
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డుపై ఘట్కేసర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. క్షతగాత్రుల్లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. వారంతా దమ్మాయిగూడకు చెందిన కమలాకర్ శర్మ కుటుంబం సభ్యులుగా తెలిసింది. తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కమలాకర్ శర్మ హోండా సిటీ కారు ప్రమాదానికి గురైంది.
(చదవండి: సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్)
Comments
Please login to add a commentAdd a comment