ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఉంగరం. దీనిని వేలికి తొడుక్కుంటే, మంత్రదండం చేతిలో ఉన్నట్లే! వాయిస్ కమాండ్స్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. రిమోట్ కంట్రోల్‌తో పని లేకుండా, కమాండ్స్‌ను గుసగుసలుగా వినిపిస్తే చాలు. రిమోట్‌తో చేసే పనులన్నీ ఇదే చేసిపెడుతుంది.
అమెరికన్ కంపెనీ ‘వీటచ్’ ఈ ఉంగరాన్ని ‘విజ్‌పీఆర్’ పేరుతో మార్కెట్‌లోకి తెచ్చింది. ఇంటికి దూరంగా ఉన్నా, దీనిని నిక్షేపంగా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు టీవీ ఆఫ్ చేయడం మరచిపోయి, ఇంటికి తాళం వేసి బయటకు వచ్చేశారనుకోండి, ఈ ఉంగరాన్ని నోటి దగ్గరకు తెచ్చుకుని గుసగుసగా కమాండ్ వినిపిస్తే చాలు.
ఇంట్లోని టీవీని వెంటనే ఆఫ్ చేసేస్తుంది. ఇది మొబైల్ యాప్ ద్వారా పనిచేస్తుంది. దీనిని యాపిల్ హోమ్‌కిట్, గూగుల్ హోమ్, అమెజాన్ అలెక్సా, చాట్ జీపీటీ, శామ్‌సంగ్ స్మార్ట్‌థింగ్స్‌లలో దేనితోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ధర 199 డాలర్లు (రూ.16,632) మాత్రమే!
చేతిలో పట్టేసే ప్రింటర్..
కంప్యూటర్ ప్రింటర్లు సాధారణంగా భారీగా ఉంటాయి. ఒక చోటు నుంచి మరో చోటుకు వాటిని తేలికగా తీసుకుపోవడం సాధ్యం కాదు. అయితే, చేతిలో పట్టేసే పరిమాణంలో ఉన్న ఈ ఇంక్‌జెట్ ప్రింటర్‌ను అమెరికన్ డిజైనర్ జాన్ బ్రాంకా రూపొందించాడు. ఈ ప్రింటర్‌ను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు.
డెస్క్‌టాప్, లాప్‌టాల్‌లలోని ఫైళ్లతో పాటు టాబ్, మొబైల్ ఫోన్లలోని ఫైళ్లను కూడా దీని ద్వారా సులువుగా ముద్రించుకోవచ్చు. ‘స్క్రైబ్’ పేరుతో రూపొందించిన ఈ ప్రింటర్ కేవలం ప్రింటర్‌గా మాత్రమే కాకుండా, స్కానర్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇందులో గరిష్ఠంగా ఏ4 పరిమాణం వరకు మాత్రమే ఫైళ్లను ముద్రించుకోవడం సాధ్యమవుతుంది. దీని ధర 1250 డాలర్లు (రూ.1.04 లక్షలు).
ఇవి చవవండి: తొలి సజీవ కంప్యూటర్‌ని.. మీరెప్పుడైనా చూశారా!?
Comments
Please login to add a commentAdd a comment