![Assets and More is Property Fund Manager for Allure Infra - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/14/ALLURE.jpg.webp?itok=Kz9G57hX)
అల్లూర్ వెంచర్స్ సీఈవో దిలీప్ సి భైరా, అసెట్స్ అండ్ మోర్ సీఈవో హను యెడ్లూరి (కుడి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (తక్కువ మొత్తంలో భాగస్వామ్య హక్కు) అనే వినూత్న కాన్సెప్‌్టను తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన ప్రాప్ టెక్ కంపెనీ అసెట్స్ అండ్ మోర్ ఖాతాలో మరో గ్రూప్ చేరింది. అల్లూర్ ఇన్‌ఫ్రా బెంగళూరు వద్ద ఏర్పాటు చేసే వాణిజ్య సముదాయాలకు నిధుల సమీకరణ, అమ్మకాలు, నిర్వహణ బాధ్యతలు కంపెనీ చేతికొచ్చాయి. రియలీ్టలో పెట్టుబడిని వ్యవస్థీకృతంగా మారుస్తూ ఇన్వెస్టర్లకు అద్దె రూపంలో ఖచి్చతమైన ఆదాయాన్ని అందించే విధంగా అసెట్స్ అండ్ మోర్ సేవలందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ గచి్చ»ౌలిలోని స్కై సిటీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకై 1.5 లక్షల చదరపు అడుగుల ప్రాపర్టీ నిర్వాహణ కోసం వాసవీ, శాంతా శ్రీరాం గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. జహీరాబాద్ నిమ్జ్ సమీపంలో నిర్మించే స్పేస్ సిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కంపె నీ నిర్వహిస్తోంది. అసెట్స్ అండ్ మోర్ మాతృ సంస్థ పైసా ఎక్స్ పైసా మూడేళ్లుగా రూ.250 కోట్ల లోన్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment