చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమరన్ సినిమా నడుస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్‌పై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. బాంబు దాడి నేపథ్యంలో పెద్ద శబ్ధం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ధియేటర్‌లో శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పెట్రోల్ బాంబు దాడులపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టినట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే, శివకార్తికేయన్ అంటే గిట్టని వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
A petrol bomb incident has stirred tension at Alangaar Theatre in Melapalayam, Tirunelveli, early this morning.
The incident reportedly linked to opposition to actor Sivakarthikeyan's film #Amaran, was captured on CCTV footage. pic.twitter.com/jN3QoLrBzz— South First (@TheSouthfirst) November 16, 2024
Comments
Please login to add a commentAdd a comment