ఆ వార్తల్లో నిజం లేదు | Priya Anand with Gautham love Rumors | Sakshi
Sakshi News home page

ఆ వార్తల్లో నిజం లేదు

May 4 2015 1:56 AM | Updated on Sep 3 2017 1:21 AM

ఆ వార్తల్లో నిజం లేదు

ఆ వార్తల్లో నిజం లేదు

నటి ప్రియాఆనంద్‌ను తాను ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడు గౌతం కార్తిక్ తెలిపారు.

చెన్నై: నటి ప్రియాఆనంద్‌ను తాను ప్రేమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నటుడు గౌతం కార్తిక్ తెలిపారు. గౌతం కార్తిక్,
ప్రియాఆనంద్ ప్రేమించుకుంటున్నట్లు కోలీవుడ్ సమాచారం. దీని గురించి గౌతం కార్తిక్ మాట్లాడుతూ ప్రియా ఆనంద్ తనకు స్నేహితురాలు మాత్రమే, అయితే తాము ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వెలువడుతున్నాయన్నాడు.

'సిపాయి' చిత్రంలో తనతో నటిస్తున్న లక్ష్మీమీనన్‌తో లవ్ ఎఫైర్ ఉన్నట్లు వదంతులు వ్యాపించాయని, గతంలో 'కడల్' చిత్రంలో నటిస్తుండగా తులసిని ప్రేమిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయన్నాడు. అయితే ఆ గాలి వార్తలన్నిటినీ తాను స్పోర్టివ్‌గానే తీసుకుంటున్నానని,  తదుపరి రిలీజ్ కానున్న చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పాడు. ఈ ఏడాది తాను నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కానున్నాయని. అందువల్ల ఈ ఏడాది ముఖ్యమైన సంవత్సరంగా భావిస్తున్నట్లు గౌతం కార్తిక్ తెలిపాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement