Smart Survey
-
ఆగిన 9,622 పింఛన్లు
ఈ నెల నుంచి నిలిపివేత ఎసరు పెట్టిన స్మార్ట్ సర్వే సాక్షి ప్రతినిధి, ఏలూరు ః రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే పింఛన్లకు ఎసరు పెట్టింది. ఈ సర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 9622 పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. పెన్షన్ కార్డులో ఉన్న వివరాలు, తమ వద్ద ఉన్న ఆధార్ వివరాలతో సరిపోలలేదంటూ ఈ నెల నుంచి ఈ పింఛన్లను నిలిపివేస్తూ జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. కారణం చెప్పకుండా అకస్మాత్తుగా పింఛన్ నిలిచిపోవడంతో ఫించన్‌దారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పింఛన్లలో కోత పెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత జన్మభూమి కమిటీల పేరుతో మరికొన్ని పింఛన్లకు ఎసరు పెట్టారు. తాజాగా స్మార్ట్ పల్స్ సర్వేను అడ్డం పెట్టుకుని పింఛన్ల ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 9662 పింఛన్లను నిలిపివేయగా, కృష్ణాజిల్లాలో అత్యధికంగా 1344 పింఛన్లు, విజయనగరంలో అత్యల్పంగా 389 పింఛన్లు నిలిచిపోయాయి. మహిళలకు అగ్రపీట వేస్తున్నామని చెప్పే ప్రభుత్వం ఎక్కువ మహిళల పింఛన్లలోనే కోత పెట్టింది. రద్దు అయిన వాటిలో 6702 మంది మహిళలు ఉండగా 2920 మంది పురుషులు ఉన్నారు. 4,803 మంది వితంతువులకు పింఛన్ నిలిపివేశారు. నిలిచిపోయిన వాటిలో అభయహస్తం ఫించన్లు 237, వికలాంగులు 610, వృద్దాప్య పింఛన్లు 3852, కల్లుగీత పింఛన్లు 14, చేనేత వృత్తిదారులకు ఇచ్చే పింఛన్లు 99, వితంతువులకు ఇచ్చే పింఛన్లు 4803 రద్దు అయిన వాటిలో ఉన్నాయి. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ పింఛన్లు నిలిపివేసినట్లు డీఆర్డీఎ జిల్లా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు మండలాల వారీగా జాబితాలను ఎంపీడీవోలకు పంపించారు. అకస్మాత్తుగా స్మార్ట్సర్వే పేరుతో పింఛన్ల నిలిపివేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. జిల్లాల వారీగా రద్దు అయిన పింఛన్ల వివరాలు జిల్లా రద్దు అయిన పింఛన్లు అనంతపురం 1241 చిత్తూరు 971 తూర్పు గోదావరి 1072 గుంటూరు 612 కడప 825 కృష్ణా 1344 కర్నూలు 648 నెల్లూరు 473 ప్రకాశం 442 శ్రీకాకుళం 630 విశాఖపట్నం 393 విజయనగరం 389 పశ్చిమగోదావరి 570 -
10 రోజుల్లో ప్రజాసాధికార సర్వే పూర్తి
–వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ప్రజాసాధికార సర్వేను మరో 10రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. జిల్లాలో 40 లక్షలకు పైగా జనాభా ఉంటే ఇప్పటి వరకు 30 లక్షల మంది వివరాలు నమోదు చేసినట్లు వివరించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాసాధికార సర్వే తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కర్నూలు నుంచి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2లక్షలు మంది కురువలు ఉన్నారని వీరు మదాసి కురువలుగా, బుడగ జంగాలు 25000 మంది ఉన్నారని వీరు ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సర్వేకు సహకరించడం లేదని తెలిపారు. 88 గ్రామాలకు చెందిన 1.20 లక్షల మంది హాప్లైన్లో ఉన్నారని అందువల్ల సర్వేలో కొంతమేర వెనుకబడి ఉన్నట్లు వివరించారు. కాగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ నెల చివరిలోగా సర్వేను 100శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పరిధిలోకి రాని వారు గ్రామ పంచాయతీకి వచ్చి వివరాలు ఇచ్చే విధంగా ప్రచారం చేయాలన్నారు, కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ హరికిరణ్, రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నరసింహులు, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు -
స్మార్ట్‌గా సాధన
భీమవరం టౌన్ : ప్రజాసాధికార (స్మార్ట్ పల్స్) సర్వే గడువు నాటికి లక్ష్యాన్ని చేరుకోకపోయినా మన జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. ఆగస్ట్ నెలాఖరుకు నూరు శాతం సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ గడువు నాటికి జిల్లాలో 74.59 శాతం సర్వే పూర్తయింది. అయితే రాష్ట్రంలో మన జిల్లా ప్రథమస్థానం సాధించడం గమనార్హం. జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసాధికార సర్వే ప్రారంభమైంది. ఆరంభంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వే నత్తనడకన సాగింది. సర్వే ప్రారంభమైన నెల రోజులకు సమస్యలు పరిష్కారం కావడంతో సర్వే ఊపందుకుంది. ఎన్యుమరేటర్లు రేయింబవళ్లు కష్టించి సర్వే చేశారు. 29.83 లక్షల మంది వివరాల సేకరణ జిల్లాలో ఆగస్ట్ నెలాఖరుకు 29,83,878 మందికి సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించారు. మండలాల్లో 2686 మంది ఎన్యుమరేటర్లు 8,72,527 కుటుంబాలను సర్వే చేసి 24,54,387 మంది కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ వివరాలను సేకరించారు. మునిసిపాలిటిల్లో 658 మంది ఎన్యుమరేటర్లు1,80,109 కుటుంబాలను సర్వే చేసి 5,29,491 మంది కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ వివరాలను సేకరించారు. మండలాల వారీగా సర్వే వివరాలు మండలం సర్వే పూర్తయిన కుటుంబాలు సభ్యులు 1. ఆచంట 15,842 44,292 2. ఆకివీడు 21,138 60,367 3. అత్తిలి 20,476 56,451 4. భీమడోలు 19,190 53,294 5. భీమవరం 23,011 66,101 6. బుట్టాయగూడెం 7,201 20,908 7. చాగల్లు 18,967 53,744 8. చింతలపూడి 25,095 72,547 9. దెందులూరు 19,827 55,378 10. దేవరపల్లి 22,157 63,184 11. ద్వారకాతిరుమల 20,738 58,162 12. ఏలూరు 31,340 92,699 13. గణపవరం 19,168 52,111 14. గోపాలపురం 9,637 26,858 15. ఇరగవరం 20,734 56,201 16. జంగారెడ్డిగూడెం 17,920 51,902 17. జీలుగుమిల్లి 6,224 17,036 18. కాళ్ల 20,167 56,067 19. కామవరపుకోట 16,297 48,880 20. కొవ్వూరు 21,113 59,066 21. కొయ్యలగూడెం 12,039 32,154 22. కుక్కునూరు 4 13 23. లింగపాలెం 5,908 45,879 24. మొగల్తూరు 17,106 51,867 25. నల్లజర్ల 25,113 67,060 26. నర్సాపురం 19,491 56,063 27. నిడదవోలు 21,339 58,899 28. నిడమర్రు 14,493 40,344 29. పాలకోడేరు 19,014 53,173 30. పాలకొల్లు 19,579 54,523 31. పెదపాడు 19,480 55,298 32. పెదవేగి 23,293 68,095 33. పెంటపాడు 21,804 58,490 34. పెనుగొండ 19,341 55,051 35. పెనుమంట్ర 18,846 51,655 36. పెరవలి 22,029 62,229 37. పోడూరు 19,656 56,356 38. పోలవరం 7,662 20,848 39. తాడేపల్లిగూడెం 26,680 74,535 40. తాళ్లపూడి 15,735 44,234 41. తణుకు 18,600 51,247 42. టి.నర్సాపురం 15,927 45,027 43. ఉండి 19,561 52,585 44. ఉండ్రాజవరం 22,335 59,600 45. ఉంగుటూరు 24,531 68,463 46. వీరవాసరం 17,091 49,676 47. వేలేరుపాడు 2 4 48. యలమంచిలి 19,626 55,771 మొత్తం 8,72,527 24,54,387 పురపాలక సంఘాల పరిధిలో.. పట్టణం సర్వే పూర్తయిన కుటుంబాలు సభ్యులు 1. భీమవరం 35,690 1,04,747 2. ఏలూరు 41,345 1,24,408 3. జంగారెడ్డిగూడెం 8,473 25,315 4. కొవ్వూరు 11,543 33,422 5. నర్సాపురం 14,218 41,836 6. నిడదవోలు 10,604 30,468 7. పాలకొల్లు 14,536 43,619 8. తాడేపల్లిగూడెం 20,471 57,421 9. తణుకు 23,229 68,255 మొత్తం 1,80,109 5,29,491 -
సర్వం సర్వేమయం
స్మార్ట్ సర్వేలో ఉద్యోగులు స్తంభించిన పాలన బోసిపోయిన కార్పొరేషన్ కార్యాలయం అయోమయంలో నగర వాసులు తిరుపతి శివజ్యోతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఇంటిపై బ్యాంక్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రూ.5 లక్షలు మంజూరైంది. అయితే టౌన్ బ్యాంక్ అధికారులు కార్పొరేషన్ నుంచి ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పారు. అతను 20 రోజుల క్రితం ఆ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సంబంధిత అధికారులు, ఉద్యోగులు సర్వేలో ఉండడంతో ఇబ్బంది పడుతున్నాడు. బ్యాంక్ అధికారులు ఫోన్ చేసి 28లోపు సర్టిఫికెట్ ఇవ్వకుంటే లోన్ రద్దవుతుందని చెప్పడంతో ఏం చేయాలో తెలియక కుమిలిపోతున్నాడు. తిరుపతి తుడా: కార్పొరేషన్ కార్యాలయం వెలవెలాబోతోంది. రెవెన్యూ, హెల్త్, టౌన్‌ప్లానింగ్, ఇజినీరింగ్, పరిపాలన, అకౌంట్స్ శాఖల్లోని ఉద్యోగులందరూ ప్రజాసాధికార సర్వేలో ఉండడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వివిధ విభాగాలకు సబంధించిన ఫైళ్లు టేబుళ్లపై ఎవరెస్ట్ శిఖరంలా పేరుకుపోతున్నాయి. అత్యవసర ఫైళ్ల పరిస్థితీ అంతే. జనన, మరణ ధ్రువీకరణ, పన్నుల చెల్లింపులు, భవన నిర్మాణ అనుమతులు ఇలా ఒక్కటేంటి అన్ని ఫైళ్లూ ముందుకు కదలడంలేదు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజానీకానికి కనీస సమాచారం ఇచ్చేనాథుడూ లేకుండా పోయారు. అందరూ సర్వేకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే మున్సిపల్ కార్పొరేషన్లో ఈ నెల 8 నుంచి ప్రారంభమైంది. మొదటి 14 రోజులు సర్వర్ డౌన్, నెట్వర్క్ సమస్యలతో సర్వే సక్రమంగా ముందుకు సాగలేదు. అయితే మొదటి విడత సర్వేను ఈనెల 31 లోపు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో స్థానిక పాలకుల్లో కదలిక వచ్చింది. ఎన్యూమరేటర్లతోపాటు కార్పొరేషన్ అధికారులను సూపర్వైజర్లుగా.. ఉద్యోగులను అసిస్టెంట్లుగా నియమించారు. ఇందులో చాలామందికి ట్యాబ్‌లు, బయోమెట్రిక్‌ల వినియోగం తెలియకపోవడంతో కార్పొరేషన్‌లోని అన్ని విభాగాల్లోని దాదాపు 90 శాతం మంది ఉద్యోగులను సర్వేకు కేటాయించారు. -
ఎప్పటికి అవుతుందో..
అల్లూరు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్మార్ట్‌పల్స్ సర్వే మండలంలో నత్తనడకన జరుగుతోంది. ఈనెల 8వ తేదీన ప్రారంభమైన సర్వేకు ఆదిలోనే సర్వర్ సమస్య ఎదురైంది. మండలంలో మొత్తం 14,300 కుటుంబాలకు సంబంధించి వివరాలు సేకరించేందుకు 38 బందాలను ప్రభుత్వం నియమించింది. ఒక్కో బందంలో ఎన్యూమరేటర్, అసిస్టెంట్, చంద్రన్న బీమా ఏజెంటు, సాక్షరాభారత్ కో–ఆర్డినేటర్లతో పాటు ఇద్దరు సూపర్వైజర్లు ఉన్నారు. వీరంతా కలిసి ప్రారంభించిన సర్వే ఏ మాత్రం ముందుకుకదల్లేదు. కొన్న ప్రాంతాల్లో సిగ్నల్ పనిచేయక, మరికొన్నిచోట్ల సిగ్నల్ ఉన్నా సర్వర్ తరచూ మొరాయించడం, ట్యాబ్‌లు పనిచేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోప్రాంతంలో రోజుకు కేవలం ఒకటి, రెండు