 54.99 డాలర్లు (రూ.4,607).నొప్పులను నయం చేస్తుంది..బోలుగా గొట్టంలా ఉండే ఈ సాధనం కీళ్ల నొప్పులను, కండరాల నొప్పులను ఇట్టే నయం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఓమ్నిపెంఫ్’ తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఈ పరికరం ‘నియోరిథమ్ ట్యూబ్’. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ నియోరిథమ్ ట్యూబ్‌ను శరీరంలో నొప్పి ఉన్న భాగానికి తొడుక్కుని స్విచాన్ చేసుకుంటే, ఇది ఆ భాగం చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి, కండరాలకు ఉత్తేజం కలిగిస్తుంది.ఇది సృష్టించే విద్యుదయస్కాంత క్షేత్రం పరిధిలో వెలువడే ప్రకంపనలు బిగపట్టిన కీళ్లను, కండరాలను సడలించి, నొప్పిని తగ్గిస్తాయి. తరచుగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడే వృద్ధుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 269 డాలర్లు (రూ.22,540) మాత్రమే!ఇవి చదివండి: అంత్యక్రియల కాలేజీ..! అవును మీరు విన్నది నిజమే..! అదీ..? -
మంచి మాట: కాలం మహత్తరం శక్తిమంతం
భగవంతుని సృష్టిలో అంతర్భాగమైన కాలానికి ఉన్న శక్తి అద్భుతమైనది, అమోఘమైనది. కష్ట సుఖాలని, మంచి–చెడులని, కలతలని, కన్నీళ్ళని ఇలా అన్నిటిని తనలో లీనం చేసుకుంటూ, వాటి తాలూకు జ్ఞాపకాలని మాత్రమే మిగులుస్తూ, కాలచక్రం గిర్రున తిరిగిపోతుంటుంది.. మన కళ్ళ ఎదుటే ఎంతోమంది మృత్యు ఒడిలోకి జారిపోతున్న వారిని చూస్తున్నా, ఆ దుఖాన్ని అనుభవిస్తున్నా, ఆ క్షణంలో ఎంతో విరక్తిని కల్గించి, కాలక్రమేణా ఆ దుఃఖభారాన్ని మరపింపచేసి, మన జీవితమే శాశ్వతమన్నంతగా మనసు మరల్చి మాయ చేస్తుంది. ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది కనుక. ఇంతటి మహత్తరమైన, శక్తిమంతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ప్రయోగించే విధానాన్నిబట్టి కాలం అర్థం మారిపోతుంటుంది. ఏదో ఆలా కాలక్షేపం చేస్తున్నామండీ అని పెద్దలు అంటుంటారు. అంటే ‘రోజులు గడుపుతున్నాము’ అని అర్థం. ఏదైనా విచిత్ర సంఘటన కళ్ళబడితే ‘కలికాలం’,’పిదపకాలం’ అంటుంటారు. పురాణ పఠనం చేస్తుంటే దాన్ని ‘సత్కాలక్షేపం’ అంటుంటారు. ఇలా అర్థాలు ఎన్ని మారినా, కాలప్రభావంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కాలం గడపటం అంటే ‘పొద్దుపుచ్చటం’ అని మాత్రమే కాదు. నిజానికి సద్వినియోగం చేసుకున్నా,దుర్వినియోగం చేసుకున్నా కాలం మాత్రం ఎవరికోసమూ ఆగదు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. అది సహజం. ఆశలు, ఆశయసాధనాలు, వివాహం, సంతానం, ఇలా ప్రౌఢ, యుక్తవయస్సులు గడచిపోతాయి. అది అప్పటికవసరం. ఇక మిగిలేది బాధ్యతలు తీరిన జీవితం, అలసిపోయిన శరీరం. మొదటి మూడు దశలలోనూ గిర్రున తిరిగిన కాలం, నాల్గవ దశలో, వయసు మీద పడేసరికి కొంత భారంగా గడుస్తున్నట్టనిపిస్తుంది. ఇంటి పెద్దగా ఎన్నో బాధ్యతలతో తలమునకలై, జీవనపోరాట ప్రవాహంలో కొట్టుకుపోతూ, ఒక్కసారిగా విశ్రాంతి లభించటంతో కాలం స్తంభించినట్టుగా భావిస్తాం. కాని ఆలోచిస్తే ఈ విశ్రాంతి పెద్దలకు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే, నిబద్ధతతో కూడిన లక్ష్యసాధన, ఏ వయసు వారినైనా కాలాన్ని సద్వినియోగపరచుకునేలా చేస్తుంది. సక్రమంగా ఉపయోగించుకోలేక పోతే, సమయం వృథా అయిపోయి, జీవితం నిస్సారం గా తయారవుతుంది. వయస్సులో ఉన్నవారు తమ ఆశయసిద్ధి కోసం అవిరామంగా కృషి చేయాలి. వయసు మీరిన వారు తమకు వయసు నేర్పిన పాఠాలు, అనుభవాలు భావితరాలకు పంచవచ్చు. తమలోని మరుగుపడిపోయిన కళలను, సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం పొందవచ్చు. చక్కని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. వృద్ధాశ్రమాలకి వెళ్లి, అక్కడి వారి యోగక్షేమాలని విచారిస్తూ, వారి అనుభవాలను పంచుకుంటూ, తగిన సలహాలు, సూచనలు అందించవచ్చు. ఎదుటివారికి చేతనైనంత సహాయం చేస్తూ, హాయిగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే కాస్త వయసు మీరాక, వీటికన్నిటికీ కాలాన్ని సక్రమంగా ఉపయోగించాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి యోగసాధన జీవితంలో ఒక భాగం కావాలి. యోగసాధన శారీరక, మానసిక రుగ్మతలని దూరం చేస్తుంది. ఏ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. ఆ కాయ కాస్తుంది. సకల జీవరాసులు, కాలానికి అనుగుణంగా తమ తమ జీవనశైలిని మార్చుకుంటూ, కాలానికి కట్టుబడి జీవిస్తాయి. కాలాన్ని సద్వినియోగపరచుకోవటంలో తన మేధస్సును మరింత చక్కగా ఉపయోగించుకోవాలి కదా. కర్మసిద్ధాంతం ప్రకారం జరగాల్సిందేదో అదే జరుగుతుందిలే అని వదిలి వేయకుండా మానవ ప్రయత్నం చేయాలి. భూత భవిష్యత్ ప్రభావాలని రంగరించుకుంటూ జీర్ణించుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ సాగాలి. ‘గతాన్ని తలచుకుని వగచవద్దు.. భవిష్యత్ గురించి భయపడవద్దు... వర్తమానంలో జీవించు’ అంటారు పెద్దలు. మనసుని కలచి వేసే సంఘటనలు, మధుర స్మృతులు– రెండూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. అయితే ఆ సంఘటనల వల్ల కలిగిన గాయం మనకు నేర్పుతున్న పాఠాలు ఏమిటి అని తరచి చూసుకోవాలి. దానిద్వారా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాని దాని గురించి అతిగా వ్యధపడ కూడదు.అలాగే మనసుని సంతోషపెట్టే సంఘటనలను తలచుకోవడం వల్ల మానసిక ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉదాహరణకి బాల్యస్మృతులు ఇంచుమించు అందరికీ ఆనందం కలిగించేవే. ఇక భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు కానీ అంతకే పరిమితమైపోకుండా, ఆ కలని సాకారం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి. – అడవి అన్నపూర్ణ -
ఈ జాగ్రత్తలు పాటిస్తే హోం లోన్ చెల్లింపులు ఎంతో ఈజీ !
గృహ రుణం తీసుకుంటున్నామంటే దీర్ఘకాలం పాటు ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటున్నట్టు అర్థం చేసుకోవాలి. ఆ రుణాన్ని 10–20 ఏళ్లపాటు చెల్లించేందుకు ఆర్థికంగా, భౌతికంగా, భావోద్వేగ పరంగా సన్నద్ధులై ఉండాలి. ఇలా దీర్ఘకాలం పాటు రుణ చెల్లింపుల ఒప్పందంలోకి ప్రవేశించిన తర్వాత.. దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగి రుణ గ్రహీత మరణిస్తే.. లేదా రుణ గ్రహీత ఆదాయం నిలిచిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. రుణం తీసుకునే వ్యక్తి తనకు ఏదైనా జరిగితే తన కుటుంబంపై రుణం తీర్చాల్సిన ఆర్థిక భారం పడుతుందన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి భిన్న పరిస్థితుల్లో గృహ రుణం చెల్లింపులు ఆగిపోకుండా సజావుగా చెల్లించేలా చూసుకునేందుకు మార్గాలున్నాయి. రుణంపై బీమా కవరేజీ గృహ రుణం ఇచ్చే సమయంలోనే కొన్ని సంస్థలు ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తీసుకోవాలని కోరుతున్నాయి. ఈ కవరేజీతో చెల్లింపులకు రక్షణ ఏర్పడుతుంది. సాధారణంగా హోమ్‌లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ (హెచ్‌ఎల్‌పీపీ) అన్నది మీరు తీసుకునే గృహ రుణం విలువకు సమానంగా ఉంటుంది. ఇలా కాకుండా వ్యక్తిగతంగానూ రుణ గ్రహీత టర్మ్ కవరేజీ ప్లాన్‌ను తీసుకోవచ్చు. రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్నారనుకోండి. అప్పుడు హెచ్‌ఎల్‌పీపీ కూడా రూ.25 లక్షల కవరేజీతో వస్తుంది. ఇందుకు ప్రీమియం కింద సుమారు రూ.86,335 చెల్లించాల్సి వస్తుంది. ఒక ఏడాది తర్వాత చెల్లించాల్సిన గృహ రుణం రూ.20.5 లక్షలకు తగ్గిందనుకుందాం. ఆ సమయంలో రుణ గ్రహీత మరణిస్తే బీమా సంస్థే పాలసీదారు తరఫున మిగిలిన గృహ రుణ బకాయిని పూర్తిగా తీర్చేస్తుంది. టర్మ్ కవరేజీ టర్మ్ కవరేజీని విడిగా తీసుకోవడం వల్ల పాలసీదారుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పైన చెప్పుకున్నట్టుగానే రూ.25 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాలానికి తీసుకున్న ఏడాది తర్వాత రుణ గ్రహీత మరణించించినట్టయితే.. రూ.25 లక్షల టర్మ్ ప్లాన్ పూర్తి మొత్తాన్ని పొందొచ్చు. అంటే మిగిలిన రుణ బకాయి రూ.20.5 లక్షలుపోను రూ.4.5 లక్షలను రుణ గ్రహీత కుటుంబం అందుకోవచ్చు. ప్రీమియం చెల్లింపుల పరంగా హెచ్ఎల్పీపీతో పోలిస్తే టర్మ్ ప్లాన్ సౌకర్యంగా ఉంటుంది. ప్రీమియం మొత్తాన్ని రుణం తీసుకునే సమయంలోనే చెల్లించాల్సిన అవసరం ఉండదు. రెగ్యులర్ బీమా ప్లాన్ మాదిరే క్రమానుగతంగా ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్ ఉంటుంది. కనుక హెచ్‌ఎల్‌పీపీ, టర్మ్ప్లాన్లో అనుకూలమైన దానిని రుణ గ్రహీత ఎంపిక చేసుకోవచ్చు. అత్యవసర నిధి బీమా కవరేజీ తీసుకుని హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంటే సరిపోదు. ప్రతీ నెలా ఈఎంఐ చెల్లించాల్సిన బాధ్యత నేపథ్యంలో అత్యవసర పరిస్థితులకు సన్నద్ధమై ఉండాలి. గృహ రుణం మాదిరి పెద్ద మొత్తంలో రుణ బాధ్యతను మోస్తున్నప్పుడు.. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా, గృహ రుణం ఈఎంఐలకు చెల్లింపులకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం. కనుక లిక్విడ్ ఫండ్స్‌లో కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. దీనివల్ల పెట్టుబడులపై రాబడులకుతోడు.. నిర్ణీత కాలంలో ఒక నిధి ఏర్పడుతుంది. ఈ చిన్న అడుగులతో గృహ రుణ బాధ్యత విషయంలో భద్రతను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థతులు తలెత్తినా అప్పుడు మీరు కంగారు పడిపోవక్కర్లేదు. మీ కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లకుండా కాపాడినట్టు అవుతుంది. గృహ రుణం ఈఎంఐను క్రమం తప్పకుండా చెల్లించినట్టయితే మంచి క్రెడిట్ స్కోర్ కూడా ఏర్పడుతుంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ అన్నది భవిష్యత్తులో రుణ అవసరాల్లో ఎంతో సాయపడుతుంది. - అరవింద్ హాలి, మోతీలాల్ ఓస్వాల్ హోమ్ ఫైనాన్స్ ఎండీ, సీఈవో చదవండి: ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు.. తెలియకుండానే బోలెడంత లాస్!! -
మెట్ట పంటలకు ఊరట
జిల్లాలో విస్తారంగా వర్షాలు మాచర్లలో 10.42 సెం.మీ వర్షం కొరిటెపాడు (గుంటూరు): ప్రస్తుత వర్షాలతో మెట్ట పంటలకు కొంత ఊరట దొరికింది. సీజన్ ముగియడంతో ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే పత్తి సాగు తగ్గింది. పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 1.90 లక్షల హెక్టార్లు కాగా, 1.30 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. మిరప సాగు చేసే రైతులకు వర్షం కలిసొచ్చింది. కృష్ణా డెల్టాలో ఇప్పటి వరకు వరి నాట్లు వేసిన, ప్రస్తుతం నాట్లు వేస్తున్న రైతులకు ఈ వర్షం ఉపకరించింది. మినుము, పెసర, కంది, మొక్కజొన్న, అపరాల పంటలకు వర్షం మేలు చేసింది. పత్తి పంటకు ఎరువులు వేస్తున్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వి.డి.వి.కృపాదాసు తెలిపారు. మాచర్లలో 10.42 సెం.మీ వర్షం... జిల్లాలో సోమవారం ఉదయం వరకు అత్యధికంగా మాచర్ల మండలంలో 10.42 సెంటీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా అమరావతి మండలంలో 0.02 సెం.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... దుర్గి మండలంలో 6.92 సెం.మీ., రెంటచింతల 4.66, మేడికొండూరు 3.06, వెల్ధుర్తి 2.84, గుంటూరు 2.30, బెల్లంకొండ 2.24, మాచవరం 2.24, రాజుపాలెం 2.02, సత్తెనపల్లి 1.92, ప్రత్తిపాడు 1.84, బొల్లాపల్లి 1.56, వినుకొండ 1.54, నకరికల్లు 1.26, వట్టిచెరుకూరు 1.26, ఫిరంగిపురం 1.20, పొన్నూరు 1.20, గురజాల 1.18, ముప్పాళ్ల 1.14, నూజెండ్ల 1.10, చిలకలూరిపేట 1.00, దాచేపల్లి 0.82, రొంపిచర్ల 0.82, చేబ్రోలు 0.72, నరసరావుపేట 0.72, నిజాంపట్నం 0.72, పెదకూరపాడు 0.68, యడ్లపాడు 0.64, నాదెండ్ల 0.62, కారంపూడి 0.60, క్రోసూరు 0.46, ఈపూరు మండలంలో 0.38 సెం.మీ చొప్పున వర్షం కురిసింది. -
హైడ్రోఫోనిక్స్ గడ్డితో అధిక ఆదాయం
అల్లూరు : పాడిరైతులు సాంప్రదయ పద్ధతిలో పశుగ్రాసం సాగుతో పాటు హైడ్రోఫోనిక్స్ విధానంలో గడ్డిసాగు చేపట్టడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందవచ్చని అల్లూరు పశువైద్యాధికారి డాక్టర్ అస్లాం అన్నారు. స్థానిక పశువైద్యశాలలో హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో పశుగ్రాసం సాగుపై పాడిరైతులకు బుధవారం అవగాహన కలిగించారు. ప్లాస్టిక్ ట్రేలలో సిద్ధం చేసిన గడ్డిని రైతుల ముందు ప్రదర్శించి ఫలితాలను వివరించారు. హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో సెంటు భూమి లేని రైతులు కూడా అత్యంత నాణ్యమైన పశుగ్రాసాన్ని కేవలం ఎనిమిది రోజుల్లోనే గ్రాసం తయారు చేసుకోవచ్చన్నారు. ఈవిధానంలో ఫ్లాస్టిక్ ట్రేలలోనే గడ్డి పెంపకం జరుగుతుందన్నారు. కేవలం లీటరు నీళ్లు, 20 గ్రాముల యూరియా, కేజీ విత్తనాలతో ఎనిమిది రోజుల్లోనే 12 నుంచి 15 కేజీల పచ్చిమేత తయారు చేసుకోవచ్చన్నారు. ఈయూనిట్ ప్రభుత్వం 75 శాతం రాయితీ కూడా ఇస్తుందన్నారు. యూనిట్ ధర రూ.34 వేలు కాగా లబ్ధిదారులు కేవలం రూ.8,500 చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ఆసక్తి కలిగిన రైతులు ఇతర వివరాల కోసం స్థానిక పశువైద్యశాలలో సంప్రదించాలని సూచించారు.