స్మార్ట్‌గా సాధన
Published Fri, Sep 2 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
భీమవరం టౌన్ : ప్రజాసాధికార (స్మార్ట్ పల్స్) సర్వే గడువు నాటికి లక్ష్యాన్ని చేరుకోకపోయినా మన జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది. ఆగస్ట్ నెలాఖరుకు నూరు శాతం సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ గడువు నాటికి జిల్లాలో 74.59 శాతం సర్వే పూర్తయింది. అయితే రాష్ట్రంలో మన జిల్లా ప్రథమస్థానం సాధించడం గమనార్హం. జూలై 8న రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసాధికార సర్వే ప్రారంభమైంది. ఆరంభంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సర్వే నత్తనడకన సాగింది. సర్వే ప్రారంభమైన నెల రోజులకు సమస్యలు పరిష్కారం కావడంతో సర్వే ఊపందుకుంది. ఎన్యుమరేటర్లు రేయింబవళ్లు కష్టించి సర్వే చేశారు.
29.83 లక్షల మంది వివరాల సేకరణ
జిల్లాలో ఆగస్ట్ నెలాఖరుకు 29,83,878 మందికి సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించారు. మండలాల్లో 2686 మంది ఎన్యుమరేటర్లు 8,72,527 కుటుంబాలను సర్వే చేసి 24,54,387 మంది కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ వివరాలను సేకరించారు. మునిసిపాలిటిల్లో 658 మంది ఎన్యుమరేటర్లు1,80,109 కుటుంబాలను సర్వే చేసి 5,29,491 మంది కుటుంబ సభ్యుల బయోమెట్రిక్ వివరాలను సేకరించారు.
మండలాల వారీగా సర్వే వివరాలు
మండలం సర్వే పూర్తయిన కుటుంబాలు సభ్యులు
1. ఆచంట 15,842 44,292
2. ఆకివీడు 21,138 60,367
3. అత్తిలి 20,476 56,451
4. భీమడోలు 19,190 53,294
5. భీమవరం 23,011 66,101
6. బుట్టాయగూడెం 7,201 20,908
7. చాగల్లు 18,967 53,744
8. చింతలపూడి 25,095 72,547
9. దెందులూరు 19,827 55,378
10. దేవరపల్లి 22,157 63,184
11. ద్వారకాతిరుమల 20,738 58,162
12. ఏలూరు 31,340 92,699
13. గణపవరం 19,168 52,111
14. గోపాలపురం 9,637 26,858
15. ఇరగవరం 20,734 56,201
16. జంగారెడ్డిగూడెం 17,920 51,902
17. జీలుగుమిల్లి 6,224 17,036
18. కాళ్ల 20,167 56,067
19. కామవరపుకోట 16,297 48,880
20. కొవ్వూరు 21,113 59,066
21. కొయ్యలగూడెం 12,039 32,154
22. కుక్కునూరు 4 13
23. లింగపాలెం 5,908 45,879
24. మొగల్తూరు 17,106 51,867
25. నల్లజర్ల 25,113 67,060
26. నర్సాపురం 19,491 56,063
27. నిడదవోలు 21,339 58,899
28. నిడమర్రు 14,493 40,344
29. పాలకోడేరు 19,014 53,173
30. పాలకొల్లు 19,579 54,523
31. పెదపాడు 19,480 55,298
32. పెదవేగి 23,293 68,095
33. పెంటపాడు 21,804 58,490
34. పెనుగొండ 19,341 55,051
35. పెనుమంట్ర 18,846 51,655
36. పెరవలి 22,029 62,229
37. పోడూరు 19,656 56,356
38. పోలవరం 7,662 20,848
39. తాడేపల్లిగూడెం 26,680 74,535
40. తాళ్లపూడి 15,735 44,234
41. తణుకు 18,600 51,247
42. టి.నర్సాపురం 15,927 45,027
43. ఉండి 19,561 52,585
44. ఉండ్రాజవరం 22,335 59,600
45. ఉంగుటూరు 24,531 68,463
46. వీరవాసరం 17,091 49,676
47. వేలేరుపాడు 2 4
48. యలమంచిలి 19,626 55,771
మొత్తం 8,72,527 24,54,387
పురపాలక సంఘాల పరిధిలో..
పట్టణం సర్వే పూర్తయిన కుటుంబాలు సభ్యులు
1. భీమవరం 35,690 1,04,747
2. ఏలూరు 41,345 1,24,408
3. జంగారెడ్డిగూడెం 8,473 25,315
4. కొవ్వూరు 11,543 33,422
5. నర్సాపురం 14,218 41,836
6. నిడదవోలు 10,604 30,468
7. పాలకొల్లు 14,536 43,619
8. తాడేపల్లిగూడెం 20,471 57,421
9. తణుకు 23,229 68,255
మొత్తం 1,80,109 5,29,491
Advertisement
Advertisement