మెట్ట పంటలకు ఊరట
మెట్ట పంటలకు ఊరట
Published Tue, Sep 13 2016 5:51 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM
జిల్లాలో విస్తారంగా వర్షాలు
మాచర్లలో 10.42 సెం.మీ వర్షం
కొరిటెపాడు (గుంటూరు): ప్రస్తుత వర్షాలతో మెట్ట పంటలకు కొంత ఊరట దొరికింది. సీజన్ ముగియడంతో ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే పత్తి సాగు తగ్గింది. పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 1.90 లక్షల హెక్టార్లు కాగా, 1.30 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. మిరప సాగు చేసే రైతులకు వర్షం కలిసొచ్చింది. కృష్ణా డెల్టాలో ఇప్పటి వరకు వరి నాట్లు వేసిన, ప్రస్తుతం నాట్లు వేస్తున్న రైతులకు ఈ వర్షం ఉపకరించింది. మినుము, పెసర, కంది, మొక్కజొన్న, అపరాల పంటలకు వర్షం మేలు చేసింది. పత్తి పంటకు ఎరువులు వేస్తున్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వి.డి.వి.కృపాదాసు తెలిపారు.
మాచర్లలో 10.42 సెం.మీ వర్షం...
జిల్లాలో సోమవారం ఉదయం వరకు అత్యధికంగా మాచర్ల మండలంలో 10.42 సెంటీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా అమరావతి మండలంలో 0.02 సెం.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... దుర్గి మండలంలో 6.92 సెం.మీ., రెంటచింతల 4.66, మేడికొండూరు 3.06, వెల్ధుర్తి 2.84, గుంటూరు 2.30, బెల్లంకొండ 2.24, మాచవరం 2.24, రాజుపాలెం 2.02, సత్తెనపల్లి 1.92, ప్రత్తిపాడు 1.84, బొల్లాపల్లి 1.56, వినుకొండ 1.54, నకరికల్లు 1.26, వట్టిచెరుకూరు 1.26, ఫిరంగిపురం 1.20, పొన్నూరు 1.20, గురజాల 1.18, ముప్పాళ్ల 1.14, నూజెండ్ల 1.10, చిలకలూరిపేట 1.00, దాచేపల్లి 0.82, రొంపిచర్ల 0.82, చేబ్రోలు 0.72, నరసరావుపేట 0.72, నిజాంపట్నం 0.72, పెదకూరపాడు 0.68, యడ్లపాడు 0.64, నాదెండ్ల 0.62, కారంపూడి 0.60, క్రోసూరు 0.46, ఈపూరు మండలంలో 0.38 సెం.మీ చొప్పున వర్షం కురిసింది.
Advertisement
Advertisement