వదంతులకు భయపడే.... | Priya Anand clarifies rumors linking her with Tamil Actor | Sakshi
Sakshi News home page

వదంతులకు భయపడే....

Published Sun, Jun 29 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 9:31 AM

వదంతులకు భయపడే....

వదంతులకు భయపడే....

నిప్పు లేనిదే పొగ రాదన్నది సామెత. అయితే మన హీరోయిన్లు మాత్రం నిప్పు లేకుండానే పొగ పెడుతున్నారని వాపోతుంటారు. వీరిలో రెండు రకాల హీరోయిన్లను చూస్తుంటాం. కొందరు  వదంతులను ఎంజాయ్ చేస్తున్నాం అంటుంటారు. మరికొందరు ఆవేదన కలిగిస్తున్నాయంటుంటారు. మూడవ రకం కూడా ఉన్నారు. తమపై తామే వదంతులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. మరి ఈ మూడు రకాల నాయికల్లో నటి ప్రియా ఆనంద్ ఏ రకానికి చెందుతారో గానీ వదంతులు వణికిస్తున్నాయంటున్నారు.
 
 పస్తుతం కోలీవుడ్‌లో ఈ బ్యూటీ పేరు బాగానే ప్రచారంలో ఉంది. చేతి నిండా చిత్రాలు కూడా ఉన్నాయి. ఎదిర్ నీచ్చల్ చిత్రంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేసిన ఈ భామ గాలి వీచేలా చేసింది. ఈ అమ్మడి గురించి పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అవన్నీ అసత్యాలంటున్న ప్రియా ఆనంద్ తన వెర్షన్‌ను చెప్పుకొస్తూ ఇలాంటి అనవసరపు పుకార్లు పుట్టుకొస్తాయనే స్నేహితుల పుట్టిన రోజు పార్టీలకు కూడా దూరంగా ఉంటున్నానన్నారు. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో తాను ఆశించిన స్థాయి లభించిందన్నారు. అరిమా నంబి, ఒరు ఊరుల రెండు రాజ, వై రాజా వై, ఇరుంబు కుదిరై చిత్రాల్లో నటిస్తున్నట్లు చెప్పారు.
 
 ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్యభరిత పాత్రలను పోషిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నాయికలు నేపథ్య గాయనీమణులుగా మారుతున్న సీజన్ తనలోను గాయనికి కావలసిన అర్హతలున్నాయన్నారు. వాటిని సంప్రదాయబద్ధంగా నేర్చుకున్నానని చెబుతూ పాటలు పాడాలనే తన ఆసక్తిని చెప్పకనే చెప్పారు. ఇకపోతే తన గురించి పుకార్లు పరుగులు తీస్తున్నాయని అలాంటి వాటిని జాలీగానే తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే తానెవరితోను పోటీలకు వెళ్లనన్నారు. కారణం ఇలాంటి వదంతుల ప్రచారం అవుతాయనేనన్నారు. సినిమా కార్యక్రమాలకు సంబంధించిన పార్టీలకు కూడా వెళ్లనని అయినా తనపై వదంతులు ప్రచారం అవడం వింతగా ఉందని ప్రియా ఆనంద్ చెప్పుకుంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement