petrol bomb attack
-
వీడియో: అమరన్ సినిమా ఆడుతున్న థియేటర్‌పై పెట్రోల్ బాంబు దాడి
చెన్నై: తమిళనాడులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమరన్ సినిమా నడుస్తున్న థియేటర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు విసిరారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. చెన్నై తిరునల్వేలి జిల్లా మేలప్పాలయంలోని అలంకార్ థియేటర్‌పై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు దాడి జరింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు థియేటర్‌పై పెట్రోల్ బాంబులు విసిరారు. బాంబు దాడి నేపథ్యంలో పెద్ద శబ్ధం వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ధియేటర్లో శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పెట్రోల్ బాంబు దాడులపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు చేపట్టినట్టు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు పోలీసులు. అయితే, శివకార్తికేయన్ అంటే గిట్టని వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.A petrol bomb incident has stirred tension at Alangaar Theatre in Melapalayam, Tirunelveli, early this morning.The incident reportedly linked to opposition to actor Sivakarthikeyan's film #Amaran, was captured on CCTV footage. pic.twitter.com/jN3QoLrBzz— South First (@TheSouthfirst) November 16, 2024 -
నీట్ ఎగ్జామ్: బీజేపీ ఆఫీస్‌పై బాంబు దాడి.. .రౌడీ షీటర్ అరెస్ట్!!
చెన్నై(తమిళనాడు): టీ నగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై పెట్రో బాంబు దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు దుండగులు పెట్రోల్ బాటిళ్లతో ఆఫీస్‌పై దాడికి తెగపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటనకు సంబంధించి వినోద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నీట్ పరిణామాలతోనే తాను బీజేపీ ఆఫీస్‌పై పెట్రోల్ బాంబుతో దాడి చేశానని ఆ యువకుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై. వినోద్ ఒక రౌడీ షీటర్ అని.. చదువుకు అతనికి పొంతన లేదని, అలాంటప్పుడు నీట్ వ్యతిరేకంగా దాడి ఎందుకు చేస్తాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉండొచ్చని.. ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాడు. ఇక దాడి అనంతరం ఆఫీస్‌ను పరిశీలించిన అన్నామలై.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉండగా.. నీట్‌పై తమిళనాడు ముందు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో వ్యతిరేక బిల్లు సైతం రూపొందించి ఆమోదించగా.. బీజేపీ అడ్డుచెప్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. కొన్ని నెలల తర్వాత పరిశీలించిన గవర్నర్.. బిల్లును ఆమోదించకుండానే అసెంబ్లీకి వెనక్కి తిప్పి పంపారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిణామాలు తట్టుకోలేకనే తాను దాడికి పాల్పడినట్లు వినోద్ చెప్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత కొందరితో కలిసి పెట్రల్ సీసాలను బీజేపీ ఆఫీసుల్లోకి విసిరాడు వినోద్. ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాలకు బానిసైన వినోద్‌పై రౌడీ షీట్ కూడా ఉందని, సీసీ ఫుటేజీ ద్వారా మిగతా నిందితులను పట్టుకుంటామని టీనగర్ డీసీపీ హరి చెబుతున్నారు. -
సన్నిధానంలో శ్రీలంక మహిళ
