బిరియానితో హీరోయిన్లను వశీకరిస్తున్న హీరో | Hero Arya traps Heroines with biryani food | Sakshi
Sakshi News home page

బిరియానితో హీరోయిన్లను వశీకరిస్తున్న హీరో

Published Wed, Apr 9 2014 9:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

బిరియానితో హీరోయిన్లను వశీకరిస్తున్న హీరో

బిరియానితో హీరోయిన్లను వశీకరిస్తున్న హీరో

వివాహ భోజనంబు వింతైన వంటకంబు అనేది మంచి పాట. బిరియానితో విందు దీని తస్సదీయ భలే పసందు. కొందరి వశీకరణకిది మంచి మందు అన్నది మాట. కొందరిని మంచి చేసుకోవాలన్నా. కొన్ని పనులు జరగాలన్నా ముందుగా అవుతోంది బిరియాని విందు. సినిమా రంగానికొస్తే కోలీవుడ్‌లో నటుడు ఆర్య బిరియాని విందుతో అందమైన హీరోయిన్లను వశపరచుకుంటారన్న పేరుంది. ఇదేదో బాగున్నట్లుందని నటి ప్రియా ఆనంద్ ఆర్య ననుసరించాలనుకుంటున్నారట. బిరియాని విందుతో హీరోలను కాకాపట్టే పనిలో ఉన్నట్లు సమాచారం.
 
 ప్రియా ఆనంద్ ప్రస్తుతం కోలీవుడ్‌లోని బిజీ హీరోయిన్లలో ఒకరు. వైరాజావై, ఒరు ఊరుల రెండు రాజా తదితర చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్‌కు ఇప్పటి వరకు వంట చేయడం రాదట. నేర్చుకుందామంటే టైమ్ చాలడం లేదట. దీంతో ఇటీవల పది రోజుల విరామం లభించడంతో వంటలతో కుస్తీ పట్టారట. దీంతో ఈ బ్యూటీ ఇప్పుడు నార్త్ ఇండియన్ వంటకాలతోపాటు చైనీస్ కుకింగ్‌లోను తర్ఫీదు పొందారట. తన వంటకాల చాతుర్యాన్ని త్వరలోనే పరిక్షించదలచారు.
 
 ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒరు ఊరుల రెండు రాజా చిత్ర యూనిట్ తన చేతి బిరియాని రుచిని చూపిస్తానని చెప్పారట. దీంతో ప్రియా ఆనంద్ బిరియాని విందు కోసం ఆ చిత్ర హీరో విమల్, హాస్యనటుడు సూరి, దర్శకుడు ఆర్.కన్నన్ తదితర యూనిట్ సభ్యులు ఎదురు చూస్తున్నారట. ఉండబట్టలేక బిరియాని విందు ఎప్పుడని ప్రియా ఆనంద్‌ను అడిగేశారట. దీనికా ముద్దుగుమ్మ చిత్ర షూటింగ్ ముగింపు రోజున  బిరియాని విందునిస్తానని మాటిచ్చారట. ఇక ప్రియా ఆనంద్ నటించే ప్రతి చిత్ర షూటింగ్ చివరి రోజున ఆమె బిరియాని విందును రుచిచూడవచ్చన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement