ఆరు నుంచి ఆరు | Suriya and director Hari team up for the sixth time | Sakshi
Sakshi News home page

ఆరు నుంచి ఆరు

Published Fri, Nov 2 2018 2:03 AM | Last Updated on Fri, Nov 2 2018 2:03 AM

Suriya and director Hari team up for the sixth time - Sakshi

సూర్య

హీరో సూర్య, దర్శకుడు హరిలది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వీళ్లిద్దరూ ఆల్రెడీ ‘ఆరు, వేల్‌ (తెలుగులో ‘దేవా’) ‘సింగం’ సిరీస్‌లో మూడు సినిమాలు.. ఇప్పటివరకూ మొత్తంగా ఐదు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ‘ఆరు’ సినిమాతో కలసిన ఈ కాంబినేషన్‌ ఆరో సినిమా కోసం చేతులు కలపబోతున్నారని కోలీవుడ్‌ సమాచారం. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక ‘సన్‌ పిక్చర్స్‌’ బ్యానర్‌ నిర్మించనుందట. అయితే సూర్య, హరి చేయబోయే చిత్రం ‘సింగం’ సిరీస్‌ సీక్వెల్‌ కోసం కాదు. ‘వేల్‌’ సీక్వెల్‌ అని చెన్నై టాక్‌.

మరోవైపు సీక్వెల్‌ కాదు.. ‘వేల్‌’ సినిమా తరహాలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందనే వార్త వినిపిస్తోంది. 2019లో సెట్స్‌ మీదకు వెళ్లే ఈ చిత్రంలో సూర్య సరసన ప్రియా ఆనంద్, సమీరా రెడ్డి యాక్ట్‌ చేయనున్నారు. ప్రస్తుతం దర్శకుడు సెల్వ రాఘవన్‌తో ‘యన్‌జీకే’, కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ మూవీ చేస్తున్నారు సూర్య. అలాగే ‘గురు’ ఫేమ్‌ సుధా కొంగర దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఒప్పుకున్నారు సూర్య. దాంతో పాటుగా హరి చిత్రాన్ని కూడా సెట్స్‌ మీదకు తీసుకెళ్తారని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement