10 రోజుల్లో ప్రజాసాధికార సర్వే పూర్తి
10 రోజుల్లో ప్రజాసాధికార సర్వే పూర్తి
Published Fri, Oct 14 2016 10:00 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
–వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ప్రజాసాధికార సర్వేను మరో 10రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. జిల్లాలో 40 లక్షలకు పైగా జనాభా ఉంటే ఇప్పటి వరకు 30 లక్షల మంది వివరాలు నమోదు చేసినట్లు వివరించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాసాధికార సర్వే తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కర్నూలు నుంచి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2లక్షలు మంది కురువలు ఉన్నారని వీరు మదాసి కురువలుగా, బుడగ జంగాలు 25000 మంది ఉన్నారని వీరు ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సర్వేకు సహకరించడం లేదని తెలిపారు. 88 గ్రామాలకు చెందిన 1.20 లక్షల మంది హాప్‌లైన్‌లో ఉన్నారని అందువల్ల సర్వేలో కొంతమేర వెనుకబడి ఉన్నట్లు వివరించారు. కాగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ నెల చివరిలోగా సర్వేను 100శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే పరిధిలోకి రాని వారు గ్రామ పంచాయతీకి వచ్చి వివరాలు ఇచ్చే విధంగా ప్రచారం చేయాలన్నారు, కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జేసీ హరికిరణ్, రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నరసింహులు, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు
Advertisement
Advertisement