ఆలూ టిక్కా, పనీర్ టిక్కా, తందూరీ రోటీ, పరాటా, కేక్, మఫిన్స్ ఇలా అనేక రకాల వెరైటీలకు ఈ త్రీ ఇన్ వన్ తందూర్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ హీటింగ్ ఎలిమెంట్‌తో రూపొందిన ఈ మెషిన్.. షాక్ కొట్టడం, బ్లాస్ట్ అవ్వడం, తుప్పు పట్టడం వంటి సమస్యలకు దూరంగా ఉంటుంది.
టోస్ట్, గ్రిల్, బేక్, కుక్ వంటి ఎన్నో పనులను చేసిపెడుతుంది. ఇందులో ఒకేసారి రెండు వెరైటీలను వండుకోవచ్చు. అలాగే ఇందులో మూడు వేరువేరు ట్రేలు ఉండటంతో.. చాలా వెరైటీలు సిద్ధమవుతాయి. పైన గ్రిల్ స్టిక్స్ అమర్చుకునే ట్రేతో పాటు.. కర్రీ లేదా సూప్ వంటివీ చేసుకునే ట్రేను అమర్చుకోవచ్చు. ఇక కింద ఉన్న తందూర్ ట్రేలో.. పిజ్జా, కేక్స్ వంటివి చేసుకోవచ్చు. ధర 48 డాలర్లు (రూ.4,011)
ఎగ్ స్క్రబ్బర్..
కోడి గుడ్డును ఇష్టపడని వాళ్లు అరుదేమో! అయితే అది చూడటానికి నీట్‌గా లేకుంటే.. తినబుద్ధి కాదు. కొన్ని కోడిగుడ్లు గారపట్టి.. డర్టీగా ఉంటాయి. ఆ మచ్చలు ఊరికే నీళ్లతో కడిగితే పోవు. అలాంటి సమస్యకు చెక్ పెడుతుంది ఈ సిలికాన్ ఎగ్ వాషర్ మెషిన్ టూల్. దీనికి ఎగ్ స్క్రబ్బర్, ఎగ్ స్పిన్నింగ్ క్లీనర్ బ్రష్, ఎగ్ రోటరీ వాష్ క్లీనింగ్ బ్రష్ అని చాలా పేర్లే ఉన్నాయి.
దీన్ని వినియోగించడం తేలికే! అర్ధచంద్రాకారంగా ఉన్న ఈ టూల్‌లో గుడ్డును సగానికి పెట్టుకుని.. మరో సగాన్ని పట్టుకుని.. నీళ్ల సాయంతో సుతిమెత్తగా స్క్రబ్ చేస్తే చాలు.. ఎలాంటి మచ్చలున్నా పోయి.. తెల్లగా మారిపోతుంది. దీన్ని వినియోగించిన తర్వాత.. టూల్‌ని తిరగేసి శుభ్రంగా నీళ్లతో కడిగి పెట్టుకోవచ్చు. ధర 39 డాలర్లు(రూ.3,259)
ఎలక్ట్రిక్ స్మోకర్..
అల్యూమినైజ్డ్ స్టీల్ లైనర్‌తో, హై–హీట్ కోటింగ్‌తో, డబుల్ వాల్ ఇన్సులేషన్‌తో, హై–టెంపరేచర్ డోర్ సీల్‌తో రూపొందిన ఈ స్మోకర్.. వినియోగించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇందులో త్రీ ర్యాక్స్.. ఉండటంతో చాలా వెరైటీలను వండుకోవచ్చు. చికెన్, మటన్ వంటి పెద్ద పెద్ద ఐటమ్స్‌నూ గ్రిల్ చేసుకోవచ్చు. 150 డిగ్రీల ఫారన్ హీట్ నుంచి 350 డిగ్రీల ఫారన్ హీట్ వరకు టెంపరేచర్‌ని సెట్ చేసుకోవచ్చు.
అలాగే డివైస్ ముందున్న రెగ్యులేటర్ సాయంతో.. ఇందులోని వంటను మనకు వీలుగా మలుచుకోవచ్చు. గ్రిల్ స్టిక్స్, ప్లేట్స్ ఇలా చాలా అదనపు భాగాలూ లభిస్తాయి ఈ స్మోకర్‌తో! దీన్ని యూజ్ చెయ్యడం.. క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. దీనికి డోర్ లాంటి మూత ఉండటంతో ఇందులో ఆహారాన్ని నిలవా ఉంచుకోవచ్చు. ధర 249 డాలర్లు రూ. 20,808)
ఇవి చదవండి: డెవిల్స్ పూల్! ఆ నీళ్లల్లో అడుగుపెడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదట!!
Comments
Please login to add a commentAdd a comment