ఫేస్‌క్రీమ్ అయిపోవచ్చినా.. టూత్‌పేస్ట్ అయిపోవచ్చినా.. అందులో మిగిలిన క్రీమ్‌ని బయటికి లాగడం కష్టమే! ఆ క్రీమ్‌ని లాగడానికి సర్కస్ చేయాల్సి వస్తుంది. అయితే చిత్రంలోని ఈ టూల్.. ఎలాంటి సర్కస్ చేయకుండానే క్రీమ్‌ని అమాంతం బయటకు లాగుతుంది. ఈ మాన్యువల్ రోలింగ్ హోల్డర్‌తో ప్లాస్టిక్ ట్యూబ్స్ ( ఫెయిర్‌నెస్, మాయిశ్చరైజ్ క్రీమ్స్, టూత్ పేస్ట్, గమ్ ట్యూబ్ వంటి వాటిని) చివరలను పట్టి ఉంచేలా చేస్తే చాలు.
టూల్‌కి ఒకవైపు ఉన్న మినీ హ్యాండిల్‌ని క్లాక్ వైజ్ తిప్పితే ఆ ట్యూబ్‌లోంచి క్రీమ్ బయటకు వస్తుంది. ఖాళీగా అవుతున్న ట్యూబ్.. టూల్ లోపల గుండ్రంగా రొటేటింగ్ లీవర్ చుట్టూ చుట్టుకుంటుంది. దీన్ని యూజ్ చెయ్యడం చాలా తేలిక. ఇలాంటివి రెండు మూడు తీసుకుని.. ఒకటి కిచె¯Œ లో.. ఒకటి వాష్ రూమ్‌లో.. ఒకటి అద్దం ముందు అందుబాటులో పెట్టుకుంటే సరి! మూడు హోల్డర్స్ కలిపి కింద ధరకు లభిస్తున్నాయి.
అవుట్ డోర్ స్మాల్ గ్రిల్..
ఆకలేసే సమయానికి వేడివేడిగా డిలీషియస్ డిషెస్‌ను అందించే ఇలాంటి స్మాల్ గ్రిల్స్‌ని ఇష్టపడనివారుంటారా! ఇది పిక్నిక్స్, హైకింగ్, క్యాంపింగ్ ఇలా స్నేహితులతో, బంధువులతో కలసి బయటికి ఏ ట్రిప్‌కి వెళ్లినా భలే సౌకర్యంగా ఉంటుంది. చిత్రంలో చూపిన విధంగా ఈ మేకర్‌ని ఓపెన్ చేసుకుని.. ఆహారాన్ని బొగ్గులపై గ్రిల్ చేసుకోవచ్చు.
హైక్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన ఈ గాడ్జెట్ తుప్పు పట్టదు. దీన్ని పట్టుకున్నప్పుడు.. వెంట తీసుకుని వెళ్తున్నప్పుడు.. చేతులు గీసుకోవడం, దుస్తులు పాడవడం లాంటి సమస్యలు ఉండవు. ఇందులో సుమారు ఐదుగురికి సరిపడా ఆహారాన్ని ఒకేసారి తయారుచేసుకోవచ్చు. దీన్ని క్లీన్ చేయడమూ తేలికే!
ఇవి చదవండి: ఏఐ డస్ట్‌బిన్స్‌ని.. ఎప్పుడైనా చూశారా?
Comments
Please login to add a commentAdd a comment