‘‘రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘నా లవ్‌స్టోరీ’. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్‌ను సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేశాం. యువతకి బాగా నచ్చుతుంది. ప్రతి మహిళ ఈ సినిమా తప్పక చూడాలి’’ అని దర్శకుడు జి. శివ గంగాధర్ అన్నారు. మహీధర్, సోనాక్షిసింగ్ జంటగా కె. శేషగిరిరావు నిర్మిస్తున్న ‘నా లవ్‌స్టోరీ’ మోషన్ పోస్టర్‌ని జర్నలిస్ట్, శాటిలైట్ కన్సల్టెంట్ రాఘవేంద్రరెడ్డి విడుదల చేశారు.
కె. శేషగిరిరావు మాట్లాడుతూ –‘‘సినిమా తీయాలని తిరుగుతున్న రోజుల్లో శివగారు పరిచయమయ్యారు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో నిర్మించాం. శివ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’’ అన్నారు. ‘‘శివగారు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ‘నా లవ్ స్టోరీ’ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు మహీధర్. సోనాక్షి సింగ్, మ్యూజిక్ డైరక్టర్ వేధనేవన్, నటులు శివన్నారాయణ, తోటపల్లి మధు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment