Na Love Story Modalaindi
-
మహిళలు చూడాల్సిన చిత్రమిది
‘‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘నా లవ్‌స్టోరీ’. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్‌ను సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. యువతకి బాగా నచ్చుతుంది. ప్రతి మహిళ ఈ సినిమా తప్పక చూడాలి’’ అని దర్శకుడు జి. శివ గంగాధర్ అన్నారు. మహీధర్, సోనాక్షిసింగ్ జంటగా కె. శేషగిరిరావు నిర్మిస్తున్న ‘నా లవ్‌స్టోరీ’ మోషన్ పోస్టర్ని జర్నలిస్ట్, శాటిలైట్ కన్సల్టెంట్ రాఘవేంద్రరెడ్డి విడుదల చేశారు. కె. శేషగిరిరావు మాట్లాడుతూ –‘‘సినిమా తీయాలని తిరుగుతున్న రోజుల్లో శివగారు పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో నిర్మించాం. శివ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’’ అన్నారు. ‘‘శివగారు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ‘నా లవ్ స్టోరీ’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు మహీధర్. సోనాక్షి సింగ్, మ్యూజిక్ డైరక్టర్ వేధనేవన్, నటులు శివన్నారాయణ, తోటపల్లి మధు పాల్గొన్నారు. -
ప్రేమకథ మొదలైంది!
‘లీడర్’ ఫేం ప్రియా ఆనంద్ తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్నారు. విజయవంతమైన చిత్రాల్లో నటించడంతో పాటు నటిగా నిరూపించుకునే అవకాశం ఉన్న చిత్రాల్లో నటిస్తున్నారామె. తమిళంలో ప్రియా నటించిన విజయవంతమైన చిత్రాల్లో ‘ఎదిర్ నీచల్’ ఒకటి. ఆర్.యస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో హీరో ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో శివకార్తికేయన్ హీరో. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు విడుదల చేస్తున్నారు. ‘వై దిస్ కొలవెరి..’ పాట ఫేం అనిరుథ్ స్వరపరచిన పాటలను ఇటీవలే విడుదల చేశారు. ఈ నెలాఖరున సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘తన మనసుని గెల్చుకోవాలంటే ఏదైనా ప్రయోజనాత్మక పని చేయాలని ప్రియురాలు విధించిన నిబంధనను నిజం చేయడానికి ఓ కుర్రాడు ఏం చేశాడు? అనేదే ఈ చిత్రకథ. హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా నటనకు అవకాశం ఉంది. ప్రేమ, వినోదం, సెంటిమెంట్ సమాహారంతో ఈ చిత్రం ఆసక్తికరంగా సాగుతుంది. ధనుష్, నయనతార చేసిన ప్రత్యేక పాట సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది’’ అని చెప్పారు. -
ధనుష్, నయనతార ప్రత్యేక పాటతో నా లవ్‌స్టోరీ మొదలైంది
శివకార్తికేయన్, ప్రియా ఆనంద్ జంటగా తమిళ హీరో ధనుష్ నిర్మించిన చిత్రం ‘ఎదిర్ నీచల్’. ఆర్.యస్. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ధనుష్, నయనతార ఓ ప్రత్యేక పాట చేయడం విశేషం. ఈ చిత్రాన్ని ‘నా లవ్‌స్టోరీ మొదలైంది’ పేరుతో జె. రామాంజనేయులు తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ’కొలవెరి..’ ఫేం అనిరుథ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. డి.రామానాయుడు సీడీని ఆవిష్కరించి గోపిచంద్‌కి ఇచ్చారు. ఈ చిత్ర నిర్మాత తెలుగులోనూ సినిమాలు నిర్మించాలని రామానాయుడు ఆకాంక్షించారు. తమిళంలో విజయం సాధించిన చిత్రమిదని, పాటలు బాగుంటాయని గోపిచంద్ చెప్పారు. ఇంకా ఈ వేడుకలో పాల్గొన్న ప్రకాష్‌రాజ్, సందీప్ కిషన్, నారా రోహిత్, ప్రిన్స్, సురేష్ కొండేటి తదితరులు సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. తమిళంలో లానే... తెలుగులో కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని శివకార్తికేయన్ అన్నారు. జీవితంలో ఆశావహ దృక్పథంతో ఉంటే అన్నీ సాధించగలుగుతామనే కథాంశంతో ఈ చిత్రం చేశామని దర్శకుడు తెలిపారు. ‘‘ముందుగా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టి, నిర్మాతగా మారి వరుసగా సినిమాలు నిర్మిస్తున్నాను’’ అని నిర్మాత చెప్పారు. పాటలతో పాటు సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని అనిరుథ్ కోరారు.