కుటుంబ వివరాలు కూడా నమోదు చేయలేకపోతున్నారు. ఈ నెలఖారులోగా సర్వేను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించినా సర్వరు మోరాయించడంతో ఇప్పటివరకు కేవలం మండలంలో 299 కుటుంబాల వివరాలు మాత్రమే సేకరించారు. దీంతో నిర్ధేశించిన సమయానికి సర్వే పూర్తయ్యేలా కనిపించడంలేదు. సర్వర్ కారణం : పూర్ణచంద్రరావు, తహసీల్దార్ సర్వర్ మొరాయించడంతో సర్వే నెమ్మదిగా జరుగుతోంది. అధికారులు సర్వే పనిపై ఉండటంతో తహసీల్దార్ కార్యాలయంలో పాలన కుంటుబడుతోంది -
స్మార్ట్ సర్వేకు సన్నద్ధం
ఇళ్లకు ఫొటోలు, మనుషులకు బయోమెట్రిక్ వేలిముద్రలు కొత్త ఇంటి నంబర్లు, కంటిపాపల నమోదు ఆధార్ లేని వారికి వెంటనే మంజూరు బొండపల్లి, విజయనగరంలో నేటినుంచి శాంపిల్ సర్వే విజయనగరం కంటోన్మెంట్: మీ ఇంట్లో ఐదేళ్ల లోపున్న పిల్లలకు ఆధార్ నంబర్ లేదా? మీ ఇంట్లో ఇంకెవరికయినా బ్యాం కు అకౌంట్ లేదా?? అయితే నిశ్చింతగా ఉండొచ్చు. ప్రభుత్వం మంగళవారం నుంచి స్మార్ట్‌పల్స్ సర్వే ప్రారంభించనుంది. జూలై 6 నుంచి జరగనున్న సర్వేకు పైలట్‌గా జిల్లాలోని బొండపల్లి మండలంలోని ఓ గ్రామం, విజయనగరంలోని ఓ వార్డులో మంగళవారంనుంచి మొదలవుతుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక బృందాలు ఇందుకోసం ఇళ్లనూ సందర్శించి మొత్తం 75 రకాల అంశాలపై సర్వే చేపడతాయి. ఇందుకోసం 31 బ్లాకులుగా విభజించి వాటికి 31 మంది ఎన్యూమరేటర్లను నియమించారు. ఈ సందర్భంగా సర్వేలో బ్యాంక్ అకౌంట్ లేని వారిని గుర్తిస్తే వారికి వెంటనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేందుకు, ఐదేళ్ల లోపున్న వారికి ఆధార్ సంఖ్య లేకపోతే కొత్తగా నంబర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రతి పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించారు. ఈ పైలట్ సర్వే ఈ నెల 30 వరకూ ఉంటుంది. సర్వే వాస్తవాలను తెలియజేస్తుందా? జిల్లాలో ఈ నెల 28 నుంచి చేపట్టనున్న స్మార్ట్ పల్స్ సర్వే కార్యక్రమంంలో వాస్తవమయిన సర్వేను చేపడతారా అన్నదానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పలు సర్వేలు చేపట్టినప్పటికీ ఒకే ఇంటి వద్ద కూచుని లేదా సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఇళ్ల వద్ద కూచుని తెలిసిన వివరాలను రాసేసి వెళ్లిపోయేవారు. ఇప్పుడు కూడా ఇలానే ఉంటుందా లేక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సక్రమంగా చేపడతారా అన్నది తేలాల్సి ఉంది. దీనిపై ప్రజల్లో ఇంకా చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సౌకర్యాలపై ఆరా... ఈ సర్వేలో ప్రజలకు ఎటువంటి సౌకర్యాలున్నాయి? ఏయే సౌకర్యాలు లేవు. అత్యవసరంగా కావాల్సినవేమిటన్న అంశాలను పొందుపరుస్తారు. జిల్లాలోని అన్ని కుటుంబాల వివరాలనూ ట్యాబ్‌లలో బంధిస్తారు. వీటిని ఇంటర్నెట్కు అనుసంధానం చేస్తారు. దీని వల్ల భవిష్యత్తులో ప్రతీ కుటుంబ ఆర్థిక, సామాజిక స్థితిగతులన్నీ తెలుస్తాయి. ప్రస్తుతం జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలకు సంబంధించి వివిధ స్థాయిల్లో కుటుంబాల వివరాలున్నాయి. ఆయా వివరాలతో కలగలిపిన నూతన సర్వే అంశాలను పొందుపరచి వీటిని సిద్ధం చేస్తారు. భవిష్యత్తులో ఏవైనా పథకాలు ప్రవేశపెడితే... వాటికి ఎవరు అర్హులో ఎవరు అనర్హులో తెలియజేసేందుకు, ఈ వివరాలు ఉపయోగపడతాయి. ఇందుకోసం కలెక్టరేట్లో ఇంటర్నెట్, కంప్యూటర్ల విధానాన్ని అమర్చుతున్నారు.