శబరిమల: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో కేరళలో రాజుకున్న ఉద్రిక్తత శుక్రవారం కూడా కొనసాగింది. దేవస్థానం బోర్డు సభ్యుడి ఇంటితో పాటు మరికొన్నిచోట్ల ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరి అలజడి సృష్టించారు. ఈ సందర్భంగా శబరిమల అయ్యప్పస్వామిని శ్రీలంకకు చెందిన శశికళ(47) అనే మహిళ దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. గురువారం అర్ధరాత్రి శశికళ గుడిలోకి చేరుకుని పూజలు నిర్వహించినట్లు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది. భర్త శరవణ్, కుమారుడు దర్శన్‌తో కలిసి ఆమె ఆలయానికి వచ్చారని వెల్లడించింది. మరోవైపు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారన్న వాదనల్ని శశికళ ఖండించారు. తాను స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు యత్నించినప్పటికీ పోలీసులు అనుమతించలేదని అన్నారు. ఆలయానికి రాకముందు తాను 41 రోజుల వ్రతం పాటించానని వెల్లడించారు. స్వామి దర్శనానికి వెళ్లినప్పుడు భక్తుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదురుకాలేదని పేర్కొన్నారు. ‘పోలీస్ అధికారులు నన్ను ఎందుకు అనుమతించలేదు? మీరంతా(మీడియా) నా చుట్టూ ఎందుకు నిలబడ్డారు? నేను ఎవరికీ భయపడను’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కుమారుడితో కలిసి తాను మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకున్నానని శశికళ భర్త శరవణ్ స్పష్టం చేశారు. మరోవైపు భద్రతా కారణాలతోనే శశికళ అలా చెప్పి ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. అయ్యప్పస్వామి దర్శనానికి శుక్రవారం శబరిమల వచ్చిన కయాల్ అనే ట్రాన్స్‌జెండర్‌ను భక్తుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు వెనక్కి పంపారు. బిందు, కనకదుర్గ అనే మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి నిరసనగా కొందరు దుండగులు శుక్రవారం తెల్లవారుజామున మలబార్ దేవస్థానం బోర్డు సభ్యులు కె.శశికుమార్ ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరి పరారయ్యారు. అలాగే పతనంతిట్ట ప్రాంతంలోని ఓ మొబైల్ షాపుపై పెట్రోల్‌బాంబు దాడి జరిగింది. 200 మంది అరెస్ట్! సీపీఎం, బీజేపీ కార్యకర్తల మధ్య హింస తీవ్రంగా చెలరేగుతున్న కన్నూర్‌లో 200 మంది ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్లు, గొడవల నేపథ్యంలో 801 కేసులు నమోదుచేసిన పోలీసులు.. 1,369 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. పాలక్కడ్‌తో పాటు కసర్గోడ్ జిల్లా మంజేశ్వరమ్‌లో నిషేధాజ్ఞలు విధించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు ప్రవేశించరాదని ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు 2018, సెప్టెంబర్‌లో కొట్టివేసిన సంగతి తెలిసిందే. -
టీటీవీ దినకరన్ ఇంటిపై దాడి
-
దినకరన్ వాహనంపై పెట్రోల్ బాంబు దాడి
-
దినకరన్ ఇంటిపై బాంబుదాడికి యత్నం
సాక్షి, చెన్నై : శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఇంటిపై బాంబు దాడి యత్నం జరిగింది. ఆదివారం ఉదయం పెట్రోల్ బాంబుతో ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో బాంబు అదే కారులో పేలిపోగా.. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. దాడి సమయంలో దినకరన్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. బుల్లెట్ పరిమళం అనే వ్యక్తిని ఇటీవలె దినకరన్ పార్టీ నుంచి తొలగించారు. దీంతో దినకరన్‌పై పగ పెంచుకున్న పరిమళం ఆయన ఇంటికి చేరుకుని బాంబు దాడికి యత్నించాడు. ఈ క్రమంలో కారులో బాంబును తీసుకుని ఆదివారం దినకరన్ ఇంటి వద్దకు పరిమళం చేరుకున్నాడు. ఆ సమయంలో బాంబు అదే కారులో పేలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దినకరన్ ఓ బచ్చా... దినకరన్ వాహనంపై రాళ్లదాడి -
తూత్తుకుడి: పోలీస్‌స్టేషన్‌పై పెట్రోబాంబ్ దాడి
తూత్తుకుడి : స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా నిరసనలతో అట్టుడుకుతున్న తూత్తుకుడి ఇంకా రగులుతునే ఉంది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని శనివారం దుండగులు పెట్రోల్ బాంబు దాడి చేశారు. తూత్తుకుడిలోని పోలీసుస్టేషన్‌పై పెట్రోల్ బాంబు విసిరారు. పోలీసులపై రాళ్లతో దాడి చేస్తూ.. తరుముతున్న ఆందోళనకారులు. నాలుగు రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గట్లేదు. ఇది చదవండి: రణరంగంగా తూత్తుకుడి -
ఆ ఛానెల్ వార్తను నమ్మొద్దు : స్టార్ హీరో
సాక్షి, చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ అసత్యపు కథనాలపై స్పందించారు. తన ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగిందంటూ ఓ ప్రముఖ ఛానెల్ లో వస్తున్న వార్తను ఆయన ఖండించారు. ‘సన్ న్యూస్ ఛానెల్లో నా ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి జరిగినట్లు ఫ్లాష్ న్యూస్ స్క్రోలింగ్ వస్తోంది. అది నిజం కాదు’ అని ఆయన కాసేపటి క్రితం ట్వీట్ చేశారు. కాగా, గతంలో డీఎంకే పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన.. కరుణానిధి కుటుంబంతో విభేధాల కారణంగా 2006లో పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం అఖిల భారతీయ సమతువా మక్కల్ అనే రాజకీయ పార్టీతో ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. The flash news scrolling in Sun News channel that petrol bombs have been hurled at my house is not true — R Sarath Kumar (@realsarathkumar) 11 March 2018 -
సూకీ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
యంగూన్: మయన్మార్ ప్రభుత్వ కౌన్సిలర్ అంగ్ సాన్ సూకీ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఝా హెచ్టయ్ గురువారం అధికారంగా ప్రకటించారు. గుర్తుతెలియని దుండగులు సూకీని లక్ష్యంగా చేసుకుని.. ఇంటి ఆవరణలో బాంబు విసిరారని ఆయన స్పష్టం చేశారు. కానీ ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ పెట్రోల్ బాంబు దాడి ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి
జమ్మూకశ్మీర్: తన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు దాడులు చేశారని జమ్మూకశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ అన్నారు. శ్రీనగర్ లోని పర్రే పోరా ప్రాంతంలోని ఆయన నివాసంపై రెండు పెట్రోల్ బాంబులు విసిరారని ఆయన స్వయంగా మీడియాకు చెప్పారు. ప్రస్తుతం ఆ ఇంటికి ఎవరి భద్రత లేదు. నయీమ్ తన కుటుంబ సభ్యులతో సహా ఎవరూ ఈ దాడి జరిగినప్పుడు ఇంట్లో లేకపోవడంతో కొంత ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మంత్రి నయీమ్ గుప్కార్ రోడ్డులోని ప్రభుత్వ బంగళాలో ఉంటున్నారు. గత నెల(జూలై 8)న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనిని భారత భద్రత బలగాలు చంపేసిన అనంతరం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. -
అర్ధరాత్రి కలకలం
►మంత్రి కార్యాలయంపై పెట్రో బాంబులతో దాడి ► అన్నాడీఎంకే కార్యాలయంపైనా నాటు బాంబులు ► మంత్రి సెల్లూరు కె. రాజు టార్గెట్‌గా దాడి? సాక్షి, చెన్నై : మదురైలో అర్ధరాత్రి కలకలం రేగింది. మంత్రి సెల్లూరు కె. రాజును టార్గెట్ చేస్తూ, ఆయన కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు నా టు, పెట్రోల్ బాంబులతో దాడికి దిగా రు. అన్నాడీఎంకే కార్యాలయంపై కూ డా పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫలితంగా కార్యాలయాలకు , చెన్నైలో ని సెల్లూరు కె. రాజు ఇంటికి భద్రతను పెంచారు. మదురైలో ఇటీవల కాలంగా అధికార అన్నాడీఎంకే వర్గాల మధ్య గ్రూ పు తగాదాలు రాజుకుంటూ వస్తున్నాయి. చాపకింద నీరులా కొందరు మంత్రి సెల్లూరు రాజుకు వ్యతిరేకంగా వ్యవహరించడం మొదలెట్టారు. అయి తే, సీఎం జయలలిత వద్ద మంత్రికి మంచి గుర్తింపు