కలకలం రేపుతున్న జేసీ ఆడియో టేపులు | Tadipatri MLA JC Prabhakar Reddy Again Lands on Controversy | Sakshi
Sakshi News home page

కలకలం రేపుతున్న జేసీ ఆడియో టేపులు

Published Tue, Sep 11 2018 3:37 PM | Last Updated on Tue, Sep 11 2018 3:42 PM

Tadipatri MLA JC Prabhakar Reddy Again Lands on Controversy - Sakshi

సాక్షి, అనంతపురం : తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన కమర్షియల్‌ కాంప్లెక్స్‌ను జేసీ కబ్జా చేశారని మల్లిఖార్జున చారి అనే బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు. జేసీ ట్రావెల్స్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని బాధితుడు కోరాడు. బాధితుడు ఫిర్యాదులపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెంట్‌గా ఉండకపోతే, ఆ భవనాన్ని కూల్చివేస్తానంటూ బాధితుడికి ఫోన్‌లో హెచ్చరించాడు. 

బాధితుడిని జేసీ బెదిరించిన ఫోన్‌ ఆడియో టేపులు కలకలం రేపుతున్నాయి. జేసీ బెదిరింపులపై తాను కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మల్లిఖార్జున చారి ఆరోపించాడు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. జేసీ కబ్జాలో ఉన్న భవనాన్ని తనకు అప్పగించాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడి హెచ్చరిస్తున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement