దోమలు, ఈగలు సహా రకరకాల ఎగిరే కీటకాలు ఇళ్లల్లోకి చేరి ఇబ్బంది పెడుతుంటాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి, వీటిని పారదోలడానికి రకరకాల మందులు వాడుతుంటారు. రసాయనాలు నిండిన మస్కిటో రిపెల్లెంట్స్ వంటి పరికరాలను ఉపయోగిస్తుంటారు. మస్కిటో రిపెల్లెంట్స్ వల్ల దోమల బెడద తగ్గినా, వాటిలోని రసాయనాలు సరిపడక కొందరికి అలర్జీలతో ఇబ్బందులు వస్తుంటాయి.
ఎలాంటి రసాయనాలు లేకుండానే, ఎగిరే కీటకాలను ఇట్టే పట్టేసే పరికరాన్ని అమెరికన్ కంపెనీ ‘స్టెమ్’ తాజాగా ఈ ఫ్లైయింగ్ ఇన్సెక్ట్ లైట్ ట్రాప్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మస్కిటో రిపెల్లెంట్స్ మాదిరిగానే దీనిని ప్లగ్‌లో పెట్టి, స్విచాన్ చేసుకుంటే చాలు. ఇందులోని అల్ట్రా వయొలెట్ లైట్ వెలిగి, ఎగిరే కీటకాలను తనవైపు ఆకర్షిస్తుంది. కీటకాలు ఇందులోకి చేరగానే, అల్ట్రా వయొలెట్ లైట్ ప్రభావానికి అవి వెంటనే అక్కడికక్కడే నశిస్తాయి. దీని ధర 17.59 డాలర్లు (రూ.1473) మాత్రమే!
హైడ్రోజన్ వాటర్ బాటిల్..
ఇది రీచార్జబుల్, పోర్టబుల్ హైడ్రోజన్ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ సాధారణమైన తాగునీటిని క్షణాల్లోనే హైడ్రోజన్ అయాన్ రిచ్ వాటర్‌గా మారుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఆల్ ఇన్ న్యూట్రిషన్స్’ ఈ బాటిల్‌ను ‘హైడ్రా బాటిల్’ పేరుతో తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. హైడ్రోజన్ అయాన్లతో కూడి నీరు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని, పూర్తిగా ఆల్కలైన్ లక్షణాలను కలిగి ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.
సాధారణమైన నీటి కంటే ఆల్కలైన్ వాటర్ ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేల్చారు. పూర్తిగా చార్జ్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్‌లో నీరు నింపి, స్విచాన్ చేసుకుంటే చాలు. క్షణాల్లోనే ఇందులోని నీరు హైడ్రోజన్ అయాన్ రిచ్ వాటర్‌గా మారుతుంది. స్విచాన్ చేసుకున్నాక ఇందులో జరిగే ప్రోటాన్ ఎక్స్‌చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రాలిసిస్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ ప్రక్రియలో నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులు వేర్వేరుగా మారి, క్షణాల్లోనే తిరిగి నీరుగా మారుతాయి. ఈ నీరు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని ‘ఆల్ ఇన్ న్యూట్రిషన్స్’ సీఈవో లిండ్సే డంకన్ చెబుతున్నారు. ఈ బాటిల్ ధర 54.99 డాలర్లు (రూ.4,607).
నొప్పులను నయం చేస్తుంది..
బోలుగా గొట్టంలా ఉండే ఈ సాధనం కీళ్ల నొప్పులను, కండరాల నొప్పులను ఇట్టే నయం చేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘ఓమ్నిపెంఫ్’ తాజాగా అందుబాటులోకి తెచ్చిన ఈ పరికరం ‘నియోరిథమ్ ట్యూబ్’. రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఈ నియోరిథమ్ ట్యూబ్‌ను శరీరంలో నొప్పి ఉన్న భాగానికి తొడుక్కుని స్విచాన్ చేసుకుంటే, ఇది ఆ భాగం చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి, కండరాలకు ఉత్తేజం కలిగిస్తుంది.
ఇది సృష్టించే విద్యుదయస్కాంత క్షేత్రం పరిధిలో వెలువడే ప్రకంపనలు బిగపట్టిన కీళ్లను, కండరాలను సడలించి, నొప్పిని తగ్గిస్తాయి. తరచుగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడే వృద్ధుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు తయారీదారులు చెబుతున్నారు. దీని ధర 269 డాలర్లు (రూ.22,540) మాత్రమే!
ఇవి చదివండి: అంత్యక్రియల కాలేజీ..! అవును మీరు విన్నది నిజమే..! అదీ..?
Comments
Please login to add a commentAdd a comment