సూకీ ఇంటిపై పెట్రోల్‌ బాంబు దాడి | Petrol bomb thrown at Aung San Suu Kyis home | Sakshi
Sakshi News home page

సూకీ ఇంటిపై పెట్రోల్‌ బాంబు దాడి

Published Thu, Feb 1 2018 1:56 PM | Last Updated on Thu, Feb 1 2018 2:28 PM

Petrol bomb thrown at Aung San Suu Kyis home - Sakshi

యంగూన్: మయన్మార్‌ ప్రభుత్వ కౌన్సిలర్‌ అంగ్‌ సాన్ సూకీ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఝా హెచ్‌టయ్ గురువారం అధికారంగా ప్రకటించారు. గుర్తుతెలియని దుండగులు సూకీని లక్ష్యంగా చేసుకుని.. ఇంటి ఆవరణలో బాంబు విసిరారని ఆయన స్పష్టం చేశారు.

కానీ ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ పెట్రోల్‌ బాంబు దాడి ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement