commercial complex
-
షాపింగ్ కాంప్లెక్స్‌లో మంటలు..ప్రాణాల కోసం ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి..
ఛత్తీస్‌గఢ్:ఛత్తీస్‌గఢ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకోగా..ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. కోర్భా జిల్లాలోని ట్రాన్స్‌పోర్టు నగర్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ వినియోగదారులతో కిటకిటలాడుతుంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో కాంప్లెక్స్‌లో ఉన్న జనం బయటకు పరుగులు తీశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వినియోగదారులు మంటల నుంచి తప్పించుకోవడానికి కిందకు దూకారు. షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు దాని చుట్టూ ఉన్న దుకాణాలకు కూడా మంటలు చుట్టుముట్టాయి. వాటి పక్కనే ఉన్న ఓ బ్యాంకు కూడా మంటల్లో దగ్దమయ్యింది. అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. #WATCH | A fire broke out in Transport Nagar market of Korba in Chhattisgarh today. Three people have died and over ten people were rescued in the fire incident, said Sanjeev Kumar Jha, Collector Korba. pic.twitter.com/OJT45cxhqu — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 19, 2023 ఇదీ చదవండి:కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు.. -
అల్లూర్ ఇన్ఫ్రాకు అసెట్స్ అండ్ మోర్ సేవలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (తక్కువ మొత్తంలో భాగస్వామ్య హక్కు) అనే వినూత్న కాన్సెప్‌్టను తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేసిన ప్రాప్ టెక్ కంపెనీ అసెట్స్ అండ్ మోర్ ఖాతాలో మరో గ్రూప్ చేరింది. అల్లూర్ ఇన్ఫ్రా బెంగళూరు వద్ద ఏర్పాటు చేసే వాణిజ్య సముదాయాలకు నిధుల సమీకరణ, అమ్మకాలు, నిర్వహణ బాధ్యతలు కంపెనీ చేతికొచ్చాయి. రియలీ్టలో పెట్టుబడిని వ్యవస్థీకృతంగా మారుస్తూ ఇన్వెస్టర్లకు అద్దె రూపంలో ఖచి్చతమైన ఆదాయాన్ని అందించే విధంగా అసెట్స్ అండ్ మోర్ సేవలందిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ గచి్చ»ౌలిలోని స్కై సిటీ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకై 1.5 లక్షల చదరపు అడుగుల ప్రాపర్టీ నిర్వాహణ కోసం వాసవీ, శాంతా శ్రీరాం గ్రూప్‌తో ఒప్పందం చేసుకుంది. జహీరాబాద్ నిమ్జ్ సమీపంలో నిర్మించే స్పేస్ సిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కంపె నీ నిర్వహిస్తోంది. అసెట్స్ అండ్ మోర్ మాతృ సంస్థ పైసా ఎక్స్ పైసా మూడేళ్లుగా రూ.250 కోట్ల లోన్ పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తోంది. -
కొత్త ప్లాన్‌తో ముందుకొస్తున్న టీఎస్ఆర్టీసీ..!
సాక్షి, హైదరాబాద్: పట్టణాల నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలను ఊరు చివరకు మార్చి.. ఖాళీ అయిన ఆ స్థలాలను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ యోచిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. టికెట్ రూపంలో వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోవడం లేదు. కోవిడ్ కష్టాల నుంచి బయటపడ్డా, ఆ ఆదాయంతో ఆర్టీసీని నెట్టుకురావడం కష్టంగా మారింది. దీంతో ఇప్పటికిప్పుడు ఆర్టీసీ ఇతర ఆదాయాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. గతంలో ఇదే ఉద్దేశంతో ప్రారంభించిన పెట్రోల్ బంకులు కొంత కుదురుకున్నా.. సంస్థకు పెద్దగా ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలేదు. ఇటీవల ఎంతో ఆశతో ప్రారంభించిన కార్గో సర్వీసు తెల్ల ఏనుగులా మారింది. అందులో ఆర్టీసీ ఎక్సెస్ సిబ్బందినే వినియోగిస్తుండటంతో దాని ద్వారా వచ్చే ఆదాయం వారి జీతాలకు కూడా సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వాడి తద్వారా ఆదాయాన్ని పొందాలన్న యోచనలో సంస్థ ఉంది. ఈ ఆలోచన కొత్తది కాకున్నా.. దాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న ప్రతిపాదన సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలు పట్టణాల మధ్యలో ఉన్నాయి. వీటిల్లో ఏయే ప్రాంతాల్లోని వాటిని ఖాళీ చేయవచ్చో జాబితా రూపొందిస్తున్నారు. గతంలో ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో డిపోల సంఖ్యను పెంచారు. పక్కపక్కనే రెండు డిపోలు ఉన్న చోట ఒక్క దాన్ని ఉంచి, రెండో డిపోను మూసేసే యోచనలో ఉన్నారు. దూరప్రాంతాల సర్వీసులపై ఎక్కువ దృష్టి సారించి సిటీ, పల్లె వెలుగు బస్సుల సంఖ్యను తగ్గించే యోచనలో ఆర్టీసీ ఉంది. అప్పుడు మరికొన్ని డిపోలు నామమాత్రమే కానున్నాయి. ఇలాంటి వాటిని పక్క డిపోలో కలిపేసి ఆ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. నగరంలో కూడా.. భాగ్యనగరంలోనూ డిపోల సంఖ్యను కుదించే దిశగా ఆర్టీసీ కదులుతోంది. రెండేళ్ల క్రితం ఆర్టీసీ సమ్మె సమయంలో సిటీలో దాదాపు వేయి బస్సులను తగ్గించారు. ప్రతి సంవత్సరం బస్సుల సంఖ్యను పెంచే పద్ధతిని ఆపేశారు. దీంతో కొన్ని డిపోల్లో సర్వీసుల సంఖ్య తగ్గింది. అలాంటి డిపోలను మూసేస్తే ఆ స్థలాలు వాణిజ్య అవసరాలకు చేతికొస్తాయి. ఔటర్ చుట్టూ స్థలాన్ని కేటాయిస్తే, నగరంలో ఉన్న డిపోలను ఖాళీ చేయాలని ఆర్టీసీ భావించింది. కానీ, ఔటర్ చుట్టూ స్థలాలకు ధరలు బాగా పెరగటంతో ఆ ప్రతిపాదనను హెచ్ఎండీఏ అంగీకరించలేదు. ఇప్పుడు చాలా డిపోలకు పెద్దగా డిమాండ్ లేనందున, సిటీ అవతల ఉన్న ప్రభుత్వ స్థలాలను వినియోగించుకుని నగరంలోని కొన్ని బస్‌డిపోలను ఖాళీ చేయాలని ఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. లీజా..విక్రయమా.. ఇలా వచ్చిన స్థలాలను లీజుకు ఇవ్వాలా, విక్రయించాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఉన్న స్థలాలను అమ్మేస్తే భవిష్యత్తులో ఆర్టీసీ అవసరాలకు భూములు లేకుండా పోతాయన్న ఆందోళన ఉంది. దీంతో లీజుకు ఇవ్వడమే మంచిదన్న అభిప్రాయం సంస్థలో వ్యక్తమవుతోంది. అయితే దీనివల్ల అనుకున్నంత ఆదాయం రాదన్న భిన్నాభిప్రాయమూ ఉంది. దీనిపై ప్రభుత్వ ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆర్టీసీ స్థలాలను కాపాడుకోవాలని, భవిష్యత్తులో స్థలాలు దొరకడం కష్టమని గతంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ అధికారులతో అన్నారు. ఇప్పుడు సంస్థ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించే ప్రతిపాదనకు ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. కొత్త ఎండీ సజ్జనార్ దీన్ని తేలుస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఖమ్మం పట్టణంలో ఊరవతల కొత్తగా బస్టాండ్‌ను నిర్మించి ఊరి మధ్య ఉన్న పాత బస్టాండ్‌ను మూసేశారు. ఇప్పుడా స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వాడబోతున్నారు. అదే పంథాను ఇతర పట్టణాల్లో కూడా అవలంబించాలని ఆర్టీసీ భావిస్తోంది. కరీంనగర్లోనూ తరలింపునకు సంబంధించిన ప్రతిపాదన సిద్ధం చేసింది. పట్టణంలో రెండు బస్‌డిపోలు ఒకే చోట ఉన్నాయి. అందులో ఒకదాన్ని ఖాళీ చేసి, ఊరవతల ఉన్న వర్క్‌షాపు వద్దకు తరలించాలని నిర్ణయించారు. ఖాళీ చేసిన బస్‌డిపో స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయబోతున్నారు. నామమాత్రంగా మారిపోయిన మియాపూర్ ఆర్టీసీ బస్‌బాడీ యూనిట్‌ను తరలించేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాదాపు16 ఎకరాల్లో ఉన్న ఈ యూనిట్‌ను ఉప్పల్ వర్క్‌షాపులోకి తరలించాలని భావిస్తోంది. మియాపూర్ మంచి డిమాండ్ ఉన్న ప్రాంతం కావటంతో అక్కడి స్థలాన్ని లీజుకు ఇచ్చి భారీగా ఆదాయాన్ని పొందొచ్చని యోచిస్తోంది. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూమి (ఎకరాల్లో): 1,450 డిపోలు, బస్టాండ్లు తదితర అవసరాలకు ఉపయోగిస్తున్న భూమి (ఎకరాల్లో):1,250 నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న భూమి (ఎకరాల్లో):200 -
కలకలం రేపుతున్న జేసీ ఆడియో టేపులు
సాక్షి, అనంతపురం : తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన కమర్షియల్ కాంప్లెక్స్‌ను జేసీ కబ్జా చేశారని మల్లిఖార్జున చారి అనే బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. జేసీ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని బాధితుడు కోరాడు. బాధితుడు ఫిర్యాదులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెంట్‌గా ఉండకపోతే, ఆ భవనాన్ని కూల్చివేస్తానంటూ బాధితుడికి ఫోన్లో హెచ్చరించాడు. బాధితుడిని జేసీ బెదిరించిన ఫోన్ ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. జేసీ బెదిరింపులపై తాను కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మల్లిఖార్జున చారి ఆరోపించాడు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. జేసీ కబ్జాలో ఉన్న భవనాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడి హెచ్చరిస్తున్నాడు. -
పెట్టుబడికి ఏది సరి?
నివాసమా.. వాణిజ్య సముదాయమా? దేన్లో అధిక రాబడి సాక్షి, హైదరాబాద్: ఫ్లాటా? ప్లాటా? లేక వాణిజ్య సముదాయంలో స్థలమా? దేన్లో పెట్టుబడి భవిష్యత్తులో పెడితే ధర పెరుగుతుంది? నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే మనలో చాలా మంది పెట్టుబడి అనే సరికి నివాస గృహాలపైనే దృష్టి సారిస్తారు. కానీ, వాస్తవానికి వాణిజ్య సముదాయాల్లోనే అధిక రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే విస్తీర్ణం తక్కువ గల స్థలంలో పెట్టుబడి చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారని వారంటున్నారు. ⇔ ప్రాజెక్ట్ ఏదైనా అందుబాటులో ఉన్న ప్రాంతంలో నిర్మాణాల్ని చేపడితే కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తారు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వాణిజ్య సముదాయాల్ని నిర్మిస్తున్నాయి. వాణిజ్యమే బెటర్.. పెట్టుబడి కోణంలో చూసేవారు మంచి రాబడిని అందుకోవడానికి రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణుల సూచన. మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకకపోవటమే ఇందుకు కారణం. గృహ రుణాలతో పోల్చితే వాణిజ్య సముదాయాల రుణాల వడ్డీ కూడా 2–4 శాతం దాకా అధికంగా ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోల్చితే వాణిజ్య సముదాయాల్లో నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది కూడా. అయితే నివాసంతో పోల్చితే వాణిజ్య భవనాల్లో కొనుగోలు ధర మాత్రం యాభై శాతం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు నివాస సముదాయాల ధర చదరపు అడుగుకి రూ. 3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ. 5,250 దాకా పెట్టాల్సి ఉంటుంది. ⇔ అయితే ప్రమోటర్లే స్వయంగా నిర్వహించే వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యమివ్వాలి. ఏటా కొంత మొత్తాన్ని సేవా రుసుముగా తీసుకొని ప్రాపర్టీ మేనేజ్మెంట్ సేవల్ని అందించే వాటిని ఎంచుకోవటం మేలు. వీటితో అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్టుగా అద్దెదారుల్ని ఎంపిక చేయడం, వారు కోరుకున్న సైజుల్లో స్థలాన్ని సమకూర్చడం, దస్తావేజుల్ని సిద్ధం చేయడం, క్రమం తప్పకుండా అద్దెలను వసూలు చేయడం, ఆయా సొమ్మును పెట్టుబడిదారుడికి ఖాతాలో జమ చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని ప్రాపర్టీ మేనేజర్లే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. దీని వల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ అయితే నివాసమే ఉత్తమం.. మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారెవరైనా సరే నివాస సముదాయాన్ని కొనుగోలు చేయడమే ఉత్తమం. ఆరంభంలో ఇరవై శాతం సొమ్ము కడితే చాలు 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహæరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. ఇరవై, పాతికేళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని కట్టే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. చేతిలో సొమ్ము ఉన్నప్పుడల్లా.. విడతలవారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. అయితే ఆయా ప్రాజెక్ట్‌కు అనుమతులున్నాయా లేవా తెలుసుకోవాలి. అభివృద్ధి చెందే ప్రాంతంలో, టైటిల్ క్లియర్‌గా ఉండి, నిర్వహణ సక్రమంగా ఉన్న వాటి విలువనే పెరుగుతాయని మరవొద్దు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేçహాలు మాకు రాయండి.realty@sakshi.com -
బస్టాండ్@ సీబీడీ
ప్రయాణ ప్రాంగణం.. ఇక వ్యాపార కేంద్రం సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా అభివృద్ధి రూ. 620 కోట్లతో బహుళ అంతస్తుల భవనం కింద బస్‌స్టేషన్, పైన వాణిజ్య సముదాయం హన్మకొండ : ఇప్పటివరకు అంతంత మాత్రంగానే అభివృద్ధి చెందిన జిల్లా బస్‌స్టేషన్ రూపురేఖలు మారబోతున్నాయి. స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా హన్మకొండ నడిబొడ్డున విస్తరించిన ఈ బస్టాండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్ నిర్మిం చేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ప్రభత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో రూ. 620 కోట్ల వ్యయంతో బహుళ అంతస్తులుగా నిర్మించనున్నారు. సమస్యలకు సెలవు.. నగరం నడిబొడ్డున విస్తరించి ఉన్న బస్టాండ్ ప్రాంతంలో చిన్నాచితక వ్యాపారాలే జరుగుతున్నాయి. అంతేకాక నిత్యం 1553 బస్సులు ఈ బస్‌స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజు 1.30 లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు. అరుుతే బస్సులు, ప్రయూణికుల సంఖ్యకు అనుగుణంగా బస్ స్టేషన్ లేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నారుు. 19 ఫ్లాట్‌ఫారాలు మాత్రమే ఉన్నారుు. ఇక స్మార్ట్‌సిటీ పథకం ద్వారా ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. హన్మకొండ బస్‌స్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా ప్రణాళిక సిద్ధమైంది. అవసరమైన వనరులు సమకూరితే రాష్ట్రంలోని మిగిలిన బస్స్టేషన్లకు ఆదర్శంగా హన్మకొండ బస్టాండ్ నిలిచే అవకాశం ఉంది. సీబీడీగా గుర్తింపు... స్మార్ట్‌సిటీ నిబంధన ప్రకారం నగరంలో ఎంపిక చేసిన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ఆధునాతనంగా అభివృద్ధి (రిట్రోఫిట్టింగ్) చేయాలి. ఎంపిక చేసిన ప్రాంతంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. దీని ప్రకారం రూ.2,681 కోట్ల వ్యయంతో హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి పోతనరోడ్డు వరకు 1523 ఎకరాలు ఎంపిక చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్లు, నాలాలు, విద్యుత్, నీటి సరఫరా అన్నింటీని మెరుగుపరుస్తారు. ముఖ్యంగా రెట్రోఫిట్టింగ్ ప్రాంతంలో పర్యాటకుల కోసం భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాన్ని, వ్యాపార కేంద్రంగా హన్మకొండ బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళిక తయూరు చేస్తున్నారు. ఇలా ఎంపిక చేసిన ప్రాంతాన్ని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (సీబీడీ)గా పేర్కొంటారు. బహుళ అంతస్తుల భవనం.. స్మార్ట్‌సిటీ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లేదా వాణిజ్య కేంద్రంగా హన్మకొండ బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలను రూ. 620 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. హన్మకొండ బస్‌స్టేషన్, బస్‌డిపోలు విస్తరించి ఉన్న 13.2 ఎకరాల స్థలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇక్కడ మొత్తం నాలుగు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తారు. ఇందులో సెల్లార్, బేస్మెంట్ లెవల్లో 60 శాతం ప్రదేశాన్ని పార్కింగ్‌కు కేటాయిస్తారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఫ్లాట్‌ఫారాలు, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. మొదటి అంతస్తులో ప్రయాణికుల విశ్రాంతి గదులు, షాపింగ్ సెంటర్‌ను అందుబాటులో ఉంచుతారు. రెండు, మూడు, నాలుగు అంతస్తులను వాణిజ్య కేంద్రాలుగా మారుస్తారు. ఇందులో కార్యాలయాలు, సినిమా థియేటర్లు, ఫుడ్‌కోర్టు, ఎంటర్టైన్మెంట్ తదితర అవసరాలకు అద్దె ప్రతిపాదికన కేటాయిస్తారు. భవనం పైన పూర్తిగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఈ భవనంపై పడే ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకునేలా ఇంకుడు గుంతలు నిర్మిస్తారు. -
రాబడికి దగ్గరి దారేది!
♦ గృహశోభ ఉట్టిపడాలంటే రోజూ గార్డెనింగ్‌కు సమయాన్ని కేటాయించాలి. ♦ మొక్కలు ఎంపిక చేసుకొనే ముందు అవి పెరిగే ఎత్తు, పూల రంగు తదితర అంశాలను గుర్తించాలి. వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ♦ పూల మొక్కలు పొదల మాదిరిగా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు గార్డెన్లో పెంచుకోవచ్చు. నివసించడం కోసం ఇల్లు కొనేవారు కొందరైతే.. పెట్టుబడి కోణంలో ఆలోచించి అడుగు వేసేవారు మరికొందరు. అయితే పెట్టుబడి అనేసరికి.. మనలో చాలా మంది నివాస గృహాలపై దృష్టి సారిస్తారు. వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడుల గురించి పెద్దగా తెలియకపోవడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఫ్లాటా.. ప్లాటా లేక వాణిజ్య సముదాయంలో స్థలమా? దేంట్లో పెట్టుబడులు పెడితే మంచి ఆదాయమొస్తుందనే అంశంపై ఈ వారం సాక్షి రియల్టీ ప్రత్యేక కథనం. - సాక్షి, హైదరాబాద్ నివాసమైనా.. వాణిజ్యమైనా.. అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతంలో భవనాల్ని చేపడితే.. కొనుగోలుదారులు ముందువరసలో ఉంటారనే విషయం నిర్మాణ సంస్థలకు తెలుసు. అందుకే మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్, మదీనాగూడ, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ, కేపీహెచ్‌బీ కాలనీ వంటి ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల్ని ఎక్కువగా చేపడుతున్నారు. ముఖ్యంగా విస్తీర్ణం తక్కువ గల స్థలంలో మదుపు చేయడానికి కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వాణిజ్యమే బెటర్.. పెట్టుబడి కోణంలో చూసేవారు.. మంచి రాబడిని అందుకోవడానికి.. రెండోసారి ఇల్లు కొనడం బదులు వాణిజ్య లేదా ఆఫీసు సముదాయాల్లో పెట్టుబడి పెట్టడమే మేలని నిపుణుల సూచన. ఎందుకంటే మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు లభించే పన్ను రాయితీలు రెండోసారి దొరకవని గుర్తుంచుకోవాలి. నివాస సముదాయాలతో పోల్చితే వాణిజ్య భవనాల్లో పెట్టుబడి పెట్టేవారికి, నెలసరి అద్దె రెండు రెట్లు ఎక్కువగా గిట్టుబాటవుతుంది. అయితే ధర మాత్రం.. కొన్ని ప్రాంతాల్లో యాభై శాతం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, నివాస సముదాయాల ధర చ.అ.కు రూ.3,500 ఉందనుకోండి.. వాణిజ్య సముదాయాల్లో రూ.5,250 దాకా పెట్టాల్సి వస్తుంది. ప్రాంతాన్ని బట్టి ఈ ధరలో స్వల్ప మార్పులుంటాయి కూడా. వాణిజ్య నిర్మాణాల్లో పెట్టుబడి పెట్టాలంటే దాదాపు యాభై శాతం సొమ్మును చేతిలో పెట్టుకుంటేనే ఉత్తమం. గృహ రుణాలతో పోల్చితే వాణిజ్య సముదాయాలను కొనడానికిచ్చే రుణాలపై రెండు నుంచి నాలుగు శాతం దాకా వడ్డీ అధికంగా ఉంటుంది. అలాగని కనిపించిన ప్రతి వాణిజ్య సముదాయంలో పెట్టుబడి పెట్టకూడదు సుమీ. మొదటిసారైతే ఇల్లే ఉత్తమం.. మొదటిసారి ఇల్లు కొనాలని భావించేవారు ఎవరైనా.. ముందుగా నివాస సముదాయాన్ని కొనుగోలు చేయాలి. ఆరంభంలో ఇరవై శాతం సొమ్ము కడితే చాలు.. 80 శాతం వరకూ బ్యాంకు నుంచి గృహరుణం లభిస్తుంది. అంటే తక్కువ సొమ్ముతో సొంతింటి కల తీరుతుంది. అప్పు తీసుకున్న కొన్నాళ్లకే తీర్చక్కర్లేదు. ఇరవై, పాతికేళ్ల వరకూ నెలసరి వాయిదాల్ని కట్టే వెసులుబాటు ఉంటుంది. గృహరుణం తీసుకున్నాక.. చేతిలో సొమ్ము ఉన్నప్పుడల్లా.. విడతల వారీగా రుణాల్ని తిరిగి కట్టొచ్చు. వడ్డీ, అసలుపై ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని తెలిసిందే. ఇరవై శాతం సొమ్ముతో ఇల్లు కొనుక్కుంటే చాలు.. ఆరేళ్లలో ఆయా ఇంటి విలువ రెట్టింపవుతుంది. ఏడు లేదా ఎనిమిదేళ్లలో అప్పు మొత్తం తీరిపోయే అవకాశముంది. నివాస సముదాయాల రంగంలో ఏటా 12-15 శాతం ఇంటి విలువ పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మంచి ప్రాంతంలో.. టైటిల్ క్లియర్‌గా ఉండి, సంబంధిత నివాస సంఘం ప్రాజెక్ట్‌ను సమర్థంగా నిర్వహిస్తేనే విలువ పెరుగుతుంది. అంతే తప్ప, సంఘ సభ్యులు గొడవపడి, నిర్వహణ గురించి పట్టించుకోకపోతే అంతే సంగతులు. కాబట్టి, ప్రాజెక్టును సంఘానికి అప్పగించాక... నిర్వహణ కూడా మెరుగ్గా జరపాలనే విషయం మరవొద్దు. కొత్త పోకడ.. ప్రమోటర్లు స్వయంగా నిర్వహించే వాణిజ్య సముదాయాలకు ప్రాధాన్యమివ్వాలి. ఏటా 8-10 శాతం సేవా రుసుము తీసుకుని.. కొనుగోలుదారులకు ‘ప్రాపర్టీ మేనేజ్మెంట్’ సేవల్ని అందించే సరికొత్త పోకడకు పలు నిర్మాణ సంస్థలు శ్రీకారం చుట్టాయి. అందుబాటులో ఉన్న స్థలానికి తగ్గట్టుగా అద్దెదారుల్ని ఎంపిక చేయడం, వారు కోరుకున్న సైజుల్లో స్థలాన్ని సమకూర్చడం, దస్తావేజుల్ని సిద్ధం చేయడం, క్రమం తప్పకుండా అద్దెలను వసూలు చేయడం, ఆయా సొమ్మును పెట్టుబడిదారుడికి ఖాతాలో జమ చేయడం.. ఇలా ప్రతి అంశాన్ని ప్రాపర్టీ మేనేజర్లే దగ్గరుండి పర్యవేక్షిస్తారు. దీని వల్ల పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే.. నిర్మా ణం పూర్తయిన తొలినాళ్లలో అద్దెదారులు ఎక్కువగా రాకపోవచ్చు. ఒక ఐదారు నెలలదాకా ఈ పరిస్థితి ఉండొచ్చు. అయితే అన్నివేళలా ఇలా జరుగుతుందని కాదు. వాణిజ్య భవనమున్న స్థలాన్ని బట్టి.. ముందే అద్దెదారుల్ని స్థలాన్ని తీసుకోవచ్చు. ఓ కన్నేయాల్సిందే.. నగరంలో మొదటి రకం వాణిజ్య సముదాయాల సంఖ్య తక్కువ ఉన్నాయి. వెయ్యి చదరపు అడుగుల నుంచి ఇందులో స్థలాలను కొనుగోలు చేయవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టాక వచ్చే అద్దెలపై 30 శాతం రాయితీ లభిస్తుంది. ప్రాపర్టీ మేనేజర్లు గల వాణిజ్య భవనాల్లో కొనడం ఉత్తమం. అప్పుడే ఆదాయానికి ఢోకా ఉండదు. భవిష్యత్తులో ధర పెరుగుదలా ఎక్కువే ఉంటుంది. నిర్మాణం పూర్తయ్యాక ఆరు నెలల తర్వాతనైనా వాణిజ్య ఆఫీసు సముదాయాలు అద్దెదారులతో నిండుతాయి. సుమారు ఆరేడేళ్లలోపు వంద శాతం పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశముంది. -
ఆదాయమా...ఎక్కడున్నావ్?
ఆర్థిక ఆసరాకు హెచ్ఎండీఏ యత్నాలు ఖాళీగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు లీజ్ బకాయిలను పట్టించుకోని వైనం సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న హెచ్ఎండీఏ ఇప్పుడు ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. కొత్త లేఅవుట్లు, భూ వినియోగ మార్పిడి, ఇతర అనుమతుల కోసం ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడంతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. సిబ్బందికి నెలవారీ జీతభత్యాలు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, పార్క్‌ల నిర్వహణ వంటివి తలకుమించిన భారంగా మారాయి. ఈ నేపథ్యంలో తన ఆధీనంలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఖాళీగా ఉన్న షాపులు, కార్యాలయాలను లీజ్‌కు ఇచ్చి ఎంతో కొంత ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఆరాటపడుతోంది. అయితే... రాష్ట్రం రెండుగా విడిపోవడంతో కొందరు తమ వ్యాపారాలను ఆంధ్రా ప్రాంతానికి తరలించారు. దీంతో అమీర్‌పేటలోని మైత్రీ వనం, మైత్రీ విహార్, స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్స్‌లలో అనేక షాపులు ఖాళీ అయ్యాయి. గతంలో నిర్ణయించిన లీజ్ మొత్తం అధికంగా ఉందంటూ మరికొందరు ఖాళీ చేసి వెళ్లారు. దీంతో ఈ కాంప్లెక్స్‌లు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిని భ ర్తీ చేసేందుకు అధికారులు అనేకసార్లు టెండర్లు పిలిచారు. అయినా లీజ్‌కు తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. గతంలో నిర్ణయించిన లీజ్ మొత్తాన్ని కొంత తగ్గించి టెండర్ పిలిస్తే ప్రయోజనం ఉండేది. దీనికి అధికారులు సాహసించట్లేదు. లీజ్ మొత్తాన్ని తగ్గిస్తే... ఇప్పటికే ఆ కాంప్లెక్స్‌లలో ఉన్న వారు తమకు కూడా తగ్గించాలని గొడవ చేసే అవకాశం ఉందని...దీని వల్ల ఆదాయం మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు సంశయిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతో ఏళ్ల తరబడి కొన్ని షాపులు ఖాళీగా ఉంటున్నాయి. ఫలితంగా లీజ్ రూపంలో వచ్చే లక్షలాది రూపాయల ఆదాయం అందకుండా పోతోంది. విద్య, వాణిజ్య వ్యాపార సంస్థలతో కిటకిటలాడే అమీర్‌పేటలో హెచ్ఎండీఏకు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్‌లు ఖాళీగా ఉండటం విస్మయం కలిగిస్తోంది. కొందరు అధికారులు లీజ్దారులకు వక్రమార్గాన్ని సూచిస్తూ ప్రయోజనం పొందుతుండటంతో సంస్థ ఆదాయానికి గండి పడుతోంది. ఈ కాంప్లెక్స్‌లలో షాపును లీజ్‌కు తీసుకోవాలన్నా.... ఉన్న వారు ఖాళీ చేయాలన్నా అధికారులు సవా లక్ష ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న అపవాదును సంస్థ మూటగట్టుకొంది. కొందరు అక్రమార్కులు లీజ్‌దారుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకొంటూ సంస్థకు రావాల్సిన లీజ్ మొత్తాన్ని బకాయిగా చూపుతున్నారు. వారి నుంచి స్వీకరించిన డిపాజిట్ మొత్తాన్ని మినహాయించుకొని వెంటనే ఖాళీ చేయించాల్సి ఉండగా... చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో లక్షలాది రూపాయలు బకాయిలు పేరుపోయాయి. అక్రమార్కులను సంస్కరించకుండా ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా... ప్రయోజనం ఏమిటన్నది ఉన్నతాధికారులకే తెలియాలి. లీజ్‌కు షాపులు అమీర్‌పేటలోని మైత్రీ వనం, స్వర్ణ జయంతి, మైత్రి విహార్లలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లలో షాపులు, కార్యాలయాలను లీజ్‌కు కేటాయించనున్నట్లు హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో తెలిపింది. తార్నాకలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లోనూ అనేక షాపులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం ఠీఠీఠీ.జిఝఛ్చీ.జౌఠి.జీలో సంప్రదించాలని అధికారులు సూచించారు. తార్నక, అమీర్‌పేటలోని కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోదలచిన వారు హెచ్ఎండీఏ వెబ్సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. సీల్డ్ టెండర్‌ను ఈనెల 6 నుంచి 23లోగా తార్నాకలోని ఆర్ అండ్ డీఓ సెక్షన్లో అందజేయాలని ఆ ప్రకటనలో కోరారు. నేరుగా దరఖాస్తు చేసుకోదలచిన వారు తార్నాకలోని హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో ఆర్ అండ్ డీఓ సెక్షన్ నుంచి దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి వివరాల కోసం 9989336917 లేదా 9849902556 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హెచ్ఎండీఏ కార్యాలయంలో తెరిచి అర్హులకుఆ కాంప్లెక్స్‌ల లో షాపులు, కార్యాలయాలు కేటాయిస్తామని పేర్కొన్నారు. -
మింగేశారు
ఒక్కటీ..వదల్లేదు.! జీహెచ్ఎంసీ పరిధిలో 169 చెరువుల్లో సర్వే మాయమైన బతుకమ్మ కుంట రికార్డులు కబ్జాకు గురైన దుర్గం చెరువు ఆనవాళ్లే లేని పెద్దబందం, ఖాజాకుంట సర్వేలో విస్తుపోయే వాస్తవాలు నగరంలో చెరువులను కబ్జాదారులు మింగేస్తున్నారు. ప్రజల ఆట, పాటల్లో భాగమైన బతుకమ్మ చెరువు రికార్డుల నుంచి మాయమైంది.. కుతుబ్‌షాహిల పాలనలో గోల్కొండకు మంచినీళ్లందించిన దుర్గం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది.. పెద్ద బందం, ఖాజా కుంట, నాగిరెడ్డి కుంట ఇలా పలు చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. చాలా చెరువుల్లో భారీ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు పుట్టుకొచ్చాయి. మాయగాళ్లు చెరువులను మింగేస్తూ కోట్లు గడిస్తుంటే.. సిటిజన్లు మాత్రం గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 169 చెరువులపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 169 చెరువులు, కుంటలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటి పరిస్థితిపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఇప్పటి వరకు 133 ప్రాంతాల్లో సర్వే పూర్తయింది. పలుచోట్ల ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఆక్రమణలకు పాల్పడితే కొన్ని చోట్ల చెరువు పరిధుల్లోనూ రైతుబజార్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలు నిర్మించారు. ఈ నేపథ్యంలో చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. వాటిలో పెద్దబందం(సూరారం), తూంకుంట (నిజాంపేట), నాగిరెడ్డికుంట (మంచిరేవుల), మైసమ్మకుంట (లాంకోహిల్స్), ఎర్రకుంట (ఐఎస్ సదన్), ఎర్రకుంట (లాలాపేట), ఖాజాకుంట (కూకట్పల్లి)లకు అలుగు కూడా లేకుండా పోయాయి. శ్యామలకుంట (అమీర్‌పేట), మాసాహెబ్ట్యాంక్ (విజయనగర్‌కాలనీ), నాగమయ్యకుంట (నల్లకుంట), బొగ్గులకుంట (ఆబిడ్స్)లతో పాటు మరో ఐదు చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. అంబర్‌పేటలోని బతుకమ్మకుంట రికార్డులు గల్లంతయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 32 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మకుంట ఉండగా, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం మాత్రం అక్కడ చెరువు ఉన్న దాఖలాలే లేవంటూ రెండేళ్ల క్రితం తేల్చింది. అయితే తాజాగా నీటిపారుదల శాఖ చేపట్టిన సర్వేలో బతుకమ్మకుంట అలుగు, తూము, వరద కాలువను గుర్తించి 17 ఎకరాల్లో హద్దులు నిర్ధారించారు. బతుకమ్మకుంటపై న్యాయస్థానాలతో పాటు, లోకాయుక్తలోనూ పలు వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ నోటిఫై చేసిన 17 ఎకరాల్లో ప్రస్తుతం మూడు ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఖాళీగా ఉండడం గమనార్హం. ఖాజాగూడ, బందం చెరువు అలుగు మొత్తం ఓ సినీ నిర్మాత ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇది గుర్తించిన అధికార యంత్రాగం సదరు నిర్మాతకు త్వరలో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 169 చెరువులను గుర్తించిన యంత్రాంగం వాటి పూర్తి స్థాయి నీటిమట్టాలను (ఎఫ్టీఎల్) గుర్తించే పనిని దాదాపు పూర్తి చేసి జీపీఎస్ సహాయంతో శాశ్వత మార్కింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం శాస్త్రీయపద్ధతిలో చేస్తున్న ఎఫ్టీఎల్ మార్కింగ్‌ను భవిష్యత్తులో ఎవరికి వారు మార్పు చేసేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కబ్జా కోరల్లో... దుర్గం చెరువులో 30 ఎకరాల్లో భారీ నిర్మాణా లు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినట్లు సర్వేలో తేలిం ది. కుతుబ్‌షాహీల కాలంలో గోల్కొండ కోటకు మంచినీటిని అందించేందుకు 160.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన దుర్గం చెరువు తాజా సర్వేల్లో 30 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అంచనాకు వచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో సుమారుగా రూ. 100 కోట్లకు పైగా విలువైన క్రయవిక్రయాలు జరిగినట్లు భావిస్తున్నారు. జీపీఎస్ సాయంతో ఇప్పటికే ఎఫ్టీఎల్ హద్దులను నిర్ధారించిన అధికారులు చెరు వు తూమును ఇటీవలే మూసేశారు. దీంతో పక్షం రోజులుగా దుర్గం చెరువులోకి వస్తున్న వరద నీటితో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం వచ్చేంత వరకు తూమును మూసెయ్యాలని నీటిపారుదల శాఖ నిర్ణయించడంతో చెరువు సమీపంలోని భవనాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతోంది. -
నమ్మకం, నాణ్యతలే ముఖ్యం!
నాలుగేళ్లలో 4 మిలియన్ చ.అ.లను అభివృద్ధి చేసిన ఎస్ఎంఆర్ సంస్థ హైదరాబాద్: ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరాస్తి రంగంలో నిలదొక్కుకోవడమంటే మాటలు కాదు. కానీ, ఎస్ఎంఆర్ సంస్థ నాలుగేళ్లలో 4 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో (హైదరాబాద్, బెంగళూరుల్లో కలిపి) పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది. గడువు లోగా నిర్మాణం పూర్తి చేయటం, నమ్మకం, నాణ్యతలే సంస్థ రహస్యమని సంస్థ సీఎండీ రాం రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. ఇంకా ఏమన్నారంటే.. 1. బండ్లగూడలో 13 ఎకరాల్లో ఎస్ఎంఆర్ వినయ్ హార్మోనీ కౌంటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మూడు ఫేజుల్లో పూర్తికానున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఫేజ్-1లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 30 నెలల్లో రెండు బ్లాకుల్లో 450 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందిస్తాం. ఫేజ్-2లో 700 ఫ్లాట్ల పనులను మూడు నెలల్లో ప్రారంభిస్తాం. చివరగా ఫేజ్-3లో మరో 150 ఫ్లాట్లను కూడా నిర్మిస్తాం. ఇక ధర విషయానికొస్తే చ.అ.కి రూ.3,200 లుగా నిర్ణయించాం. ఇదే ప్రాంతంలో 30 ఎకరాల్లో 200 లగ్జరీ విల్లాలను కూడా నిర్మించనున్నాం. ఒక్కో విల్లా ఖరీదు రూ.2-3 కోట్లుగా ఉంటుంది. 2. మియాపూర్‌లో 1.7 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ‘ఎస్ఎంఆర్ వినయ్ మెట్రో’ షాపింగ్ విత్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో 4 స్క్రీన్ల మల్టిప్లెక్స్ రానుంది. ఇదే ప్రాంతంలో మరో 6 లక్షల చ.అ. విస్తీర్ణంలో మరో భారీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. ఇందులో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తాం. ఇందులో 6 స్క్రీన్ల మల్టిప్లెక్స్ వస్తుంది. 3. అన్ని ప్రాజెక్టుల్లోనూ అధిక శాతం స్థలాన్ని పచ్చదనానికే కేటాయిస్తున్నాం. ఇండోర్, ఔట్ డోర్ ఆట స్థలాలు, క్లబ్ హౌస్, వాకింగ్, స్కేటింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్‌పూల్ వంటి అనేక రకాల ఆధునిక సౌకర్యాలనూ ఏర్పాటు చేస్తున్నాం.