ఉండటంతో వ్యతిరేక శక్తులు కుదేల్ కాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం నేతృత్వంలో ఓ కార్యక్రమానికి మదురైలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ విషయంగా సెమ్మం పట్టిలోని తన కార్యాలయంలో పార్టీ వర్గాలతో పన్నెం డు గంటల వరకు మంత్రి సెల్లూరు రాజు సమాలోచనలో నిమగ్నం అయ్యా రు. తదుపరి అక్కడి నుంచి వెళ్లి పోయా రు. ఆయన అటు వెళ్లిన కాసేపటికే మోటారు సైకిళ్లపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబుల్ని విసిరారు. వరుసగా బాంబుల దాడి జరగడం, పెద్ద శబ్దం రావడంతో ఆ పరిసర వాసులు అటు వైపుగా పరుగులు తీశా రు. దీంతో అక్కడి నుంచి ఆ వ్యక్తులు ఉడాయించారు. అదే సమయంలో మ దురై పనగల్ సాలైలో ఉన్న అన్నాడీఎం కే కార్యాలయంపై పెట్రోల్ బాంబు దా డి జరగడంతో కలకలం బయలుదేరిం ది. సమాచారం అందుకున్న కమిషనర్ శైలేష్‌కుమార్ నేతృత్వంలో అధికార వ ర్గాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ పెట్రోల్ బాంబు దా డిలో మంత్రి కార్యాలయం తలుపులు ధ్వంసం అయ్యాయి. అన్నాడీఎంకే కా ర్యాలయంలో విద్యుత్ లైట్లు దెబ్బతిన్నాయి. అక్కడ పేలకుండా పడి ఉన్న కొన్ని నాటు, పెట్రోబాంబుల్ని పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘట నల్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు యంత్రాంగం, దీనివెనుక ఉన్నవారి భ రతం పట్టేందుకు ఐదు బృందాల్ని రం గంలోకి దించారు. తిరుమల నాయకర్ జయంతి అధికారిక ప్రకటన ప్రయత్నా ల సమయంలో తీవ్రంగా వ్యతిరేకించిన తమిళ సంఘం ఈ దాడి చేసి ఉండొచ్చ న్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అదే సమయంలో అన్నాడీఎంకే లో సాగుతున్న గ్రూపు విభేదాలను కూ డా పోలీసులు పరిగణలోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. తన కా ర్యాలయం, పార్టీ కార్యాలయంపై దాడి సమాచారంతో ఉదయాన్నే అక్కడికి చేరుకుని మంత్రి సెల్లూరు రాజు పరిశీ లించారు. అయితే, మంత్రిని టార్గెట్ చేసి దాడికి వ్యూహ రచన జరిగి ఉండొచ్చని, ఆయన అక్కడి నుంచి వెళ్లి పోవ డం వల్ల పెను ప్రమాదం చోటు చేసుకోలేదని పలువురు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటన తో మదురైలోని సెల్లూరు రాజు ఇళ్లు, కార్యాల యాలకు, చెన్నై గ్రీన్ వేస్ రోడ్డులోని ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల అదుపులో అనుమానితులు ఈ దాడికి సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో అన్నాడీఎంకే కౌన్సిలర్ మురుగేషన్ సైతం ఉండడంతో దర్యాప్తును ముమ్మరంచేసి ఉన్నారు. గతవారం మదుర మీనాక్షి అమ్మవారి ఆలయ పరిసరాల్లో పెట్రో బాంబులు లభించిన ఘటన మరువక ముందే, ప్రస్తుతం మళ్లీ రాష్ర్ట మంత్రిని టార్గెట్ చేసి దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. -
ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడి
పూడి(తడ): ఆత్మకూరు నుంచి చెన్నై వెళుతున్న ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు మంగళవారం సాయంత్రం కర్రలు, పెట్రోలు బాంబుతో దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు.. ముఖాలకు చేతిగుడ్డలు కట్టుకున్న 8 మంది యువకులు బైక్‌లపై వేగంగా వచ్చి నెల్లూరు జిల్లా తడ మండలం పూడి గ్రామం వద్ద బస్సును ఆపారు. వెంటనే కర్రలతో బస్సు అద్దాలు పగులగొట్టి వాటర్ ప్యాకెట్ సైజులో ఉన్న పెట్రోల్ బాంబును బస్సులోకి విసిరారు. దీంతో బస్సు ముందుభాగంలో మంటలొచ్చాయి.ఈ సందర్భంగా వారు ఉపయోగించిన కత్తి బస్సులో పడిపోయింది. తమిళనాడుకు వెళ్లే బస్సులపై దాడులు జరగొచ్చన్న భయంతో రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ఆ రాష్ట్రానికి వెళ్లే సర్వీసులను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.