ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడి | petrol bomb attack on RTC bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడి

Published Wed, Apr 8 2015 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడి

ఆర్టీసీ బస్సుపై పెట్రోల్ బాంబుతో దాడి

పూడి(తడ): ఆత్మకూరు నుంచి చెన్నై వెళుతున్న ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు మంగళవారం సాయంత్రం కర్రలు, పెట్రోలు బాంబుతో దాడి చేశారు. స్థానికుల సమాచారం మేరకు.. ముఖాలకు చేతిగుడ్డలు కట్టుకున్న 8 మంది యువకులు బైక్‌లపై వేగంగా వచ్చి నెల్లూరు జిల్లా తడ మండలం పూడి గ్రామం వద్ద బస్సును ఆపారు. వెంటనే కర్రలతో బస్సు అద్దాలు పగులగొట్టి వాటర్ ప్యాకెట్ సైజులో ఉన్న పెట్రోల్ బాంబును బస్సులోకి విసిరారు.

దీంతో బస్సు ముందుభాగంలో మంటలొచ్చాయి.ఈ సందర్భంగా వారు ఉపయోగించిన కత్తి బస్సులో పడిపోయింది. తమిళనాడుకు వెళ్లే బస్సులపై దాడులు జరగొచ్చన్న భయంతో రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ఆ రాష్ట్రానికి వెళ్లే సర్వీసులను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement