ఆగిన 9,622 పింఛన్లు
ఆగిన 9,622 పింఛన్లు
Published Sat, Nov 5 2016 10:43 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
ఈ నెల నుంచి నిలిపివేత
ఎసరు పెట్టిన స్మార్ట్ సర్వే
సాక్షి ప్రతినిధి, ఏలూరు ః రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ పల్స్ సర్వే పింఛన్లకు ఎసరు పెట్టింది. ఈ సర్వే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 9622 పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టింది. పెన్షన్ కార్డులో ఉన్న వివరాలు, తమ వద్ద ఉన్న ఆధార్ వివరాలతో సరిపోలలేదంటూ ఈ నెల నుంచి ఈ పింఛన్లను నిలిపివేస్తూ జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. కారణం చెప్పకుండా అకస్మాత్తుగా పింఛన్ నిలిచిపోవడంతో ఫించన్‌దారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పింఛన్లలో కోత పెట్టిన సంగతి తెలిసిందే. తర్వాత జన్మభూమి కమిటీల పేరుతో మరికొన్ని పింఛన్లకు ఎసరు పెట్టారు. తాజాగా స్మార్ట్ పల్స్ సర్వేను అడ్డం పెట్టుకుని పింఛన్ల ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 9662 పింఛన్లను నిలిపివేయగా, కృష్ణాజిల్లాలో అత్యధికంగా 1344 పింఛన్లు, విజయనగరంలో అత్యల్పంగా 389 పింఛన్లు నిలిచిపోయాయి. మహిళలకు అగ్రపీట వేస్తున్నామని చెప్పే ప్రభుత్వం ఎక్కువ మహిళల పింఛన్లలోనే కోత పెట్టింది. రద్దు అయిన వాటిలో 6702 మంది మహిళలు ఉండగా 2920 మంది పురుషులు ఉన్నారు. 4,803 మంది వితంతువులకు పింఛన్ నిలిపివేశారు. నిలిచిపోయిన వాటిలో అభయహస్తం ఫించన్లు 237, వికలాంగులు 610, వృద్దాప్య పింఛన్లు 3852, కల్లుగీత పింఛన్లు 14, చేనేత వృత్తిదారులకు ఇచ్చే పింఛన్లు 99, వితంతువులకు ఇచ్చే పింఛన్లు 4803 రద్దు అయిన వాటిలో ఉన్నాయి. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ పింఛన్లు నిలిపివేసినట్లు డీఆర్‌డీఎ జిల్లా అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వారు మండలాల వారీగా జాబితాలను ఎంపీడీవోలకు పంపించారు. అకస్మాత్తుగా స్మార్ట్‌సర్వే పేరుతో పింఛన్ల నిలిపివేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.
జిల్లాల వారీగా రద్దు అయిన పింఛన్ల వివరాలు
జిల్లా రద్దు అయిన పింఛన్లు
అనంతపురం 1241
చిత్తూరు 971
తూర్పు గోదావరి 1072
గుంటూరు 612
కడప 825
కృష్ణా 1344
కర్నూలు 648
నెల్లూరు 473
ప్రకాశం 442
శ్రీకాకుళం 630
విశాఖపట్నం 393
విజయనగరం 389
పశ్చిమగోదావరి 570
Advertisement
Advertisement